Wednesday, October 25, 2023

416. ప్రేమాంజలి

 

ప్రేమాంజలి


• ఏ  నిమిషంలో    నిను చూశానో

  ఆ క్షణమే

  నీలో    సగమయ్యాను.

• పరిచయమే     లేకున్నా

  మది   పరుగు ని    ఆపలేకున్నాను.


• ఏ నిమిషంలో      నిను చూశానో

  ఆ క్షణమే

  నీలో    సగమయ్యాను.


• కను రెప్పల్లో     నిన్నే    వెతికాను.

  శూన్యం లో      నీతో     కలిసాను.

  దూరం  ఎంతున్నా    భారం   కాకుంది.

  వేదన   ఎంతున్నా     ప్రేమం  మిగిలింది.


• ఏ నిమిషంలో      నిను  చూశానో

  ఆ క్షణమే

  నీలో     సగమయ్యాను.

• పలకరింపే     లేకున్నా

  ఎద  ఆశను     ఆపలేకున్నాను.


• ఏ నిమిషంలో     నిను చూశానో

  ఆ క్షణమే

  నీలో    సగమయ్యాను.

 

• విను వీధుల్లో     నీతో   నడిచాను.

  మౌనం లో     నిన్నే తాకాను.

  కాలం   ఎంతున్నా    కలగానే   వెలిగింది.

  జీవం   ఎంతున్నా     జీవితమే   లేదంది.


• ఏ నిమిషంలో     నిను చూశానో

  ఆ  క్షణమే

  నీలో    సగమయ్యాను.

• అలసిన   తలపుల  దాహాం 

  నా ప్రేమ ని …

• విడిచిన   ఆశా   పాశం

  నా జీవమని …


యడ్ల శ్రీనివాసరావు 25 Oct 2023 9:30 pm.


Sunday, October 22, 2023

415. తెలిసిన సత్యం

 

తెలిసిన సత్యం



• నేనొక ఆత్మను

  చేరాలి

  నా తండ్రి పరమాత్మ ను.

• నా   ఇల్లు    స్వర్గము

  విడిచి   పోవాలి    నేను

  ఈ    నరకము.


• నేనొక     ఆత్మను

  చేరాలి 

  నా తండ్రి   పరమాత్మ ను.


• గమ్యము   ఎరుగక   తిరిగాను

  జన్మ   జన్మల గ.

• నేడు    నా తండ్రి లేపి   తట్టాడు

  నా చేయి   పట్టాడు.

• దిక్కులు    చూపిన   జీవితం

  దక్కని     ప్రేమల     జీవనం

  మేలు కొలిపాయి  నాలో  సత్యం.


• నేనొక    ఆత్మను

  చేరాలి

  నా తండ్రి   పరమాత్మ ను.


• మాయలో   మునిగిన

  మనుషుల తో

  మసలడం   నరకం.

• మనస్సాక్షి   లేని

  బ్రతుకుల  తో

  ఇమడడం   కష్టం.

• ద్వేషాలు     నిండిన

  మనసుల    దరి

  చేరడం  దుఃఖం.

• నియమాలు   లేని

  స్వభావుల  తో

  నడవడం   నరకం.


• నేనొక    ఆత్మను

  చేరాలి

  నా తండ్రి    పరమాత్మ ను.

• నా ఇల్లు    స్వర్గము

  విడిచి  పోవాలి   నేను

  ఈ   నరకము.


• సత్యం    పలకని

  నాలుకల    నడుమ

  ఉక్కిరి  బిక్కిరి  ఎన్నాళ్లు.

• మాటలకు   చేతలకు    

  పొంతన   లేని

  నాటకాలు    ఎన్నేళ్లు.


• పాత్రను   రక్తి     కట్టించేందుకు

  మాయ  ఏ  శిక్షణ   ఇవ్వలేదు.

• అనుభవాలన్ని    మోక్షాన్ని

  సిద్ధించే   కర్మల   గుహ్య  గతులు.


• నేనొక   ఆత్మను

  చేరాలి

  నా తండ్రి   పరమాత్మ ను.

• నా ఇల్లు    స్వర్గము

  విడిచి పోవాలి  నేను

  ఈ నరకము.


యడ్ల శ్రీనివాసరావు 21 Oct 2023 10:30 am


Friday, October 20, 2023

414. ప్రేమంటే

 

ప్రేమంటే


• ప్రేమంటే   ఏమంటూ    చెప్పేది

  పడి పడి    లేచే    మనసు కి

  తడ బడి    చూసే   కనుల కి.


• నువ్వంటే     ఎవరని    తెలిపేది

  అల జడి      లేని      వయసు కి

  ముడి పడి    ఉన్న     జనుసు కి.


• నిను     తలచిన     అనుక్షణం

  మది     మురిసెను    ప్రతిక్షణం.

• నువు    పలికిన       మరుక్షణం

  ఎద      వెదికెను       తక్షణం.

• ఏదో   …  ఏదో  …   ఏదేదో

  అది    ప్రేమే    కాదంటావా  …


• ప్రేమంటే      ఏమంటూ    చెప్పేది

  పడి పడి      లేచే       మనసు కి.

• నువ్వంటే     ఎవరని    తెలిపేది

  అల జడి      లేని      వయసు కి.


• అరచేతులు     కలిసిన    అర్దం

  కనుసైగన        దాచిన     భావం.

• కలబడిన       మాటల     శబ్దం

  మునివేళ్లను   మీటిన     మౌనం.

• ఏదో    … ఏదో  …   ఏదేదో

  అది    ప్రేమే   కాదంటావా ….


• శూన్యం లో   చూసేటి   సమయం 

   కన్నీరు       జారిన      వయనం.

• ఒంటరిగా     చేసేటి     మధనం

   నిరీక్షణ తో    వేచిన    కాలం.

• ఏదో    … ఏదో  …   ఏదేదో

  అది    ప్రేమే    కాదంటావా …


• ప్రేమంటే    ఏమంటూ   చెప్పేది

  పడి పడి    లేచే       మనసు కి.

• నువ్వంటే    ఎవరని    తెలిపేది

  అల జడి     లేని      వయసు కి.


జనుసు = జన్మ, జీవితకాలం

మధనం = కలవరించడం


యడ్ల శ్రీనివాసరావు 20 Oct 2023 , 2:00 pm


Thursday, October 19, 2023

413. శివ శక్తి

 

శివ శక్తి


• అనగనగా    ఒక   శక్తి

  ఆ శక్తి    పేరు    శివుడు.

• శక్తి ని   చూడలేము  కానీ

  అనుభవించ   గలము.

• అనగనగా     ఒక  శక్తి

  ఆ శక్తి     పేరు     శివుడు.


• శివ శక్తి కి     వశమై న

  ఆ  జన్మ మే    ధన్యం.

• ఆ శక్తి లోని    యుక్తి

  ముక్తి  కి      శరణ్యం.



• అనగనగా   ఒక  శక్తి

  ఆ శక్తి  పేరు   పరమాత్మ.

• శక్తి ని   తాకలేము   కానీ

  చైతన్యం     చెందగలము.

• అనగనగా    ఒక  శక్తి

  ఆ శక్తి   పేరు   పరమాత్మ.


• శివ  శక్తి కి   దాసోహ మయిన 

  పరవశమే     పారవశ్యం.

• శక్తి ని      పొందాలంటే

  ఉండాలి   మనసు లో  శ్శుద్ధం.



• అనగనగా    ఒక శక్తి

  ఆ శక్తి    పేరు   రుద్రుడు.

• శక్తి ని    వినాలంటే  

  అమృత  వేళలో   

  ధ్యాన యోగం తో   సాధ్యం.

• అనగనగా     ఒక శక్తి

  ఆ శక్తి     పేరు   రుద్రుడు.


• శివ శక్తి ని    తలచినంత నే

  చింతలన్ని   చితి కి   చేరు.

• శక్తి కి   దుష్ట   శక్తులు 

  దూరం గా     పోవు.



• అనగనగా     ఒక శక్తి

  ఆ శక్తి   పేరు    అర్ధనారీశ్వరడు.

• స్త్రీ    పురుష   సఫల

  పూర్ణమే    శివ శక్తి.

అనంతమైన     విశ్వంలో

  ఇది   ఆనందమైన  శక్తి .

• కుండలి లో   నాట్యమాడే

  పరమానందుడి  శక్తి    శివ శక్తి. 


యడ్ల శ్రీనివాసరావు 19 Oct 2023 9:00 pm.


Wednesday, October 18, 2023

412. పసి వయసు


పసి వయసు


• పసి    వయసు   కి     

  ప్రేమే ముంది.

  కలత పడే   కంటి  లో     

  మనసే    దాగుంది.

• కన్నీళ్ల    కు  

  లోటే  ముంది.

  అలజడి   మాటు న 

  ఆవేదన   దాగుంది.


• అలసి న     బాల్యాని కి

  గురుతుల    మరుపే   లేకుంది.

• కలిసి న     స్నేహల తో

  పాశం   విడవక     ఉంది.


• పసి    వయసు కి   

  ప్రేమే   ముంది.

  కలత పడే    కంటి లో 

  మనసే     దాగుంది.

• ఒంటరి        బాటలో

  ఏకాంతపు    నీడలో

• వెన్నెల      చెలిమే      చేసింది

  జాబిల్లి ని   తోడు గ    నిలిపింది.


• దుఃఖపు    వేడి లో

  చీకటి       రోదన లో

• చల్లని    గాలే      తాకింది

  కమ్మగా   నిదుర ని    నిలిపింది.


• మాట   రాని    ఆటలకు 

  విలువే   ముంది

• ఆడి ఆడి   అలసిన

  పాదాలలో   పదనిస    దాగుంది.


• భయమ ను    బెంగ తో

  బాధ ను       మౌనం గా

  బాల్యం       ఎదిగింది.

  ప్రేమ ను      పొదిగింది.

 

• ఆశల          హారతి తో

  నిట్టూర్పు ల    నాట్యం తో

  జీవం      సాగింది.

  బ్రతుకే   మెలి   తిరిగింది.


• పసి    వయసు కి 

  ప్రేమే    ముంది.

  కలత పడే    కంటి లో 

  మనసే దాగుంది.

• కన్నీళ్ల   కు 

  లోటే    ముంది.

  అలజడి   మాటు న 

  ఆవేదన    దాగుంది.


యడ్ల శ్రీనివాసరావు 18 Oct 2023 10:30 pm


Tuesday, October 17, 2023

411. రాయల రాయంచ

 


రాయల రాయంచ (దర్జా పావురం) 



• రాయలు గ    జీవించే   రాయంచ

  ఏమి     కర్మము నీకు    

  ఎందుకీ  వేదన   నీకు.


• రాయలు గ    కనిపించే  రాయంచ

  తెలుపు శాంతి     అని తెలిసినా

  రంగుల పై      మో జు ప డ తా వు.

  నీ హంగులు  చూపుతూ

  రంగులు   మార్చుతూ    ది గ జా రు తా వు.


• రాయలు గ     ఎగిరే రాయంచ

  స్నేహానికి   ప్రేమ కు  చిహ్నమని  ఊ రే గు తా వు .

  నీ గుబురు   గొంతు తో

  అర్దం లేని   పలుకులు   ప లు కు తా వు .

  మాటలను  మ డ త పె డు తు 

  మాయలు  చేస్తావు .


• రాయలు గ     బ్రతకలేని    రాయంచ

  ఏమి    యాతన నీకు     

  ఎందుకీ   రోదన  నీకు.


• నీ   గూడు లోని   కూడు   

  'సు "'  ధు"  రం    అంటావు .

  గూడు దాటాక    

  డేగ  లా   వేట కు   వెళ్తావు .

  రాయంచ వే    అయినా ...

  తీరని  ఆకలితో   

  రాబందు    కర్మ   ఎందుకు.


• రాయలు గ   పలికే    రాయంచ

  దూర   దేశాన    గూడు లో   

  'మ ధు' వు     పై     ఆశ    ఎందుకు.

  చాప    కింద    నీరు లా   

  నేటి    జీవనం   ఎందుకు.


• ఓ  రాయల  రాయంచ  

  మాయ లేడి  లా  

  ఎన్ని   రంగుల లో      ఎంత    మునిగినా

  ఎన్ని   పొంగుల తో     ఎంత    మెరిసినా

  నీ అసలు రంగు   నువ్వే  చూపుతుంటావు.



• రాయలు గ   అనుభవించే 

  భోగ   భాగ్యాలు    ఎన్ని   ఉన్నా 

  చపల బుద్ది తో   నిండిన 

  చాతుర్యమే   నీ  జన్మకు  శిక్ష.


• రాయలు గ   జీవించే    రాయంచ

  ఏమి    కర్మము    నీకు 

  ఎందుకీ   వేదన    నీకు.



పావురం సహజంగా అందంగా తెల్లగా స్వచ్ఛదనంతో దర్జా గా విలాసవంతంగా బయటకు  కనిపిస్తుంది. శాంతి కి, ప్రేమ కు, స్నేహానికి చిహ్నం గా ఉంటుంది. అందుకే సాధారణంగా పావురాన్ని చూస్తే ఎవరికైనా మనసు పరవశించి పోతుంది. పావురాన్ని చూసి మనిషి ఎంతో  సంతోషం పడతాడు.

కానీ, విధి వక్రించో, మరి ఏ పాప మో తెలియదు ఒక పావురం  మాత్రం  ఇలా ఉంది.


దర్జా గా జీవించాల్సిన ఓ పావురమా…. ఏమి ఈ కర్మ నీకు , ఎందుకు ఈ వేదన నీకు.

విలాసంగా ఉండవలసిన ఓ పావురమా , నీ సహజ  స్వభావం తెలుపు మరియు శాంతి అని తెలిసినా, రక రకాల రంగులు పై మోజు పడుతూ, పంచ రంగులు (బూడిద, ఎరుపు, నలుపు, పచ్చ, తెలుపు) ధరించి చూపరులకు హంగులు  వెలగబెడుతూ  రంగులు మారుస్తూ స్థాయి దిగజారి పోతున్నావు.

దర్జా గా ఎగురుతున్న పావురమా,   నీవు  ప్రేమ కు, స్నేహానికి చిహ్నం   అంటావు.   కాని స్పష్టత లేని మాటలతో , బొంగురు  గొంతు తో అర్దం కాకుండా ఎందుకు పలుకులు పలుకుతావు.  మాటలు మడతపెట్టి  మాయలు చెయ్యడం  అలవాటు గా చేసుకున్నావు.

దర్జా గా బ్రతక వలసిన నీకు ఏంటో ఈ యాతన , నిత్యం ఘోష తో కూడిన  ఏమిటో నీ  రోదన.

నీ గూడు లో ఉన్న కూడు ,  'సుమ' ధురం  అంటావు. మరి గూడు దాటాక డేగ లాగా  వేటకు వెళ్తు , రాబందు లా మారి ఆకలి తీర్చుకుంటావు. చూడడానికి సాత్వికంగా  కనిపించినా,   ఏమిటో ఈ  తీరని  కోరికల దయనీయ  స్థితి నీకు.

ఓ రాయల రాయంచ  దూర సాగర తీరాల లో ఉన్న గూడు లో ని  'మధు' వు   అనే  తేనే  పై ఆశ ఎందుకు.   పైకి ఏమీ తెలియని అమాయక  జీవనం ఎందుకు.


ఓ పావురమా , మాయ లేడి వలే ఎన్ని రంగులు మార్చినా , ఎంత మెరిసేలా కనిపించినా ,  నీ అసలు రంగు  నీ బుద్ధి, ప్రవర్తన తో నువ్వే బయటకు చూపించుకుంటావు.


ఓ రాయల రాయంచ  అన్నీ ఉన్నా నీ లోని అల్ప మైన నీచ బుద్ది తో కూడిన  మాటకారి తనమే నీ ప్రస్తుత జన్మ కు శిక్ష.

ఓ దర్జా పావురమా ఏమిటో ఈ కర్మ నీకు , ఏమి పాపం చేసావో,  ఈ వేదన నీకు.



యడ్ల శ్రీనివాసరావు 11 Apr  2023  5:00 PM.









Sunday, October 15, 2023

410. ఎట్టాగ అయ్యేది దూరం

 

ఎట్టాగ అయ్యేది దూరం


• శివునికి      ఎట్టాగ

  అయ్యేది   దూరం.

  నాకు        నేనెట్టాగ

  అయ్యేది    భారం.


• నరము  లేని    నాలుక కు

  నాట్యం     ఎందుకు.

  రంజనపు    రమణీయం

  రవ్వంత    యే    కదా.

• మాయ     మాటల తోని 

  మనసుకి   ఆటలు   ఎందుకు.

  మైకం     ముసుగు లో

  మనిషి   మూలం  ఎరుగునా.


• శివునికి     ఎట్టాగ

  అయ్యేది   దూరం.

  నాకు        నేనెట్టాగ

  అయ్యేది   భారం.


• ఆశల     ఆరాటం తో

  ఆలంబనం   ఎందుకు.

  స్థితి   తోన    మతి

  గతి   చేర     లేదా.

• ఏ  ఎండ కా   గొడుగు

  ఎన్నాళ్లు    సాగేను.

  ఏనాటికైనా    ఎండి

  పోవాలి    కదా.


• శివునికి     ఎట్టాగ

  అయ్యేది   దూరం.

  నాకు      నేనెట్టాగ

  అయ్యేది     భారం.


• దేహల    మోహం తో

  దేహి ని     కాలేను.

  అనిశ్చిత     కర్మలు

  రాతలు     అయ్యెను.

• బంధాలు అన్ని   బుణము లే  కాని

  ఏనాటికీ అవి

  అనుబంధములు   కాబోవు.


• శివునికి      ఎట్టాగ

  అయ్యేది   దూరం.

  నాకు       నేనెట్టాగ

  అయ్యేది   భారం.


• ఎవరి   ఆకలి    వారిదే

  ఎవరి   లెక్కలు  వారివే

  ఎవరి   జీవితం   వారిదే

  ఎవరి  జీవనం    వారిదే.


• శివునికి     ఎట్టాగ

  అయ్యేది   దూరం‌

  నాకు     నేనెట్టాగ

  అయ్యేది   భారం.


యడ్ల శ్రీనివాసరావు 16 Oct 2023 2:00 AM.


Saturday, October 14, 2023

409. ఆడ - ఈడు పిల్ల

 

ఆడ – ఈడు పిల్ల



• అందమైన   ఆడపిల్ల ను

  తుళ్లిపడే    ఈడుపిల్ల ను.

• చెంగు  నెగిరే   గోవుపిల్ల ను

  చీర   లోన     చిట్టిపిల్ల ను.

• అల్లరి     చేసాను

  ఆనందం   పంచాను.

• తూరీగ లా    ఎగిరాను

  తడబడి       అలిసాను.


• అందమైన      ఆడపిల్ల ను

  ఆనందమైన    జాజిపువ్వు ను.

• సరసమైన      కన్నె పిల్ల ను

  సిగ్గు పడే       తీగ మల్లె ను.

• తుమ్మెద     నయ్యాను 

  తియ్యగా    మారాను.

• మధువు ని    తిన్నాను

  వధువు  ని     అయ్యాను.

• అందమైన     ఆడపిల్ల ను

  జోడైన            కొంటె పిల్లను.


• ఆకతాయి ని    కాదు   కానీ

  తాయిలాలు      ఇస్తాను.

• మౌనంగుంటాను      కానీ

  గిల్లుడు        చేస్తాను.


• అందమైన      ఆడపిల్ల ను

  తుళ్లిపడే        ఈడుపిల్ల ను

• చెంగు నెగిరే     గోవుపిల్ల ను

  చీర లోన         చిట్టిపిల్ల ను.


యడ్ల శ్రీనివాసరావు 14 Oct 2023 10:00 pm.


Sunday, October 8, 2023

408. చుక్క.

 

చుక్క .


• చుక్కను    చక్కని     చుక్కను

  మెరిసే … వెలిగే …  తళుకుల  చుక్కను.


• హద్దు   లేని    ఆకాశం     నా ఇల్లు

  బొద్దు   గున్న   చందమామ   నా తల్లి .


• చుక్కను    చక్కని     చుక్కను

  మెరిసే …  వెలిగే …  తళుకుల చుక్కను.


• పాలపుంత  లలో     తిరిగే     చుక్కను

  రంగుల తో   ఎగిరే    తోక      చుక్క ను

  గమ్యం    ఎరుగని    ఒంటరి    చుక్కను.


• చుక్కను     చక్కని     చుక్కను

  మెరిసే … వెలిగే …  తళుకుల  చుక్కను.


• శివుని    కంట   జారిన    చుక్క ను

  సెలయేరు లో     పారిన   చుక్క ను

  చెక్కిలి    విడవని   సిగ్గు  చుక్క ను.


• చుక్కను   చక్కని    చుక్కను

  మెరిసే … వెలిగే … తళుకుల  చుక్కను.


• రాత లను   ఆపేటి   చుక్కను

  రాసినాక     చెరగని  చుక్కను.


• చుక్కను    చక్కని    చుక్కను

  మెరిసే … వెలిగే … తళుకుల   చుక్కను

• హద్దు లేని       ఆకాశం      నా  ఇల్లు.

  బొద్దు గున్న    చందమామ    నా తల్లి .


యడ్ల శ్రీనివాసరావు 8 Oct 2023  11:00 am.


Saturday, October 7, 2023

407. ఇది ఏదో ఏదో వింతగా

 

ఇది ఏదో ఏదో వింతగా


• ఇది  …. ఏదో   ఏదో

  వింత గా

  నువు రోజూ    నాతో   ఉన్నంత గా.

 

• విడవని     శ్వాసే దో   

  బిగిసిన      ఘోష ల్లే.

  తడిమిన    ఊసే దో 

   తలచిన     భాస ల్లే.


• ఇది  ….  ఏదో   ఏదో

  వింత గా

  నువు  రోజూ    నాతో   ఉన్నంత గా.


• కలిసిన    మనసుల    జ్ఞాపకాలు

  తరగని     ఆశల        ఆరాధన లై.

• ఎగసిన     ప్రేమ      తరంగాలు

  కరగని     అలల      సాగరా లై.

 

• ఇది  …  ఏదో   ఏదో

  కొత్త గా

  నను   విడిచి   పోనంత గా.


• అర్ధాంగి ని       విడిచి 

  అర్ధాంతరంగా   అశువుని  బాసి.

  ఆనాటి     స్మృతులు

  ఈనాడు    మెది లే.


• ఇది  ….  ఏదో   ఏదో

  వింత గా

  నువు రోజూ    నాతో    ఉన్నంత గా.


• ఊహకు   రాని    రూపాని వై

  ఊహించని    ప్రేమ తో …

  దూరం    కాని     మనసు వై

  దేహం     లేని     తలపు తో.


• ఇది   …   ఏదో    ఏదో

  వెలితి గా

  నాకే   అర్థం    కానంత గా.


యడ్ల శ్రీనివాసరావు 7 Oct 2023 9:00 pm 


Thursday, October 5, 2023

406. అంతిమ సమయం

 

అంతిమ సమయం


• ఈ    సమయం

  సంగమ సమయం.

  అంత్య    కాలానికి

  సంధి      సమయం.


• పరమశివుడు    భూమి పై

  అవతరించిన     సమయం.

• తల్లడిల్లేటి      పిల్లలను

   చేరదీసేటి     సమయం.


• ఈ     సమయం

  సంగమ  సమయం.

  అంత్య   కాలానికి

  సంధి     సమయం.


• దైవం    దా క్షిణ్యమై 

  శాంతి తో  శక్తి    నిచ్చు  సమయం.

• మానవులకు    జ్ఞానంతో

  భ్రాంతి    తొలిగే టి   సమయం.


• పరమశివుని    ధ్యానించండి 

  ఆత్మను  శుద్ధి   చేయండి.

• పరమాత్మ ను    తెలుసుకోండి

  పాప కర్మలు     చేయకండి.


• ఈ    సమయం

  అంతిమ  సమయం.

  నేలను    విడిచి

  నింగిని   చేరే    సమయం.


• మాయ    కలిగించేది   మోహం

  అది     జీవనానికి    శాపం.

• దేహ   ప్రీతి యే      రోగం

  అది     దుఃఖానికి   ద్వారం.


• బంధాలతో      జీవించండి

  బంధీలు గా     కాకండి.

• బుణాల ను    తీర్చుకోండి 

  విముక్తి ని       పొందండి.

• శాశ్వత బంధం    శివుని తో

  అది   కలిగి ఉండడమే    మోక్షం.


• ఈ     సమయం

  సంగమ  సమయం.

  అంత్య    కాలానికి

  సంధి    సమయం.


• ఈ    సమయం

  అంతిమ  సమయం.

  నేలను   విడిచి

  నింగిని చేరే    సమయం.


సంగమ సమయం = కలికాలం చివర, సత్యయుగం ఆరంభ కాలం.

సంధి కాలం = జమ ఖర్చులు (పాపపుణ్యాలు) జీరో చేసుకునే సమయం.


యడ్ల శ్రీనివాసరావు 6 Oct 2023, 5:00 am.


405. కధ కాదు - వ్యధ కాదు

 

కధ కాదు - వ్యధ కాదు


• కధ   కాదు   నేస్తం

  ఇది   కధ    కాదు.

• కధ    కలిసిన   జీవితం

  కంటికి  కనిపించని  జీవనం.


• వ్యధ  కాదు   నేస్తం

  ఇది    వ్యధ    కాదు.

• వ్యధ గా    సాగేటి   వయనం 

  ఒంటరి      బాటలో  పయనం.


• కదిలే    బొమ్మల    ఆటలు

  కడుపు     తీపి       ఆశలు.

• కాలంతో     వేసేటి    అడుగులు

  కనపడని   కన్నీటి     మడుగులు.


• హంగులు    నిండిన     లోకంలో

  రంగులు      వేస్తాయి   పాత్రలు.

• తెలుపు    నలుపు లు    మాత్రం

   తేట  తెల్లమై   

   దిక్కులు   చూస్తాయి   ఆశగా.


• కధ   కాదు    నేస్తం

  ఇది   కధ     కాదు.

• వ్యధ  కాదు  నేస్తం

  ఇది   వ్యధ   కాదు.


• గాలి పటానికి    తోడే ముంది

  రెప రెప లాడే    ఆనందం తప్పా .

• ఆరే దీపానికి      ఆశే ముంది

  టప టప లాడే    కేరింతలు తప్పా.


• ఎగిరే పక్షి   కి        దారే ముంది

  దశ దిశ   ఎరిగిన   గమ్యం  తప్పా.

• తీరం చేరే   నావకి   జడి   ఏముంది

  వడి సడి     ఆటల     అలల  తప్పా.


• కధ  కాదు   నేస్తం

  ఇది  కధ     కాదు.

• కధ       కలిసిన   జీవితం

  కంటికి   కనిపించని   జీవనం.


• వ్యధ   కాదు    నేస్తం

  ఇది     వ్యధ    కాదు.

• వ్యధ గా    సాగేటి     వయనం

  ఒంటరి     బాటలో    పయనం.


యడ్ల శ్రీనివాసరావు 5 Oct 2023 9:00 pm.



Monday, October 2, 2023

404. భువి లో ఓ దీవి

 

భువి లో    ఓ దీవి



• భువి లోన    వెలసింది   ఓ  దీవి

  అది మనసు న   అయింది  సరోవరం.


• హంసలు    విహరించే   దేవత లై

  కలువలు    చిగురించే    చెలికత్తె లై.

  తలపించెను    ఇంద్ర లోకం

  మరపించెను    భూ లోకం.


• ఈ    నవోదయం 

  జగానికి   శుభోదయం.


• భువి లోన     వెలసింది    ఓ దీవి

  అది మనసు న    అయింది   సరోవరం.


• కమలం    విరపూసే    కన్యక లా

  తుమ్మెద   లెగిరెను     తారక లా

  వికసించెను    హరిత వనం

  పులకించెను   మానస  సరోవరం.


• ఈ   సమయం

  మనసుకి    ఆనందమయం.


• భువి లోన    వెలసింది    ఓ దీవి

  అది మనసు న  అయింది   సరోవరం.


• జల  మలజడి    చేసేను    గజ్జె ల్లే 

  నది  ఒరవడి    పొందెను   ప్రాస ల్లే.


• శిల కే   జీవం    ఈ  మధువనం

  శిల  కాబోదు     ఏనాటికీ  శిధిలం.


• భువి లోన     వెలసింది     ఓ దీవి

  అది మనసు న   అయింది    సరోవరం.


యడ్ల శ్రీనివాసరావు 2 Oct  2023,  9:30 pm.


Sunday, October 1, 2023

403. కన్నీరు

 

కన్నీరు


• తెలుసుకో          తెలుసుకో

  కన్నీరు   అంటే

  అలుసు   కాదని   మసలుకో.


• కన్నీటి    తోనే    జననం

  కన్నీరు   తోనే    మరణం

  కన్నీరు   తోనే    పయనం

  కన్నీటి    తోనే    చరితం.


• తెలుసుకో          తెలుసుకో

  కన్నీరు     అంటే

 అలుసు   కాదని  మసలుకో.


• ప్రకృతి    ఉద్వేగం       ఉరుము లై

  కరిగి    నీరై

  శ్యామలం   చేస్తుంది    బీడు.

• మనసు   భావోద్వేగం   దుఃఖ మై

  కరిగి    నీరై

  శాంతి    నిస్తుంది   చూడు.


• తెలుసుకో          తెలుసుకో

  కన్నీరు     అంటే

  అలుసు   కాదని   మసలుకో


• ఆనంద        బాష్పాలు

  కంట  జారే   పుష్పాలు...

  పులకించి   పరిమళం    నింపే   పారిజాతాలు.

• అశ్రు         నయనాలు

  వికర్మల     విడుపు కి    నిదర్శనాలు....

  ఎగిరే    పక్షి లా    చేసే    దోహదాలు.


• తెలుసుకో       తెలుసుకో

  కన్నీరు   అంటే

  అలుసు   కాదని  మసలుకో.


• కన్నీరు   మున్నీరు    అయితే

  శోకం    తరిగి

  మనసు  పన్నీరు    అవును.

• కన్నీరు   నిండిన   కావ్యాలు

  కమలమై    విరిసి

  జీవిత   దారిని   చూపును.


• తెలుసుకో        తెలుసుకో

  కన్నీరు       అంటే

  అలుసు  కాదని   మసలుకో


యడ్ల శ్రీనివాసరావు 1 Oct 2023. 6:00 pm.


490. జన గళం

జన గళం • జనమెత్తిన   గళము లో   ఈ పవనం    లేచే  లే. • కదమేగిన    పోటు లో   ఈ కదనం    సాగే  లే. • గుప్పెడు   పిడికిలి   గుండేలే   ఈ   ధై...