నా ప్రపంచం
• నా దొక ప్రపంచం
అది సోయగాల సౌందర్యం.
• నా మనసెరిగిన ప్రపంచం
మధువొలికిన అనందం.
• అందాల ఆరబోతలు
ఆదమరచి ఉంటాయి.
• పరవశించు పరిమళాలు
గుబాళిస్తూ ఉంటాయి.
• నా దొక ప్రపంచం
అది సోయగాల సౌందర్యం.
• నా మనసెరిగిన ప్రపంచం
మధువొలికిన మాధుర్యం.
• కొండ కోనలు
కౌగిలిలో కదలాడుతుంటాయి.
• కోటి రాగాల
కోయిలలు పలకరిస్తుంటాయి.
• వాగు వంకలు
సొంపులతో సేద తీరుతుంటాయి.
• చల్లని గాలులు సంబరమై
తనువు ని తడుతు … తడుతు … ఉంటాయి.
• నా దొక ప్రపంచం
అది సోయగాల సౌందర్యం.
• నా మనసెరిగిన ప్రపంచం
మధువొలికిన మాధుర్యం.
• ప్రకృతి ఒడిలో పయనం
పంచభూతాల తో పరిణయం.
• హరిత వనంలో శయనం
శాంతి సౌఖ్యాల సంయోగం.
• తరంగాల మౌనం లో
నా అంతరంగం విహరిస్తుంది.
• కిరణాల కాంతి లో
నా మనోనేత్రం వికసిస్తుంది.
• నా దొక ప్రపంచం
అది సోయగాల సౌందర్యం.
• నా మనసెరిగిన ప్రపంచం
మధువొలికిన మాధుర్యం.
కదలాడు = చలించుట.
యడ్ల శ్రీనివాసరావు. 16 Apr 2024 , 12:05 AM.
No comments:
Post a Comment