ప్రేమంటే
• ప్రేమంటే ఏమంటూ చెప్పేది
పడి పడి లేచే మనసు కి
తడ బడి చూసే కనుల కి.
• నువ్వంటే ఎవరని తెలిపేది
అల జడి లేని వయసు కి
ముడి పడి ఉన్న జనుసు కి.
• నిను తలచిన అనుక్షణం
మది మురిసెను ప్రతిక్షణం.
• నువు పలికిన మరుక్షణం
ఎద వెదికెను తక్షణం.
• ఏదో … ఏదో … ఏదేదో
అది ప్రేమే కాదంటావా …
• ప్రేమంటే ఏమంటూ చెప్పేది
పడి పడి లేచే మనసు కి.
• నువ్వంటే ఎవరని తెలిపేది
అల జడి లేని వయసు కి.
• అరచేతులు కలిసిన అర్దం
కనుసైగన దాచిన భావం.
• కలబడిన మాటల శబ్దం
మునివేళ్లను మీటిన మౌనం.
• ఏదో … ఏదో … ఏదేదో
అది ప్రేమే కాదంటావా ….
• శూన్యం లో చూసేటి సమయం
కన్నీరు జారిన వయనం.
• ఒంటరిగా చేసేటి మధనం
నిరీక్షణ తో వేచిన కాలం.
• ఏదో … ఏదో … ఏదేదో
అది ప్రేమే కాదంటావా …
• ప్రేమంటే ఏమంటూ చెప్పేది
పడి పడి లేచే మనసు కి.
• నువ్వంటే ఎవరని తెలిపేది
అల జడి లేని వయసు కి.
జనుసు = జన్మ, జీవితకాలం
మధనం = కలవరించడం
యడ్ల శ్రీనివాసరావు 20 Oct 2023 , 2:00 pm
No comments:
Post a Comment