మనసా అలసట మానుకో
• ఓ మనసా తెలుసుకో
అలసట మానుకో .
• ఏది నీదని వెదికావు
ఎంతని అలసి తిరిగావు .
• ఓ మనసా తెలుసుకో
అలసట మానుకో .
• ఉన్న దానితో ఉండలేవు
లేని దానికై పరిగెడతావు .
ఎందుకు నీకీ అవస్త .
• కోరికలే గుర్రాలై
కోమలమే కఠోరమై
ఏమిటి నీకీ యాతన .
• ఓ మనసా తెలుసుకో
అలసట మానుకో .
• తెరిచావు నీ లోని మాయ ని
మరిచావు నీ లోని శాంతి ని .
• దేహము తొడిగి
దేహి దేహి అంటున్నావు .
• దివ్యత్వం వదిలి
దిక్కులు చూస్తున్నావు.
• నీ మూలం లోని శక్తి కి
సాటి ఏది ఉంది .
• నీ సంకల్పం లోని యుక్తి కి
కాని దేది ఉంది .
• ఓ మనసా తెలుసుకో
అలసట మానుకో .
• ఏది నీదని వెదికావు
ఎంతని అలసి తిరిగావు .
• నిర్మలమై శివుని చెంత
నిశ్చలంగా ఉన్నావు ఒకనాడు .
• అలజడి తో అలమటిస్తు
గందర “గోళం” లో మిగిలావు నేడు .
• మాయా మోహలు నువు
పూసుకున్న రంగులు .
• నీ తనువు పలచబడ్డాక
అవి గేళి చేసి పోయె జోరీగ లు .
• ఓ మనసా తెలుసుకో
అలసట మానుకో .
• ఓ మనసా తెలుసుకో
అలసట మానుకో .
యడ్ల శ్రీనివాసరావు 2 June 2026 10:00 AM
