కధ కాదు - వ్యధ కాదు
• కధ కాదు నేస్తం
ఇది కధ కాదు.
• కధ కలిసిన జీవితం
కంటికి కనిపించని జీవనం.
• వ్యధ కాదు నేస్తం
ఇది వ్యధ కాదు.
• వ్యధ గా సాగేటి వయనం
ఒంటరి బాటలో పయనం.
• కదిలే బొమ్మల ఆటలు
కడుపు తీపి ఆశలు.
• కాలంతో వేసేటి అడుగులు
కనపడని కన్నీటి మడుగులు.
• హంగులు నిండిన లోకంలో
రంగులు వేస్తాయి పాత్రలు.
• తెలుపు నలుపు లు మాత్రం
తేట తెల్లమై
దిక్కులు చూస్తాయి ఆశగా.
• కధ కాదు నేస్తం
ఇది కధ కాదు.
• వ్యధ కాదు నేస్తం
ఇది వ్యధ కాదు.
• గాలి పటానికి తోడే ముంది
రెప రెప లాడే ఆనందం తప్పా .
• ఆరే దీపానికి ఆశే ముంది
టప టప లాడే కేరింతలు తప్పా.
• ఎగిరే పక్షి కి దారే ముంది
దశ దిశ ఎరిగిన గమ్యం తప్పా.
• తీరం చేరే నావకి జడి ఏముంది
వడి సడి ఆటల అలల తప్పా.
• కధ కాదు నేస్తం
ఇది కధ కాదు.
• కధ కలిసిన జీవితం
కంటికి కనిపించని జీవనం.
• వ్యధ కాదు నేస్తం
ఇది వ్యధ కాదు.
• వ్యధ గా సాగేటి వయనం
ఒంటరి బాటలో పయనం.
యడ్ల శ్రీనివాసరావు 5 Oct 2023 9:00 pm.
No comments:
Post a Comment