అస్తికత్వం – నమ్మకం
• అస్తికత్వానికి నాస్తికత్వానికి తేడా కేవలం ఒక్క “నమ్మకం” మీదే ఆధారపడి ఉంటుంది. నిజానికి భగవంతుడు ఉన్నాడు అని నమ్మే మనమందరూ కూడా అస్తికులమే , కానీ పూర్తిగా కాదేమో ? ఒకసారి ఆలోచించండి.
ఎందుకంటే రోజువారి మనం చేసే కర్మలలో మంచితో పాటు చెడు లేదా తప్పుడు పనులు చేయటం కూడా జరుగుతుంది కదా!
• కొన్ని సందర్భాలలో మనం తెలిసి , తప్పుడు పనుల చేసిన సమయాలలో . . . మనకు భగవంతుడు ఉన్నాడు , మనలని గమనిస్తున్నాడు అనే ఆలోచన , జ్ఞప్తి మన స్పృహలో ఉంటుంది అనగలమా ? ఒకవేళ ఉన్నా , మనం జీవిస్తున్న లౌకిక విధానం లో తప్పుడు పనులు చేయడం సాధారణం , సహజం , ఆమోదయోగ్యమే అని ఊరుకుంటూ సరిపెట్టుకోగలమా ?
మన నమ్మకం ఆయా తప్పుడు పనులు చేస్తున్న సమయాలలో సందర్బాలలో ఏమైనట్టు ? లేక సమయానుకూలంగా భగవంతుని పై నమ్మకం మారుతుందా? అటువంటి పనులు చేసే సమయంలో భగవంతుడు గుర్తుకు రాడేమో కదా ! . . . దీనినే మనలో మాయ ఆవహించి ఉండడం అంటారు .
• భగవంతుని పై నమ్మకం అనేది కొంత భక్తితో కూడుకున్నప్పటికీ ఎక్కువ మొత్తంలో భయంతో , అవసరాలతో , కోరికలతో , దుఃఖం భరించలేక కలుగుతుంది అనుకోవాలేమో కదా !
• లోక కళ్యాణార్దం జన్మించిన రమణ మహర్షి , ఆది శంకరాచార్యులు , బ్రహ్మ బాబా, యోగానంద పరమానంద వంటి సర్వసంగ పరిత్యాగుల నమ్మకాలు భగవంతుని పై పూర్తి గా వేరు కదా!
• భయంతో , కోరికలతో , అవసరాల కోసం భక్తి చేస్తే భగవంతుని సమీపం , చేరుట సాధ్యమా? . . . భయం నిన్ను ఎక్కడో దూరంగా నిలబెట్టి కొలిచేలా చేస్తుంది కదా !
• నీ కోరికలు , అవసరాలు కోసం భగవంతుని తో నీవు నిర్వహించే వ్యాపార బేరసారాలు . నిన్ను దళారి వలే భగవంతుడి గడప బయట ఉంచేలా చేస్తున్నాయోమో , కాస్త ఆలోచించి చూడు !
• భక్తి పాలు లో , నీ ప్రేమ ను చక్కెర గా కలిపితే భగవంతుని సమీపానికి వెళ్లగలుగుతావేమో ? ఆలోచించు .
• భయం తో కూడిన భక్తి , మనిషి ని భగవంతునికి దూరం గా ఉంచే లా ఎందుకు చేస్తుంది ? . . . ఈ భయానికి కారణం , ఒకవైపు చేసి చేస్తున్న తప్పుడు పనుల ప్రభావం , ఆలోచనల లోని అపవిత్రత కాదని అనగలమా ! నీ మనస్సాక్షి కి తగిన ధైర్యం లేక భగవంతుడు అంటే భయపడుతుందేమో ? ఎందుకంటే చేసిన ప్రతి పని భగవంతుడికి ఎరుక కాబట్టి .
• ప్రేమతో కూడిన భక్తి , భగవంతుని హృదయం లో స్థానం పొందేలా చేస్తుంది . బహుశా ఈ ప్రేమ పుట్టడానికి కారణం తన్మయత్వం . అంతర్దృష్టి మరియు మనసు లో నెలకొన్న బుద్ధి ఆలోచనల శుభ్రతయే . . . కాదని అనగలమా !
ఇవి . . నా మాటలు కాదు , ఎందరో మహానుభావుల నోట పలికిన ముత్యాల మూట.
ఏమంటే . . . సృష్టి లో ఒక అతీంద్రియ శక్తి ఉన్నది అదే మన అందరినీ నడిపిస్తోంది , అనే సత్యం నమ్మడం . ఇదే అస్తికత్వానికి ప్రామాణికమైతే మనమందరం భగవత్ ప్రియులం .
కానీ, ఈ సత్యాన్ని తెలుసుకునేది ఎందరో ? సత్యాన్ని నమ్మేది మరెందరో ? సత్యాన్ని నోటితో పలికేది ఇంకెందరో ? . . . ఈ విషయం పైన ఉన్న భగవంతుడికి తెలియాలి , లేదా మనలో ఉన్న మాయ కి తెలియాలి .
సత్యమేవ జయతే!
ఓం శాంతి
ఓం నమఃశివాయ 🙏
యడ్ల శ్రీనివాసరావు 23 June 2926 , 11:00 AM.

No comments:
Post a Comment