ఏకాంత మెంత హాయి
• ఏకాంత మెంత హాయి
ఏ కాంతి ఇది ఓయి.
• తలచిన తారలలో నిలిచిన నీడ ను
మరచిన మండలం తిరిగి చేరిన తోడు ను.
తోడు నీడ ఒకటే అయిన ఆత్మ బిందువు ను.
• ఏకాంత మెంత హాయి
ఏ కాంతి ఇది ఓయి.
• శివుని అడుగు తో వెలిగిన విశ్వం
నరుని చూపుకి దొరికిన భాగ్యం.
• వెలుగు నేనయి ఉన్నాను.
చీకటి నేనయి ఉన్నాను.
శూన్యం లో తేలి ఉన్నాను.
• ఏకాంత మెంత హాయి
ఏ కాంతి ఇది ఓయి.
• ఇహ లోకం దాటాను
అమర లోకం చేరాను
• మూలం లో శబ్దం వినిపిస్తోంది
అది ప్రణవ నాదమైన ఓం కారం.
• విశ్వం లో మూలం కనిపిస్తుంది
అది మంగళ రూపమైన శ్రీ కారం.
• ఏకాంత మెంత హాయి
ఏ కాంతి ఇది ఓయి.
యడ్ల శ్రీనివాసరావు 10 Feb 2024 3:00 AM.
No comments:
Post a Comment