పసి వయసు
• పసి వయసు కి
ప్రేమే ముంది.
కలత పడే కంటి లో
మనసే దాగుంది.
• కన్నీళ్ల కు
లోటే ముంది.
అలజడి మాటు న
ఆవేదన దాగుంది.
• అలసి న బాల్యాని కి
గురుతుల మరుపే లేకుంది.
• కలిసి న స్నేహల తో
పాశం విడవక ఉంది.
• పసి వయసు కి
ప్రేమే ముంది.
కలత పడే కంటి లో
మనసే దాగుంది.
• ఒంటరి బాటలో
ఏకాంతపు నీడలో
• వెన్నెల చెలిమే చేసింది
జాబిల్లి ని తోడు గ నిలిపింది.
• దుఃఖపు వేడి లో
చీకటి రోదన లో
• చల్లని గాలే తాకింది
కమ్మగా నిదుర ని నిలిపింది.
• మాట రాని ఆటలకు
విలువే ముంది
• ఆడి ఆడి అలసిన
పాదాలలో పదనిస దాగుంది.
• భయమ ను బెంగ తో
బాధ ను మౌనం గా
బాల్యం ఎదిగింది.
ప్రేమ ను పొదిగింది.
• ఆశల హారతి తో
నిట్టూర్పు ల నాట్యం తో
జీవం సాగింది.
బ్రతుకే మెలి తిరిగింది.
• పసి వయసు కి
ప్రేమే ముంది.
కలత పడే కంటి లో
మనసే దాగుంది.
• కన్నీళ్ల కు
లోటే ముంది.
అలజడి మాటు న
ఆవేదన దాగుంది.
యడ్ల శ్రీనివాసరావు 18 Oct 2023 10:30 pm
No comments:
Post a Comment