🌊గోదా . . . వరి🛶
• గోదావరి . . . గోదా . . . వరి
గోదావరి . . . గోదా . . . వరి
• వరి ని గోదాముల లో నింపే సిరి .
గోదావరి . . . గోదా . . . వరి .
• నిర్మల మైన నీరూ పం
నిత్యం . . .
నిశ్చలమై నిలుస్తుంది నా లో .
• జీవితానికి తోడైన నీవు . . .
నేనెవరో అర్దమవని నాడే
నను అర్దాంగి గా చేసుకున్నావు . . .
గోదావరి గలగలల తో తరించావు .
• గోదావరి . . . గోదా . . . వరి
గోదావరి . . . గోదా . . . వరి
• వరి ని గోదాముల లో నింపే సిరి .
గోదావరి . . . గోదా . . . వరి .
• నాడు నీ దరి చేరిన
ఈ బీడు మనసు లో
అక్షరాల సేద్యానికి వరమై
గద్య గోదాములు నింపావు.
• నేడు ప్రపంచమంతా
పాయలుగా పాకి
మనసు ల దాహానికి
జీవం పోస్తున్నావు .
• పంచభూత మైన నీకు
ఆ ప్రాణ నాధుడే చెప్పాడా
నను వరించమని .
• గోదావరి . . . గోదా . . . వరి
గోదావరి . . . గోదా . . . వరి
• రాజ రాజ నరేంద్రుని నగరం లో
నడి బొడ్డున వెలసిన తరంగిణి .
• నిను కలవని సాయంత్రం
నా మది అలకదు అక్షరములు .
• ఈ సరస్వతీ రేవు లో తొలి
పదములు అందించి అల్లించింది
నా తల్లి సరస్వతి .
• గోదావరి . . . గోదా . . . వరి
గోదావరి . . . గోదా . . . వరి
• వరి ని గోదాముల లో నింపే సిరి .
గోదావరి . . . గోదా . . . వరి .
• నేను లేకున్నా . . . నేను లేకున్నా
నా గుండె పరవళ్ళు నీ తోనే శాశ్వతం .
నీ గలగలలే ఈ పదగలలు .
• గోదా . . . వరి . . . గలగలల గోదావరి
గోదా . . . వరి . . . గలగలల గోదావరి .
🌹🌹🌹🌹🌹🌹
బ్లాగు ఆరంభించి 2026 మే నెలకు 6 years పూర్తి అయింది. సుమారు గా ఒక సంవత్సరానికి 12,000 Views వరకూ average గా వచ్చేవి .
కానీ , 2026 ఒక జూన్ నెలలో మాత్రమే అత్యధికం గా 11,000 Views బ్లాగు కి రావడం . మరియు Total Views 87,000 cross చేయడం . . .
అదే విధంగా ఇదే నెలలో ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 130 దేశాల వరకు బ్లాగు Reach అవడం అనగా ఆయా దేశాల లో ని తెలుగు వారు బ్లాగు ని వీక్షించడం లో , ఆనందం అనే మాటకు తావు లేదు కానీ చాలా ఆశ్చర్యం గా అనిపిస్తుంది .
ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల లో ఉన్న తెలుగు వారందరికీ , మనో వికాసం కోసం బ్లాగు లో రచనలను చదువుతున్న వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు 🙏.
జ్యేష్ట పౌర్ణమి శుభాకాంక్షలు 💐
ఓం శాంతి
ఓం నమఃశివాయ 🙏
యడ్ల శ్రీనివాసరావు . 30 June 2026 6:00 AM.





No comments:
Post a Comment