జన గళం
• జనమెత్తిన గళము లో
ఈ పవనం లేచే లే.
• కదమేగిన పోటు లో
ఈ కదనం సాగే లే.
• గుప్పెడు పిడికిలి గుండేలే
ఈ ధైర్యం.
• ఒక్కడు వేసిన అడుగే లే
ఈ సైన్యం …
జన సైన్యం … జన సైన్యం.
• జనమెత్తిన గళము లో
ఈ పవనం లేచే లే.
• కదమేగిన పోటు లో
ఈ కదనం సాగే లే.
• భావం తోని బ్రతికే వా డే
ఈ నాయకు డే.
• త్యాగం చేసి తగ్గిన వా డే
ఈ ఉత్తము డే.
• పాలన కాదని సేవను చేసే వా డే
ఈ లక్ష్మణు డే.
• పాపుల పాలిట అస్త్రం వేసే వా డే
ఈ ఫల్గును డే.
• కులము లేదు … మతము లేదు
జాతి లేదు … వర్ణం లేదు
ఉన్నదల్లా ఒకటే లే
మానవత్వం ... మానవత్వం ... మానవత్వం.
• జనమెత్తిన గళము లో
ఈ పవనం లేచే లే.
• కదమేగిన పోటు లో
ఈ కదనం సాగే లే.
• చీకటి లో చిగురించిన వా డే
ఈ సేవకుడే.
• పేదల కోసం వెలుగై నా డే
ఈ భాస్కరు డే.
• ఆశయ సిద్ధి కి జ్యోతై నా డే
ఈ కర్షకు డే.
• జనం కోసం రక్షకు డై నా డే
ఈ సైనికు డే.
• పంచ భూతాలలో ఈ పవనం ...
పావనం చేస్తుంది లోకం ...
అదే కళ్యాణం … కళ్యాణం … కళ్యాణం.
కదమేగిన = గుర్రపు పరుగు.
యడ్ల శ్రీనివాసరావు 25 Apr 2024 9:05 pm.
No comments:
Post a Comment