Monday, May 29, 2023

368. మట్టిలోని మాణిక్యం

 

మట్టిలోని మాణిక్యం



• ఎగ  సొగసిందే  పల్లే       ఎగ సొగసిందే

  ఎగసి  సొగసి   బిగిసిందే   పిల్ల

  నా పల్లే   ఎగసి సొగసి  బిగిసిందే.


• మట్టిలోన   మాణిక్యం    

  పచ్ఛకోక   కొట్టుకొని

  పచ్చగడ్డి  మోపుతో   

  తళుకు  బెళుకు  లూపుకెళితే

• మట్టిలోన   మాణిక్యం 

  పచ్చకోక    కొట్టుకొని

  పచ్చగడ్డి మోపుతో 

  తళుకు  బెళుకు   లూపుకెళితే

• ఎద   జారిందే   పిల్ల

  అది  సూసాక     నా   ఎద  జారిందే.

  ఎద    జారిందే   పిల్ల

  అది  సూసాక   నా ఎద   జారిందే.


• నా  మట్టిలోన   మాణిక్యం

  మాపటేల    మంచమెక్కి

  ఆ …   మాపటేల   మంచమెక్కి

• మసకమబ్బు    సంద్రునితో

  సిగ్గు ఎగ్గు    లొలుకుతుంటే

• అవురావు  రంటొచ్ఛి   

   ఏమి సేసేదే  పిల్ల 

   నేనేమి   సేసేదే.

   ఏమి  సేసేదే  పిల్ల

   నేనేమి  సేసేది.


• ఎగ సొగసిందే పల్లే      ఎగ సొగసిందే

  ఎగసి  సొగసి     బిగిసిందే  పిల్ల

  నా పల్లే    ఎగసి  సొగసి   బిగిసిందే.


• నా  మట్టిలోన  మాణిక్యం

  సెరువు లో   తాన   మాడుతుంటే

  సింతసెట్టు  ఎక్కి  

  నేను 

  సిత్రంగా  సూత్తుంటే

• సింత   సిగురు         నన్ను   సూసి

  ఆ … సింత సిగురు    నన్ను  సూసి

• సిర్రు   బుర్రు   లాడిందే  పిల్ల

  సిర్రు   బుర్రు    లాడింది.

  సిర్రు బుర్రు   లాడిందే   పిల్ల

  సిర్రు  బుర్రు   లాడింది.


• మనువంటూ    ఆడలేదు.

  మనువంటూ    ఆడలేదు .

  ఆ ... మనువంటు   ఆడలేదు

  కానీ

• నా మనసంత    నిండి    ఉంది

  మట్టిలోని   మాణిక్యం

• మోసేటి బరువుతో   

  నర నరం  నిండి  ఉంది

  మట్టిలోని    మాణిక్యం.

  నా  మట్టిలోని మాణిక్యం.


• ఎగ సొగసిందే  పల్లే      ఎగ సొగసిందే

  ఎగసి.  సొగసి  బిగిసిందే  పిల్ల

  నా పల్లే  ఎగసి  సొగసి  బిగిసిందే.


• ముత్యమంటి    ముక్కెర తో

  ముసి ముసి     మురిపాల తో

  తాటితీగ      నడుము తో

  తడప లాంటి   సురుకు తో 

• మట్టిలోని    మాణిక్యం

  నా మట్టిలోని    మాణిక్యం 

• ఈ పల్లెంతా   తిరుగుతుందే  పిల్ల

  ఈ  పల్లెంతా   తిరుగుతు ఉంది.

• నా మనసు కి     కనపడుతుందే   పిల్ల

  తనువు లేని  

  నా మనసు కు   కనపడుతుంది.



యడ్ల శ్రీనివాసరావు 29 May 2023, 3:00 pm.




















Saturday, May 27, 2023

367. ఏడడుగుల బంధం

 

ఏడడుగుల బంధం


• ఏడడుగుల   బంధం 

  ఏనాటి దో     ఈ సంబంధం.

• తెలియని     మనసు ల కిది 

  సరికొత్త    శ్రావ్యం.

• తెలిసిన    మనుషుల కిది 

  ఓ జీవిత    గ్రంధం.


• ఏడడుగుల    బంధం 

  ఏనాటి దో      ఈ సంబంధం.

• ఎన్నో    ఆశలతో 

  అడుగులు   వేసింది   ఈ బంధం.

• మరెన్నో    ఊహలలో 

  ఊయలూగింది    ఈ అనుబంధం.


• నా   కలయిక   చెప్పింది

  ఇది  ఓ   జీవన    తూకానికి   కారణమని.

• ఈ     కాలం    చెప్పింది

  ఈ బంధం   ఓ బుణానికి    జరిమానా  అని.


• ఏడడుగుల    బంధం 

  ఏనాటి దో     ఈ సంబంధం.

• తెలియని    మనసు ల కిది 

  సరికొత్త    శ్రావ్యం.

• తెలిసిన     మనుషుల కిది 

  ఓ జీవిత    గ్రంధం.


• గడచిన    జన్మలకు   ఇది

  కొనసాగింపు     జీవితమని‌.

• అనుభవించేందుకు   కాదిది …

  ఎన్నో   అనుభవాల   జన్మ అని.

• దైవం తెలిపింది ... ఆధారం చూపింది.


• ఏడడుగుల    బంధం 

  ఏనాటి దో     ఈ సంబంధం.


• బుణాను   బంధాలెన్నో 

 నేడు    కలుస్తున్నాయి.

• తీరినాక  అవి  దూరం 

  అయి   పోతున్నాయి.


• మానవ బంధాల తో  ఈ మనిషి కి 

  మిగిలింది     నిస్తేజము.

• దైవాను బంధం తో   ఈ మనసు కి    

  కలిగింది     ఉత్తేజము.


• ఏడడుగుల    బంధం 

  ఏనాటి దో     ఈ సంబంధం.

• తెలియని    మనసు ల కిది 

  సరికొత్త     శ్రావ్యం.

• తెలిసిన    మనుషు ల  కిది 

  ఓ  జీవిత   గ్రంధం.



యడ్ల శ్రీనివాసరావు 27May2023. 6:00 PM











Wednesday, May 24, 2023

366. ఎవరేమన్నా ఎదురేముంది

 

ఎవరేమన్నా ఎదురేముంది



• ఎవరేమన్నా    ఎదురేముంది

  అడుగులు  వేద్దాం    చలో  చలో

  పరుగులు   తీద్దాం   చలో  చలో


• స్నేహం    నీ    శ్వాస  అయితే

  లోకం   దారి    చూపదా.

  ధైర్యం     నీ    ఉనికి   అయితే

  మాలోకం   తోక    ముడవదా.


• ఎవరేమన్నా    ఎదురేముంది

  అడుగులు   వేద్దాం    చలో   చలో

  పరుగులు    తీద్దాం    చలో  చలో


• విజయం    కావాలి    అంటే

  కష్టం తో    సహజీవనం    చేయాలి.

  ఆశలు      తీరాలి      అంటే

  అడియాశలతో   పయనం    సాగించాలి.


• వడ్డించి న    విస్తరి  

  కాదు రా    జీవితం

  అణిగి మణిగి   ఉంటేనే   

  సర్వం  తెలుసుకోగలం.

• ఊహించిన    ఊయల  

  కాదు   రా   జీవనం

  ఉలి దెబ్బలతో నే  

  శిల్పం గా  మారడం  సాధ్యం.


• ఎవరేమన్నా     ఎదురేముంది

  అడుగులు  వేద్దాం    చలో చలో

  పరుగులు   తీద్దాం    చలో చలో


• చీకటి ని    చూడలేవు రా     నీ కళ్లు

  చీకటి  రహస్యాలను    ఛేదించగలదు  నీ మనసు.

• నిందలను   మోయగలదు రా    నీ   ఒళ్లు

  నిందితులను   నిర్బంధం చేయగలదు   నీ శక్తి.

 

• మౌనం లో    దాగి ఉంది రా    నీ మంత్రం

  అదే   నిన్ను  నడిపించే   తంత్రం.

  తుదకు   రక్షించే  యంత్రం.


• ఎవరేమన్నా     ఎదురేముంది

  అడుగులు   వేద్దాం    చలో చలో

  పరుగులు   తీద్దాం    చలో చలో


• స్నేహం    నీ  శ్వాస    అయితే

  లోకం     దారి  చూపదా.

  ధైర్యం    నీ ఉనికి   అయితే

  మాలోకం   తోక    ముడవదా.


మాలోకం = అయోమయావస్థలో  ఉండువాఁడు.


యడ్ల శ్రీనివాసరావు 22 May 2023 , 6:00 AM.















Monday, May 22, 2023

365. సితారక

 

సితారక



• తారక   తారక    దివి  కేగిన   తారక

  ఈ జన్మ     నీ  దరి   చేరక

  జాబిల్లి ని    చేరిన    తారక    ఓ   సితారక.


• నీ వెలుగే     నా   కనుపాప న      వెన్నెలై

  మనసు కు   చూపుతొంది     ఈ లోకం.

• నీ దూరం   ఎరుగక       పరవశం లో 

  నా    భారం    తేలికయై   తేలుతు  ఉన్నా.


• తారక     తారక     దివి    కేగిన    తారక

  నా జన్మ    నీ   దరి    చేరక

  జాబిల్లి ని    చేరిన    తారక    ఓ   సితారక.


• నీ రూపం    తెలియక    ఈ    దేహం   విడవక

  వెతికా  వెతికా    జగమంతా    తిరిగా  తిరిగా

  తారక   తారక    ఓ    సితారక.


• మనసు    పొరల లో    పేరుకున్న

  ఈ    ప్రేమ    ఏమిటో

  సిరల లో ని    రకతం    చెపుతుంది

  ఈ  సిరా    రాతల  తో.


• తారక    తారక   దివి  కేగిన   తారక   సితారక.



యడ్ల శ్రీనివాసరావు 22 May 2023 2:30 PM.











Sunday, May 21, 2023

364. గోదావరి గలగలలు

 

గోదావరి గలగలలు



• గోదావరి    గలగలలు   

  గుండెల్లో    తకదిములై

• తెరచాప     రెపరెపలు 

  కన్నుల్లో      అలజడులై

• సాగేను    సరికొత్త    పయనం

  ఏ      నాటిదో      ఈ వయనం


• ఆటుపోటు    అలలు 

  ఊయలయిన   తరుణం

• నదిలోతు    అగాధం 

  నిధి  నిచ్ఛిన   సమయం

• సాగే   సాగే       సరికొత్త    పయనం

  ఏ   నాటిదో     ఈ    నవోదయం.


• ఈ   గాలి   నాది     …   ఈ   నీరు  నాది

  ఈ   శ్వాస  నాది     …   ఈ   ఆశ   నాది

  నను    తాకిన    అణువణువు

  నాది   నాది   ….   నాదే   నాది.

  నాది   నాది   ….    నాదే  నాది.


• గోదావరి      గలగలలు 

  గుండెల్లో      తకదిములై

• తెరచాప      రెపరెపలు 

  కన్నుల్లో        అలజడులై

• సాగేను     సరికొత్త     పయనం

  ఏ  నాటిదో    ఈ    వయనం


• మబ్బుల్లో     సూర్యుడు 

  మనసు లో    సరిగమలై

• సిగ్గు ల్లో        చంద్రుడు 

  సొగసు లో      కితకితలై

• సాగే   సాగే   ఈ   సరికొత్త   పయనం

  ఏనాటిదో    ఈ    శుభోదయం


• ఈ  గాలి  నాది   …  ఈ   నీరు   నాది

  ఈ  శ్వాస  నాది   … ఈ    ఆశ   నాది

  నను  తాకిన  అణువణువు

  నాది  నాది   ….  నాదే    నాది.

  నాది  నాది   ….   నాదే   నాది.


• జన్మల్లో      నిలిచిపోయి 

  జగము కు    తెలిసిన

  జవాబు లు       ఈ రాతలు.

• ఊహల్లో        కనపడని 

  ఇహము కు    తెలియని

  ప్రశ్నలు    ఈ    రాతలు.



జగము   =  విశ్వం

ఇహము  =  భూలోకం, ప్రస్తుత నివాస లోకం.


యడ్ల శ్రీనివాసరావు 22 May 2023 1:30 AM.








Thursday, May 18, 2023

363. బృందావనం

 

బృందావనం



• గువ్వ లా   ఎగరాలి       

  గూడు  దాటి  పోవాలి.

  గోకులాని    కెళ్లాలి         

  గోపిక    నై     ఆడాలి.


• గోపాలుని   కోసం     

  గోవు ను   అవుతాను

  పిల్లనగ్రోవి  ని    వింటాను.

• కన్నయ్య     కోసం     

  ముద్దులు   ఇస్తాను

  వెన్నముద్ద  ను   అవుతాను.


• సాగే    ఈ  తరుణం      

  నా కై    నిలిచింది.

  ఊగే    ఈ  విరహం       

  ఏ దో    చెపుతుంది.


• భామ ను   కావాలి        

  కృష్ణుని      చేరాలి

  సత్యభామ   నై     ఏలాలి    

  శృం గారం     పంచాలి.


• మాధవుని     కోసం   

  సుజాత గా    వెలసాను.

  పారిజాతమై    పూచాను.

• నల్లనయ్య     మనసు లో 

  ధైర్యం   నే     అవుతాను

  శౌర్యం        చూపిస్తాను.


• సాగే   ఈ    తరుణం 

  నా కై      నిలిచింది.

  ఊగే    ఈ   విరహం 

   ఏ దో    చెపుతుంది.


• బృందావనం     బహు       సుందరం

  తేలి ఆడే    మనసు ల కి   ఇంద్రవనం.

• ప్రేమ  పక్షుల       నందనం

  రాధాశ్యాముల    సంగమం.


• గువ్వ లా        ఎగరాలి 

  గూడు   దాటి   పోవాలి.

  గోకులాని     కెళ్లాలి 

  గోపిక నై      ఆడాలి.


• భామ ను     కావాలి

  కృష్ణుని        చేరాలి.

  సత్యభామ  నై    ఏలాలి 

  శృం గారం     పంచాలి



తరుణం = సమయం, యవ్వనం

విరహం = ఎడబాటు, వియోగం

సుజాత = మంచి వంశం లో పుట్టిన ఉత్తమ స్త్రీ.


యడ్ల శ్రీనివాసరావు 18 May 2023  9:30 pm.













Wednesday, May 17, 2023

362. ఓ మానవుడా తెలుసుకో

 

ఓ మానవుడా తెలుసుకో



• ఓ    మానవుడా  తెలుసుకో

  నీ   మూలాలు    తెలిసి   మసలుకో.


• గర్భం లో   మూసుకున్న    మనోనేత్రాన్ని

  ధ్యానం తో  తెరచి    జన్మ  రహస్యం తెలుసుకో.


• కోరికల    కొలిమిలో    కొట్టుమిట్టాడుతూ

  తలకొరివి  కోసం  గిట్టలేదని  తెలుసుకో.


• మాయ   మోహలలో    మునిగి తేలుతూ

  మంచిని  విస్మరించేందుకు  పుట్టలేదని  తెలుసుకో.


• ఓ   మానవుడా    తెలుసుకో

  నీ    మూలాలు   తెలిసి  మసలుకో.


• గర్భం లో   మూసుకున్న   మనోనేత్రాన్ని

  ధ్యానం తో  తెరచి   జన్మ  రహస్యం తెలుసుకో


• నిన్ను   నువ్వు   మరచి

  అసలు   కర్మ    వదిలి

  ఎన్ని    జన్మలని    ఎత్తుతావు

  ఎంత   దుఃఖమని   మోస్తావు.


• భక్తి   తోన      ముక్తి    ఏనాటికి   కలిగెనో

  జ్ఞాన  శ్రేష్ట కర్మ ల   తోనే   దొరికెను   జీవన్ముక్తి.


• శివుడు    పరమాత్ముడని   

  పలికి న     జీవన మే   జీవితం

  ఈ సత్యం    ఎరగని    వానికి  

  అంతా     క్షోభ మయం.


• ఓ   మానవుడా  తెలుసుకో

  నీ    మూలాలు   తెలిసి   మసలుకో.


• గర్భం లో   మూసుకున్న    మనోనేత్రాన్ని

  ధ్యానం తో   తెరచి    జన్మ  రహస్యం  తెలుసుకో.


ఓం నమఃశివాయ 🙏

ఓం శాంతి 🙏


యడ్ల శ్రీనివాసరావు 17 May 2023. 8:30 PM.



















Tuesday, May 16, 2023

361. ప్రేమ సంకెళ్లు

 

ప్రేమ సంకెళ్లు



• తీరని   ఆశల   చీకటి        

  ఓ   జీవితం

  అది   జన్మకు   వెలుగై    చూపిన 

  రహస్యం.

• తీరని    ఆశల    చీకటి  

  ఓ జీవితం

  అది    జన్మకు  వెలుగై  చూపిన 

  రహస్యం.


• నిలిచి    పోయిన           ప్రేమం

  ఓ   మనసు    ఎరిగిన       కావ్యం

  ఏ   మనిషికి    తెలియని   భావం.


• మిగిలి    పోయిన     ఆశలు

  జారే      కన్నీరు కి       వేదం

  అదే    ఈ  కాలానికి    సాక్ష్యం.


• తీరని    ఆశల    చీకటి 

  ఓ జీవితం

  అది   జన్మకు   వెలుగై   చూపిన 

  రహస్యం


• కాలం    ఓ    చక్రం

  తిరుగుతూ నే    ఉంది.

• ప్రేమం    ఓ    బంధం

  తీరకనే    ఉంది.


• జన్మ జన్మల     జీవితం

  సాగుతు  నే        ఉంది.

• ఆశ    పాశాల     బుణం

  కొనసాగుతు  నే    ఉంది.


• ఏమి   శేషమో    …    ఎంత   విశేషమో

  ఏమి   చిత్రమో   …    ఎంత   విచిత్రమో.


• తీరని    ఆశల    చీకటి 

  ఓ   జీవితం

  అది   జన్మకు  వెలుగై    చూపిన

  రహస్యం.


• ప్రేమ లో    ప్రేమికులు      ఎందరో 

  ఆశ   లో    ఆలుమగలు    ఎవరో


  అక్షరాలే    ఈ   ప్రేమకు    సంకెళ్లు.


• తీరని    ఆశల    చీకటి 

  ఓ జీవితం

  అది     జన్మకు    వెలుగై   చూపిన  

  రహస్యం



యడ్ల శ్రీనివాసరావు 16 May 2023 , 3:30 pm.
















Monday, May 15, 2023

360. పాపభారం

 

పాపభారం


• తల పైన    పాపము    

  ఇల లోన   భారము.

• ఎదగ   లేని    మనిషి కి    

   ఇదే   ఒక   మడుగు.  

•  మెరుగు లేని   మనసు కి   

   ఇదే   ఒక   మరుగు.


• తల పైన   పాపము    

  ఇల  లోన  భారము.

• బుద్ధి    యోగముయితేనే

  తొలుగుతుంది   ఈ   హేయము.

• కర్మ     శుద్ధి     అయితేనే

  కరుగుతుంది     ఈ    దీనము.


• దేహం   వికారాల    పుట్ట గ   కొలువై  నపుడు

  జీవం    విచారాల    దిట్ట గ     నెలవు .


• ఇరుగు  పొరుగు   వారితో   కాలక్షేపం

  శక్తి  హీనమయ్యేటి   మానసిక  చపలం.


• అసత్యపు   మాటలు    ఉనికి ని   పోగొట్టి

  విలువను కోల్పోయే     అగాధపు  అంచులు.


• వ్యర్థమైన   అలవాట్లు    మరణాన్ని   స్వాగతించి

  నరకానికి    దారి చూపే   రాచరికపు   బాటలు.


• తల పైన    పాపము 

  ఇల  లోన   భారము.

• బుద్ధి    యోగముయితేనే

  తొలుగుతుంది   ఈ హేయము.

• కర్మ  శుద్ధి       అయితేనే

  కరుగుతుంది   ఈ దీనము.



మడుగు  = గొయ్యి

మెరుగు  = ప్రకాశం 

మరుగు =  మురికి, రొచ్చు 

హేయము =  పాపం,  చేయకూడనిది

దీనము =    దారిద్ర్యం

చపలం =     నీచం.


యడ్ల శ్రీనివాసరావు 15 May 2023 7:00 pm










Sunday, May 14, 2023

359. ఆశా పాశం

 

ఆశా పాశం



• కల యేనా    ఇది    నిజమే నా

  ఈ ఆశ    కాలం లో    కరిగే నా.

• ఏనాడు     మిగిలిన    శేషమో

  ఈనాడు    తెలిసేను    బుణము.

• కల యేనా    ఇది     నిజమే నా

  ఈ ఆశ    కాలం లో     కరిగే నా.


• కలవని    కలయిక     ఈ కావ్యము

  యుగము ల    ప్రేమ కు   ఆధారము.

  తెలుసా  … మనసా …   ఇది ఏనాటి దో.


• ఊహకు    అందని     ఈ బంధము

  వీడని      ఆత్మతో     సంబంధము

  తెలుసా  …  మనసా …   ఇది ఏనాటి దో.


• కల యేనా     ఇది     నిజమే నా

  ఈ ఆశ     కాలం లో   కరిగే నా.

• ఏనాడు    మిగిలిన    శేషమో

  ఈనాడు    తెలిసేను   బుణము.


• మనిషే    లేని     ఈ మననం

  మనువే    కాని    ఓ మదనం

  తెలుసా  … మనసా  …  ఇది ఏనాటి దో.


• ప్రేమ ని    తెలిసిన    ఈ‌ ప్రణయం

  గమనం     లేని       ఓ సజీవం

  తెలుసా  … మనసా  …  ఇది ఏనాటి దో.


• కల యేనా     ఇది    నిజమే నా

  ఈ ఆశ      కాలం లో   కరిగే నా

• ఏనాడు    మిగిలిన   శేషమో

  ఈనాడు    తెలిసేను   బుణము.


• జడి లేని     జావళి    ఈ సాహిత్యం

  తడి    ఆరని    మనసు కి   సాకారం.

  తెలుసా   … మనసా  …  ఇది ఏనాటి దో.


జడి = దుఃఖం, బాధ

జావళి = గీతం, గీతా విశేషం.

సాకారం = రూపం, ఆకారం.


యడ్ల శ్రీనివాసరావు 15 May 2023 , 6:00 AM.


358. నెచ్చెలి

 

నెచ్చెలి



• చెలి   ఓ  చెలి    నెచ్చెలి

  నిను చేరిన   ఈ క్షణము నే    మెచ్చె లి.

  చెలి   ఓ  చెలి    నెచ్చెలి

  నిను చేరిన   ఈ క్షణము   నే    మెచ్చె లి.


• నీ   చూపు తో    కలిగే   నా    లో  చలి

  చలన మై     చేరాను    నీ    బిగి  కౌగిలి.

• నీ   స్పర్శ తో     మెదిలే     నా లో  గిలి

  అచల మై   మిగిలాను   నీ  ఒడిలో   పడి.


• చెలి    ఓ  చెలి    నెచ్చెలి

  నిను  చేరిన    ఈ క్షణము   నే   మెచ్చె లి.


• నీ   కన్నులలో    మెరిసిన    కాంతి రేఖల

  వెలుగు   జీవిత   రహదారి యితే

  కాలం   ఆగుతుంది.

  నాకై   నూరేళ్ళు    వేచి   ఉంటుంది.

 

• నీ   నుదుట    నిలిచిన    సింధూరం

  ప్రేమకు   సాక్ష్యం  అయితే

  బంధం   సాగిపోతుంది

  నా   అనుబంధం  అమరమై   ఉంటుంది.


• చెలి    ఓ  చెలి    నెచ్చెలి

  నిను చేరిన   ఈ క్షణము   నే    మెచ్చె లి.


• రాలని    ప్రేమకు     ప్రియురాలి వై

  నువు    రాగాలు     పలుకుతుంటే

  వీడని    పుట్టుమచ్చ నై

  నీ  లో    ఏకమై    ఉంటాను.


• సుఖము ను   పంచే   సఖురాలి వై

  నువు   సోయగం    విరపూస్తుంటే

  ఆరని    పారాణి   నై

  నీ  పాదం  లో   జీవమై  ఉంటాను    .


• చెలి     ఓ  చెలి    నెచ్చెలి

  నిను   చేరిన  ఈ క్షణము నే   మెచ్చె లి.


యడ్ల శ్రీనివాసరావు 14 May 2023 4:30 PM.

















Friday, May 12, 2023

357. జీవితం లో వెలితి


జీవిత కొరత



కొరత అంటే వెలితి  చెప్పాడానికి , రాయడానికి చాలా చిన్న మూడు అక్షరాల పదం. కాని నిలువెత్తు మనిషి ని శాసించి, హింసించి లేదా బ్రతకడానికి ఆశ కలిగించే పదం…. అంటే ఒక మనిషి జీవితాన్ని మంచి చెడు ఎటైనా సరే నడిపించ గల పదం “కొరత” , “వెలితి” , “లోటు”.


• ప్రశాంతంగా ఆలోచిస్తే తెలుస్తుంది నిజమో కాదో…     ఎందుకంటే  ఉదాహరణకు

• ఒక ఇంటర్ విద్యార్థి బాగా చదువుకుని ఎంసెట్ లో మంచి ఎంసెట్ ర్యాంకు తెచ్చుకొని ఉన్నత మైన చదువులు చదవాలని ఉంటుంది. ప్రయత్న లోపం లేకుండా బాగా కష్టపడి చదివినా సరే మంచి ర్యాంకు సంపాదించలేక పోవడం తో,   ఒక ఏడాది లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుని ఎంసెట్ రాసిన మరలా మంచి ర్యాంకు రాక మరలా మరో సంవత్సరం ఇదే విధంగా అహర్నిశలు కష్టపడి చదివినా సరే చివరికి సీటు దొరకక పోవడం తో, డొనేషన్లు తో ప్రైవేటు కళాశాలల్లో చదివే స్తోమత లేకపోవడంతో మనసు కి నచ్ఛిన చదువు , చదువుకోలేక రాజీ పడి తన కలను చంపుకొని డిగ్రీ చదువుతాడు. ఇది ఆ విద్యార్థి కి తన జీవితంలో పూరించ లేని వెలితి.


• ఒక యువతి తన ప్రాణం లా ఒక యువకుడి ని ప్రేమిస్తుంది. ఆమెకు ఆ అబ్బాయి కేవలం తన కోసమే పుట్టాడు అని అనిపించేంత గా ఉంటుంది తన ప్రేమ . ఇద్దరూ ఒకరినొకరు ప్రేమించుకుంటారు. చావు అయినా బ్రతుకు అయినా కలిసే ఉండాలని అనుకుంటారు. కాని ఆ యువతి తల్లి తండ్రులు బలవంతంగా వారిని విడదీసి ఆ అమ్మాయి కి మరో మనిషి తో వివాహం చేస్తారు. విధి లేక తన ప్రేమను చంపుకొని జీవితాంతం ప్రేమించిన వ్యక్తిని కోల్పోయిన కొరత తో  మరజీవి లా జీవించడం అలవాటు చేసుకుంటుంది. ఇది ఆ యువతి జీవితం లో పూరించలేని కొరత, లోటు, వెలితి.


• ఒక పన్నెండు సంవత్సరాల అబ్బాయి కి అక్కాచెల్లెళ్ళు, అన్నదమ్ముల ఎవరు లేరు. తండ్రి ఎవరో కూడా తెలియదు. ఆ అబ్బాయి కి తన తల్లే సర్వస్వం. ఒకరోజు ఆ చిన్న వయసు లో ఉండగా నే , అనారోగ్యం తో తన తల్లి చనిపోయింది. ‌ తనకంటూ ఎవరూ లేని అనాధగా ఆ పిల్ల వాడు కుమిలి పోతూ ఉంటాడు. తనకు తల్లిదండ్రులు, బంధువులు ఎవరు లేరని నిత్యం ఒక బాధతో చిన్న తనం నుంచే అలవాటు పడి, జీవిస్తూ ఉంటాడు. ఆ అబ్బాయి కి రక్త సంబంధాలు అనేవి పూరించ లేని కొరత, లోటు, వెలితి.


• ఒక వ్యక్తి బాగా చదువుకుని మంచి ఉద్యోగం, జీతం తో కుటుంబాన్ని సంతోషంగా చూసుకుంటూ జీవించాలి అనుకుంటాడు. కాని ఎన్ని ప్రయత్నాలు చేసినా, తన జీవిత కాలంలో ఎప్పుడూ ఎక్కడా, తన స్థాయికి తగిన ఉద్యోగం , జీతం సంపాదించలేక రాజీ పడి తన లక్ష్యాన్ని సాధించుకోలేక అల్ప జీతం, ఉద్యోగం తోనే తన జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. ఇది ఆ వ్యక్తి జీవితంలో పూరించలేని కొరత, లోటు, వెలితి.


• ఒక చిన్న వ్యాపారి తన వ్యాపారం తో అహర్నిశలు కష్టపడి అభివృద్ధి చెంది , బాగా ధనం సంపాదించాడు. ఆ ధనం తో ఒక చిట్ ఫండ్ కంపెనీ, మరియు వడ్డీ వ్యాపారం చేస్తాడు. తన దగ్గర అప్పులు తీసుకున్న వారు, చిట్ లు వేసిన వారు కొంత కాలానికి పూర్తి గా ఎగేసి తిరిగి చెల్లించక పోవడం తో ఆ వ్యాపారి పూర్తిగా దివాళా తీస్తాడు. వీధిన పడతాడు. ఈ స్థితి తన జీవితానికి ఒక పెద్ద వెలితి.


• ఇప్పుడు ఆలోచిస్తే, తాను అనుకున్న చదువు చదువు కోలేని విద్యార్థి, తాను ప్రేమించిన వ్యక్తితో జీవితం గడపలేని యువతి, ఏ బంధాలు ప్రేమ కు నోచుకోలేని పిల్లవాడు, అనుకున్న ఉద్యోగం సాధించలేని ఒక వ్యక్తి, సర్వం కోల్పోయిన వ్యాపారి……వీరందరికీ జీవితం లో వెలితి ఒకో విధంగా ఉంది.

• వీరికే కాదు ఈ సృష్టిలో పుట్టిన ప్రతీ మనిషి కి ఏదో ఒక వెలితి తప్పకుండా ఉంటుంది. నా జీవితం లో మాత్రమే ఇలాంటి వెలితి ఉంది అని ఎవరైనా అనుకుంటే అది ఒక అజ్ఞానం.

• సరే…. ముఖ్యంగా ఇప్పుడు ఇక్కడ ఆలోచించ వలసిన విషయం ఏమిటంటే, ఇలాంటి కొరతలు జీవితం లో ఉన్నప్పుడు ఏం చేయాలి. అలా బాధపడుతూ సరిపెట్టుకుని, రాజీ పడి జీవించ వలసిందే నా అంటే, ముమ్మాటికీ కాదు. ఇక్కడ ఏ మనిషి కైనా మొదట సరియైన ఆలోచన విధానం ముఖ్యం. అదే జీవితాన్ని సంతోషంగా నడిపించ గలదు. తరువాత స్థితి లో మనిషి యొక్క పరిస్థితులు ఆధారపడి ఉంటాయి.

• ఇప్పుడు ఇక్కడ ఈ స్థితిలో ఆలోచన ఎలా చెయ్యాలి…. అంటే ,  ఒక మనిషి బలంగా లేదా ధృడంగా ఒక కోరిక , లక్ష్యం అనుకొని జీవితం లో ముందుకు వెళుతున్నప్పుడు…. అది సాధించ లేకపోయినప్పడు , ఆ మనిషి తెలుసుకోవలసిన నిజాలు, పరమ సత్యం ఏమిటంటే


• 1. అతను ఈ జన్మలో తను ప్రస్తుతం అనుకున్న లక్ష్యం నెరవేర్చు కోవడం  కాదు జన్మ తీసుకుంది. తాను ఎంత ధర్మబద్ధంగా ప్రయత్నించినా , ఫలితం, విజయం రావడం లేదు అంటే నిజానికి అతను ఆ లక్ష్యం లేదా ఆ కోరిక తీర్చుకునేందుకు పుట్టలేదు అని అర్థం. అది కాకుండా  వేరే ఏదో  purpose ఉంది అని అర్దం.  ఎందుకంటే ప్రతీ మనిషి జన్మ తీసుకోవడం లో ఒక రహస్యం దాగి ఉంటుంది.


• 2. అతను ఇది వరకే అంటే గత జన్మలలో ఆ లక్ష్యం పూర్తి చేసేసాడు, కాబట్టి ఇప్పడు నెరవేర్చు కోవలసిన అవసరం లేదు.  అందుకే ఈ జన్మలో తిరిగి ఆ కోరిక , లక్ష్యం నెరవేరడం లేదు అని అర్దం.

• 3. లక్ష్యం సాధించటం లో ప్రయత్న లోపం ఉందని అర్దం. అది గ్రహించ లేక పోవడం వలన , అనుకున్నది సాధించలేక పోయాడు అని అర్దం.

• మనిషి తన ఆలోచనలను సావధాన పరచుకుంటే ప్రతీ అంశం, ప్రతీ విషయం లో దాగి ఉన్న కారకత్వం, రహస్యం తెలుస్తుంది. ఆ సమాధానం తెలిసుకోగలిగినపుడు మనిషి తాను అనుకున్నది సాధించలేక పోయినా సహేతుకమైన కారణం తెలియడం వలన జీవితం లో ఏ వెలితి ఉండదు. మనిషి వెలితి తో, వెలితి కోసం జీవించడానికి కాదు పుట్టేది.


• ఆ విద్యార్థి ఉన్నత చదువులు ఇదివరకే చదివేసాడు కాబట్టి ఎంత ప్రయత్నించినా తాను అనుకున్నది చదవలేక పోయాడు. ఈ విషయం ఆ విద్యార్థి గ్రహిస్తే సంతోషం జీవిస్తాడు.

• ఆ యువతి గత జన్మలో ఒకరిని ప్రేమించి మోసం చేసింది కాబట్టి , నేడు ఆ ప్రేమ లభించక బాధపడుతుంది.

• ఆ పిల్ల వాడు గత జన్మలో మంచి కుటుంబం లో పుట్టి , రక్త సంబంధాలకు విలువ ఇవ్వకుండా అందరి క్షోభకు కారణం అయ్యాడు కాబట్టి, నేడు తాను చిన్న తనం లో అందరినీ కోల్పోయి దుఃఖం అనుభవిస్తున్నాడు.

• ఆ వ్యక్తి గత జన్మలో ఇది వరకే చాలా బాధ్యత లతో కూడిన ఉన్నత మైన ఉద్యోగం చేసి పరిపూర్ణం అయ్యాడు కాబట్టి నేడు ఆ స్థాయి అవసరం లేదు.

• ఆ వ్యాపారి నేడు మంచివాడు అయినా సరే గత జన్మలో ఎందరి దగ్గరో అప్పులు తీసుకుని తిరిగి ఇవ్వలేదు కాబట్టి, నేడు సంపాదించిన దంతా వడ్డీ తో సైతం తిరిగి వారికే చెల్లించాడు.


• ఈ విధంగా ప్రతీ మనిషి తన జీవిత కర్మలను తెలుసుకొని, అర్దం చేసుకొని వాటి నివృత్తి మార్గం ఆచరిస్తే ఏ కొరత, వెలితి, లోటు ఉండదు సరికదా…. ఉన్న స్థితిలో సంపూర్ణ మైన ఆనందం లభిస్తుంది. జీవితం మనది. జీవించేది మనం. ఆలోచనల లో లోపాలు కూడా తెలుసుకోవలసినది మనమే , కానీ మన గురించి ఎవరూ ఆలోచించరు, ఎవరు కూడా మన బాధలను   నయం చెయ్యలేరు.

• ప్రతీ మనిషి ఒక కారణం తోనే జన్మ తీసుకుంటాడు. ఆ కారణం  లోనే జన్మ రహస్యం దాగి ఉంటుంది. అది తెలుసు కో గలగడం దైవ బలం, ఆశీర్వాదం తో నే సాధ్యం. 

ఈ సూక్ష్మం ఎరుగక పోతే జీవితం లో కొరత , లోటు, వెలితి జన్మ జన్మలు వెంటాడుతూనే ఉంటుంది. 

ప్రతీ విషయం లో ముందుకు(భవిష్యత్తు) ఆలోచించాలి అంటారు. కాని వెనుకకి ఆలోచిస్తే నే కొన్ని సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది.  ఎందుకంటే వెనుక (భూత కాలం) దాటే  మనము వచ్చాం అని గ్రహించాలి.  భూత కాలం లో శేషం ఎక్కడ ఉందో  వెతుక్కుంటేనే   వర్తమానం లో నడవడిక , ఆచరించే  పనివలన  భవిష్యత్తు బాగుంటుంది.


ఓం నమఃశివాయ 🙏
ఓం శాంతి 🙏

యడ్ల శ్రీనివాసరావు 12 May 2023, 12:10 pm.



























Thursday, May 11, 2023

356. ముద్దు గుమ్మ

 

ముద్దు గుమ్మ



• చెంగావి    చీర    లో   

   చెంగున   గెంతే    గుమ్మ.

• చామంతి   రైక   లో 

  తుర్రున     జారే     బొమ్మ.

• ఎక్కడికి     పోతావే 

  నా   ముద్దు  గుమ్మ.

• నిను   ఎక్కడ   వెతకాలే 

  నా   చిట్టి    బొమ్మ.


• రివ్వున   ఎగిరే    గాలి లో

  రివట   లాంటి   నీ   సొగసు

  రై రై   అంటూ   నను   మీటి   పోతుంటే

  ఏదో    కలవరం ...

• ఏమిటో  …  అది ఏమిటో.


• ఓ    నీలి    కన్నుల   రాణి

  నిలవ   నీ  కున్నావు    కానీ.

• నీ  నడుము   వొంపు లో   బాణి

  జారి  బయటకొచ్చింది   వోణి.

• ఎందు  కోసమో  …  ఎవరి  కోసమో.


• చెంగావి  చీర  లో 

  చెంగున  గెంతే   గుమ్మ.

• చామంతి  రైక  లో 

  తుర్రున   జారే   బొమ్మ.

• ఎక్కడికి    పోతావే 

   నా   ముద్దు  గుమ్మ.

• నిను   ఎక్కడ   వెతకాలే 

   నా   చిట్టి   బొమ్మ.


• జివ్వ  నిపించే    అందం లో

  హంస   లాంటి    నీ  రూపం

  రా రా  అంటూ   నన్నే    సైగ  చేస్తుంటే

  ఏదో    పరవశం ...

• ఏమిటో  …  అది ఏమిటో.


• ఓ   సన్నజాజి   పూబోణి

  కలవ   నీ  కున్నావు   కానీ.

• నీ పెదవి   సొంపు లో   మణి

  రత్నమై   జారింది    రాగిణి.

• ఎందు  కోసమో …  ఎవరి  కోసమో.


• చెంగావి    చీర  లో 

   చెంగున  గెంతే    గుమ్మ.

• చామంతి   రైక లో 

  తుర్రున  జారే   బొమ్మ.

• ఎక్కడికి   పోతావే 

  నా   ముద్దు  గుమ్మ.

• నిను  ఎక్కడ   వెతకాలే 

   నా   చిట్టి   బొమ్మ.


యడ్ల శ్రీనివాసరావు 11 May 2023 3:00 PM.





Tuesday, May 9, 2023

355. దేవయాని

 

దేవయాని


• ప్రియా    ఓ     ప్రియా

  సఖీ       నా     సఖీ.

• నీ  పలుకు తో      లేచింది      నా  ప్రాణం

  నీ  ఉలుకు తో      కదిలింది     ఈ  జీవం.


• కుసుమం  లా      కలిసావు

  ప్రేమ   రంగులను  చూపావు.

• *ఉమ్మెత్త    లా       విరిసావు

   మది   హంగులను  దాచావు.


• *తమము లో    తోడై న      తరంగిణి

    తపన    తో     నీడవుతా    సరాగిణీ.


• ప్రియా    ఓ    ప్రియా

  సఖీ       నా    సఖీ.

• నీ  పలుకు   తో        లేచింది   నా  ప్రాణం

  నీ   ఉలుకు తో        కదిలింది  ఈ   జీవం.


• చుక్క లా     మెరిసావు 

  ప్రేమ   వెన్నెల ను   నింపావు.

• లాలి  లా   చేశావు

  ప్రియురాలి  లా    అయ్యావు.


• కనులకు    కనపడని    కాత్యాయని

  దేవత లా    విహరించే    దేవయాని.


• ప్రియా    ఓ    ప్రియా

  సఖీ       నా   సఖీ.

• నీ  పలుకు తో    లేచింది    నా ప్రాణం

  నీ  ఉలుకు తో    కదిలింది   ఈ జీవం.



ఉమ్మెత్త =  అందమైన  తెల్లని  ఔషధ గుణాల పువ్వు 

తమము = చీకటి, అంధకారం


యడ్ల శ్రీనివాసరావు 9 May 2023 , 2:30 pm .








Friday, May 5, 2023

354. ప్రకృతి కి మనసు ఉండదా

 

ప్రకృతి కి మనసు ఉండదా



• అందాలు    అందాలు

  చందాలు    చందాలు.

  అందమైన    ప్రకృతి లో 

  అంతు  లేని   అందాలు.

  రేయి పగలు   ఆదమరచి 

  పెన  వేసుకున్న  చందాలు.


• అల  తాకిన   శిలకు

  అందమే  కాని   ఆనందం  తెలియునా.

• అలుపెరుగని   సాగరం కి

  ఘోష యే   కాని   శాంతం  ఎరుగదు.


• నిశి    నిండిన  చీకటి కి

  మౌనమే కాని   మల్లెల  పరిమళం  తెలియునా.

• తొలి   పొడుపు  భానుని కి

  భగభగ లే   కాని పిల్ల  గాలులు  ఎరుగడు.


• ఎందుకో   ఎందుకో …. ఇలా

  ప్రకృతి కి  మనసంటూ  ఉండదా ...

  అందాలకు  ఆనందం  ఎవరిస్తారు.


• అందాలు    అందాలు

  చందాలు    చందాలు.

  అందమైన    ప్రకృతి లో 

  అంతు  లేని   అందాలు.

  రేయి  పగలు   ఆదమరచి 

  పెన   వేసుకున్న  చందాలు.


• మట్టిలో ని   మలినాని  కి

  కలుషితమే   కాని   మాణిక్యం   తెలియునా

• సరసు లో ని    నీటి  కి

  దుర్గంధమే  కాని   కలువందం  ఎరుగదు.


• హరివిల్లు లో    రంగులకు

  శూన్యమే  కాని   సప్త వర్ణాలు  ఎరుగవు.

• పాలపిట్ట   అరుపు లో   ఆక్రందనే  

  కాని   రాగం   ఉందని   తెలియదు.


• ఎందుకో    ఎందుకో ….  ఇలా

  ప్రకృతి కి  మనసంటూ  ఉండదా ...

  అందాలకు  ఆనందం  ఎవరిస్తారు.


• అందాలు    అందాలు

  చందాలు     చందాలు.

  అందమైన   ప్రకృతి లో 

  అంతు   లేని   అందాలు.

  రేయి పగలు   ఆదమరచి 

  పెన  వేసుకున్న  చందాలు.


యడ్ల శ్రీనివాసరావు 6 May 2023 9:00 am.












Wednesday, May 3, 2023

353. ఒంటరి తనం - ఏకాంతం

 

ఒంటరి తనం – ఏకాంతం


• ఒంటరి తనం , ఏకాంతం ఈ రెెండు ఒకేలా అనిపిస్తూ ఉంటాయి చాలా మంది కి. కాని రెండింటి మధ్య చాలా వ్యత్యాసం ఉంది.


ఒంటరి తనం

• ఒంటరి తనం లో మనిషి కి , మనసుకు ఒక విధమైన అపరిపక్వత ఉంటుంది. ఇందులో మనిషి ఏదో తెలియని దుఃఖం అనుక్షణం అనుభవిస్తాడు. విధి తన పట్ల వక్రించినట్లు, కాలం తనకు అన్యాయం చేసినట్లు, కేవలం ఒక వ్యక్తి  తనలో   తాను మాత్రమే ఆ స్థితి అనుభవిస్తున్న భావన అంతరంగం లో స్థితమై ఉండి పోతుంది.

• ఈ దశలో మనిషి తను మినహా, తన కుటుంబం లో కాని, పరిసరాలలో కాని, సమాజం లో కాని ఉన్న ప్రతీ ఒక్కరూ సంతోషం గా ఉన్నారని భావిస్తాడు. ఇందులో మనిషి తనకే తెలియని ఒక ఆత్మన్యూనతా భావం (డిప్రెషన్)  లోకి జారిపోతాడు.  ప్రతి క్షణం తాను ఒంటరిని , తనకంటూ ఎవరూ లేరని   లేదా  అందరికీ అన్నీ ఉన్నాయి తనకు మాత్రమే ఏమీ లేవు అనే ఆలోచనలు నిరంతరం వేధిస్తూ ఉంటాయి. అందువలన ఎవరితోనూ కలవక ఒంటరి గా ఉండడం అలవాటు చేసుకుని నిమ్న తత్వం తో ఉండడం జరుగుతుంది.

• ఇది చాలా సహజంగా ఎక్కువ శాతం చిన్న పిల్లల్లో, విద్యార్థి దశలో మరియు కొందరు పెద్ద వారిలో కనిపిస్తుంది. దీనికి ముఖ్యంగా కొన్ని కారణాలు ఉంటాయి. అవి చదువు లో ఏకాగ్రత లేక పోవడం, కుటుంబంలో ప్రేమ లభించక పోవడం, అనుకున్నది సాధించలేక వెనకబడడడం, అపజయాలు కలగడం, జీవితం పట్ల సానుకూలత లేకపోవడం. ఇలాంటి వి అనేక కారణాలు కలిసి మనిషి కి తన లో ఉన్న మానసిక శక్తి బలహీనం గా అయి పోతుంది. నిజానికి ఈ దశలో మనిషి మనసు కి తన చుట్టూ ఎంత మంది ఉన్నా ఒంటరి గా అనిపిస్తుంది, వేదన మిగులుతుంది.


• కానీ వాస్తవానికి ఈ ఒంటరితనాన్ని మనిషి కాస్త సరిగా అర్థం చేసుకుంటూ పాజిటివ్ గా ఆలోచిస్తే , నిజానికి దానంత అదృష్టం మరొకటి లేదు. ఈ సృష్టిలో ప్రతీ మనిషి ఏకైక తత్వం (uniqueness) తో నే ఉంటాడు

• అంటే ఒకరి తత్వం మరొకరి తత్వం తో అనుసంధానించబడి ఉండదు అనేది వాస్తవం. కాని మనిషి భౌతిక జీవన అవసరాలు తీర్చుకునేందుకు మరొక మనిషి తత్వం తో అనుసంధానం కావాలని ఏర్పరచుకుంటాడు. ఇది సూక్ష్మంగా ఆలోచిస్తే మనిషి మనసు ఎప్పుడూ ఒంటరే. కాని బుద్ది ఈ విషయం గ్రహించక పోవడం వలన , ఒంటరి తనం ఒక శాపం గా భావిస్తూ , తన మానసిక బలం కోల్పోతూ బాధ అనుభవిస్తుంటాడు. ఒంటరి తనం లో ఉన్న అసలైన బలం గ్రహించిన నాడు, ఈ భౌతిక ప్రపంచాన్ని శాసించే స్థాయికి చేరుకుని , తన లక్ష్యాలను అలవోకగా సాధిస్తాడు.

• మహానుభావులు, చరిత్ర సృష్టించిన వారు జీవిత లోతుల్లోకి వెళ్లి చూస్తే వారు తప్పని సరిగా ఒంటరి తనం వలన ఒక దశలో విపరీతం గా బాధపడి, ఆ బాధలో నుంచి తమ బలాన్ని గ్రహించిన వారే. ఒంటరితనం భగవంతుడు మనిషికి కల్పించిన ఒక గొప్ప అద్భుతమైన స్థితి. నీకు నువ్వు ఎవరు అని తెలుసు కో గలిగే అవకాశం కల్పించే ఎంతో ఉన్నతమైన స్థితి. అంతేకానీ ఒంటరి తనం అంటే శాపం అని, అపజయాలు కలిగినప్పుడు ఆత్మహత్య లు చేసుకోవడం వంటివి అజ్ఞానం తో కూడుకున్నవి. అన్నిటికంటే గొప్ప విషయం ఏమిటంటే, ఎప్పుడైతే మనిషి తన ఒంటరి తనాన్ని ఒక బలం , ఆయుధం గా భావిస్తాడో అప్పుడు తను జీవితం లో నటిస్తూ బ్రతకడు. నిజాయితీ గా బ్రతకడం అలవాటు చేసుకోగలుగుతాడు. అప్పుడు ఆ మనిషి కి ప్రకృతి, పంచభూతాలు కూడా సహకరిస్తాయి. ఎందుకంటే నిజాయితీ లో మాలిన్యం ఉండదు కాబట్టి.


ఏకాంతం

• ఈ స్థితి లోకి మనిషి రావాలంటే ఒక నిర్లిప్తత, వైరాగ్యం తోనే సాధ్యం అవుతుంది. వైరాగ్యం అంటే సత్యాన్వేషణ కోసం చేసే సాధన మార్గం. వైరాగ్యం అంటే విరక్తి కాదు.

• ఏకాంతం ద్వారా మనిషి పరిపక్వత ను అనుభవం చేసుకొని పరిపూర్ణత సాధించగలుగుతాడు. మనిషి ఎంత ఎక్కువ ఏకాంతంగా గడిపితే అంతగా తనను తాను మరియు ప్రకృతిని ప్రేమించగలుగుతాడు. ఏకాంత స్థితి లో మనసు కి  ఏ విధమైన అలజడులు ఉండవు. అర్దం లేని విపరీత కోరికలు  ఉండవు. ప్రశాంతంగా మనసును ఎలా ఉంచుకోవాలో తెలుసుకొని , మంచి ఆరోగ్యం గా ఉంటాడు. తన సమస్యలను తానే పరిష్కారించుకో గలడు. ఇది పూర్తిగా ఒక ఉన్నత మైన స్థితి. వ్యర్థమైన ఆలోచనలు కలుగవు.

• ఏకాంతం అంటే మనిషి తన మనసు లోని ఆలోచనలను కేవలం తనపై మాత్రమే ఒక వివేకం తో దృష్టి పెట్టుకొని నిశితంగా, ఏ అలజడులు లేకుండా గమనిస్తూ స్థిత ప్రజ్ఞత కలిగివుండటం. ఇదంతా స్పృహ లోనే ఉంటూ , జన జీవనం లోనే ఉంటూ మనిషి తను మనసును isolate చేసుకునే ప్రక్రియ.

• ఏకాంత స్థితి అనుభవిస్తున్న మనిషి అంతరంగం మరోక frequency స్థాయి లో ఉంటుంది. అంటే ఈ స్థితి లో మనచుట్టూ మనుషుల తో ఉన్నా సరే, మరెవరి యొక్క ఆలోచనల frequency ప్రభావం ఈ మనిషి పై పడదు.

• ఎందుకంటే ఏకాంతం లో ఉన్నప్పుడు ప్రకృతి మనసు తో మాట్లాడడం మొదలుపెడుతుంది. కాలం సహకరించడం మొదలు పెడుతుంది. మనిషి పంచభూతాల ప్రకృతి మిళితం. ఎప్పుడైతే మనిషి ఏకాంతం అనుభవిస్తూ ఉంటాడో , తన చుట్టూ ఉన్న ఆరా (వలయం) తెరుచుకొని ప్రకృతి ని అనుసంధానం చేస్తుంది. ఈ స్థితి లో మనిషి ఆలోచనలు ఏ కల్మషం లేకుండా ఉన్నతంగా అవుతాయి. ఇది మనిషి తనను తాను ప్రేమించుకునే మంచి స్థితి. అప్పుడు సహజంగా నే మనిషి ప్రతీ ఒక్కరిని ప్రేమించడం మొదలు పెడతాడు.

• నేటి కాలంలో సమాజం లో ఒంటరి తనం, ఏకాంతం అంటే, అవగాహన లేని వారు అనుకునేది ఏమంటే…. అన్నీ కోల్పోయిన వారు  మాత్రమే అనుభవించే స్థితి అనుకొని పొరపడతారు. ఇక్కడ ఒకటి గమనించండి, అన్నీ ఉన్నాయి అనుకున్న వారి మనసే  ఇంకా ఏదో ఏదో వెలితితో కొట్టుమిట్టాడుతూ ఉంటుంది.

• అంటే జీవితం లో  అన్నీ ఉన్నా సరే వాటికి అనుసంధానం కాకుండా, ప్రలోభ పడకుండా సంతోషం గా జీవించే స్థితి మనసు కి రావాలంటే ప్రతీ మనిషి తన జీవిత కాలంలో ఏదొక దశలో ఒంటరి తనం, ఏకాంతాన్ని చవి చూడాల్సిందే.


చివరి గా ఒక మాట

• నిన్ను ఎవరైతే ఇబ్బంది పెడుతు, బాధ పెడుతు, దుఃఖం ఇస్తున్నారో వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియచేసు కో. ఎందుకంటే వారు నీ లో కర్మ ను తొలిగిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే నీ లో జన్మాంతరం గా నిక్షిప్తమైన వి(చెడు)కర్మ ను స్వీకరిస్తున్నారు లేదా వారితో నీకు వారితో బుణం క్రమేపి తీరిపోయి వారినుంచి విముక్తి పొందుతున్నావని అర్దం. నిజం గా ఇది చాలా అదృష్టం. ఈ సూక్ష్మం ఎరుగక వారిని నిందించడం, దూషించడం వంటివి చేయకూడదు.

• అదే విధంగా నీకు సంతోషం ఇచ్చిన వారి పట్ల కృతజ్ఞత కలిగి ఉండి, ఆ సంతోషం మరో పదిమంది కి పంచడం నేర్చుకో. సంతోషం అంటే భౌతిక విలాసాలను పంచడం , వ్యర్థ కబుర్లు చెప్పడం, కాలక్షేపం చెయ్యడం కాదు. ఎదుటి వారి మనసుకు సంతోషం కలిగించే విధంగా ధర్మ యుక్తం గా ప్రవర్తించడం, మంచి మాటలు, చెప్పడం, స్పూర్తి , ధైర్యం నింపడం, దుఃఖం తొలిగేందుకు చేతనైన సహాయం చెయ్యడం….. తోచినంత లో ఇది కూడా చాలా ఉన్నతమైన సేవే.


యడ్ల శ్రీనివాసరావు 4 May 2023 10:00 AM














Monday, May 1, 2023

352. కాలసమీరం

 

కాలసమీరం



• ఎప్పుడూ  లేను     ఎన్నడూ   లేను

   ఏమిటో   ఎగురుతున్నట్లు    ఉంది

   అలా అలా    సమీరం లా.


• గువ్వను   కాను  …   గోరింకను   కాను

  హంసను   కాను …   రాజహంస   అసలే  కాను.


• ఎగిరే ది    ఎవరు    

  నా లోని   మనసా   లేక   నను  మోసేటి  వయసా.

  ఎవరు   చెపుతారు   నాకు

  ఎలా     చెపుతారు    నాకు.


• ఎప్పుడూ    లేను      ఎన్నడూ  లేను

  ఎక్కడో    తేలుతున్నట్లు   ఉంది

  ఇలా   ఇలా    కమనీయం గా.


• మేఘం   కాను   …   నీలి   మేఘం   కాను

  తరంగం  కాను   …   అంతరంగం  అసలే   కాను.


• తేలుతున్నది    ఎవరు   

  నా లోని   మనసా   లేక   నను  మోసేటి  వయసా.

  ఎవరు   చెపుతారు    నాకు

  ఎలా      చెపుతారు   నాకు.


• ఈ కాలం    వాహనమై    ఆవహించింది   నన్ను.

  అడగక నే     తీసుకెళుతుంది

  ఎటో  …  ఎటో   …  ఎక్కడికో.


• ఈ పయనం    అధ్బుతమై   మలిచింది  నన్ను.

  అడగక నే     చూపుతోంది

  ఎన్నో  …   ఎన్నో   …  ఎన్నెన్నో.

 

• మత్తుగా   లేదు   కాని    గమ్మత్తుగా  ఉంది

• వింతగా    లేదు   కాని    కొంగొత్త గా  ఉంది.

 

• ఎప్పుడూ  లేను       ఎన్నడూ  లేను

  ఏమిటో    ఎగురుతున్నట్లు    ఉంది

  అలా   అలా     సమీరం లా


• ఎప్పుడూ   లేను      ఎన్నడూ  లేను

  ఎక్కడో     తేలుతున్నట్లు    ఉంది

  ఇలా   ఇలా    కమనీయం గా



యడ్ల శ్రీనివాసరావు 1 May 2023 2:30 PM.










490. జన గళం

జన గళం • జనమెత్తిన   గళము లో   ఈ పవనం    లేచే  లే. • కదమేగిన    పోటు లో   ఈ కదనం    సాగే  లే. • గుప్పెడు   పిడికిలి   గుండేలే   ఈ   ధై...