"మాయ"దారి మనిషి
• మాయదారి మనోడు
అందరు ఒకటే నంటాడు.
• మాయ లో మునుగు తాడు
మైకంతో ఉంటాడు.
• అత్యాశతో బ్రతుకు తాడు
ఆనందం కావాలంటాడు.
మాటలు చెపుతాడు
ముగ్గు లో దించుతాడు.
చాప కింద నీరులా
చాప కింద నీరులా ... పాకుతాడు
బెదిరిస్తే బెంబేలు పడతాడు.
• మాయదారి మనోడు
అందరు ఒకటే నంటాడు.
మాయ లో మునుగు తాడు
మైకంతో ఉంటాడు.
• మహిళలను మహరాణులంటాడు
వికారాల వల వేస్తాడు.
అడ్డదారు లెతుకుతాడు
అది రాజ మార్గమంటాడు.
మంచోళ్లే తోడు కావాలంటూ
భ్రష్టు ను పూసి …
వారికి భ్రష్టు ను పూసి
తానే బంగారమంటాడు.
• మాయదారి మనోడు
అందరు ఒకటే నంటాడు.
మాయ లో మునుగు తాడు
మైకంతో ఉంటాడు.
• మనిషి మారడు కానీ
మనుషులు కావాలంటాడు.
దొంగాటలు ఆడుతాడు కానీ
దొంగను కాదంటాడు
నీతులెన్నో చెబుతాడు …
నీతులెన్నో చెబుతాడు
అవి ఇతరులకే అంటాడు.
• మాయదారి మనోడు
అందరు ఒకటే నంటాడు.
మాయ లో మునుగు తాడు
మైకంతో ఉంటాడు.
యడ్ల శ్రీనివాసరావు 5 Feb 2024 8:00 pm.
No comments:
Post a Comment