కెరటం
• పడిలేచే కెరటమా
పరుగెందుకు
నీకు పరుగెందుకు.
• పరుగు ఎంత పెట్టినా
దూరమెంత ఏగినా
నీ గమ్యం మారునా ...
• పడిలేచే కెరటమా
పరుగెందుకు
నీకు పరుగెందుకు.
• తీరం దాటాలని
ఉరకలేస్తు ఉంటావు.
• ఆకాశం తాకాలని
ఎగసి ఎగసి పడతావు.
• హద్ధు లెరగని కెరటమా
నీ పయనం ఎటు వైపు.
• ముద్దు గొలిపే తరంగమా
నీ తపనం ఎన్నాళ్లు.
• పడిలేచే కెరటమా
పరుగెందుకు
నీకు పరుగెందుకు.
• పరుగు ఎంత పెట్టినా
దూరమెంత ఏగినా
నీ గమ్యం. మారునా ...
• ఘోష ఎంత చేసినా
సాగరం దాటి పోలేవు లే.
• లోతు ఎంత దాగినా
పరిధి మీటి రాలేవు లే.
• రతనాలు ఎన్ని పొదిగినా
నీ రంగు మారిపోదు లే.
• మాలిన్యం ఎంత చేరినా
నీ శోభ చెక్కు చెదరదు లే.
• పడిలేచే కెరటమా
పరుగెందుకు
నీకు పరుగెందుకు.
• పరుగు ఎంత పెట్టినా
దూరమెంత ఏగినా
నీ గమ్యం మారునా ...
యడ్ల శ్రీనివాసరావు 21 Feb 2024 10:00 PM
No comments:
Post a Comment