మనో శతకం - 6
స్థితి స్థిరంబెరిగిన పరిస్థితిలెన్నడు పగలబడవు.
మతిన మరకలున్న మైలుబడి మూలబడున్
దేహంబు నిలవని దైవమ్ బుద్ధికి శాపమ్.
జ్ఞానంబెరిగిన లోపంబుల్ పాపంబుల్ గావు.
సుందర గుణేశ్వరా! సంపన్నేశ్వరా! |16|
భావం:
మనిషి తాను ఉన్న స్థితి లో స్థిరత్వం, దృఢత్వం కలిగి ఉంటే , చుట్టూ ఉన్న పరిస్థితులు ఎప్పుడూ వ్యతిరేకంగా కావు.
ఆలోచనల లో స్పష్టత లేకపోతే మనసు మలినమై మూలకు చేరును.
శరీరంలో దైవశక్తి నిలబడక పోతే అది బుద్ధి కి శాపం గా మారుతుంది.
జ్ఞానం తెలుసు కొని ఆచరించడం వలన లోపాలు సరిచేసుకోబడి పాపాలు గా మారవు.
సుందరమైన గుణములు గల ఈశ్వరా! సంపన్నుడైన ఈశ్వరా!
🕉️ 🕉️ 🕉️ 🕉️ 🕉️ 🕉️ 🕉️
వెతల్ వేలంబున వెర్రి తలల్ వేయఁగా
మతుల్ జేరు ధీనంబుతో సుతల్
విధి యాడు వింత
నాటకంబున
మాయ మ్రోగించే
భేరి స్వనాశంబుకి.
సుందర గుణేశ్వరా! సంపన్నేశ్వరా!
|17|
భావం:
దుష్ట తత్వం అనేది విచ్చలవిడితనం తో ప్రవర్తించిన పిదప మతి హీనమై పాతాళానికి చేరుతుంది. విధి ఆడే వింత నాటకంలో
తన నాశనం కోసం మాయ యుద్ధభేరి
మోగిస్తుంది. సుందరమైన గుణములు
కలిగిన ఈశ్వరా! సంపన్నుడైన ఈశ్వరా!.
🕉️ 🕉️ 🕉️ 🕉️ 🕉️ 🕉
య️డ్ల. శ్రీనివాసరావు. 3 Feb 2024. 12:30 pm.
No comments:
Post a Comment