చిన్న పిల్లలు
• మనం ఎప్పుడైనా కాస్త ప్రశాంతంగా చిన్న పిల్లలను గమనిస్తే, ముఖ్యం గా పది నుంచి పన్నెండు సంవత్సరాల వయసు లో పిల్లలలో ఉండే ఆనందం సంతోషం బహుశా ఇక ఏ వయసులోను మనిషి కి లభించదేమో అనిపిస్తుంది. ఆ వయసు పిల్లలకు తల్లి తండ్రి కుటుంబం చాలా సంతోషంగా ఆనందంగా అనిపిస్తుంది. పసి వయసులో పిల్లల మానసిక స్థితికి ఏది దొరికితే అదే అద్బుతం, అదే ఆనందం. అందులో లోటు పాటులు ఎంచలేరు సరికదా, లభించిన వాటితో అమితమైన సంతోషం పొందుతూ ఉంటారు. వారి స్థితి లో ధనికులా , పేదలా అనే ఆలోచన కూడా మనసు లో ఉండదు. అంటే ముఖ్యం గా వారికి అవగాహన ఉండదు, తెలియదు.
• ఈ వయసు పిల్లలు ప్రపంచంలో తమ చుట్టూ ఉన్న ప్రతీది చూస్తుంటారు గాని వారి మనసు లోకి ఏదీ కూడా సీరియస్ గా తీసుకోలేరు. ఒకవేళ ఆకలికి గాని, మరేదయినా విషయం లో బాధ కలిగితే, వెంటనే గట్టిగా ఏడుస్తారు. ఆ ఏడుపు లో అన్నీ మరిచి పోయి మాములుగా అయిపోతారు . చెప్పాలంటే ఈ వయసు పిల్లలకు కోపం, వచ్చినా కొన్ని నిమిషాలు, సెకన్లు మాత్రమే.
• ఇదంతా ఎందుకు అంటే పన్నెండు సంవత్సరాల లోపు వయసున్న వారిలో భావోద్వేగాలు శరీరం లో ఎక్కువ సమయం ఉండవు. అందుకే వారు చాలా ఆనందంగా సంతోషంగా ఉంటారు. అదే పన్నెండు సంవత్సరాల వయసు దాటి దాటడం తో ఉద్వేగాలు మనసు ని అంటి పెట్టుకోవడం, మనసు లో దాచుకోవడం వంటివి అనేక విధాలుగా మొదలవుతాయి.
• పెద్ధవారు ఎవరైనా సరే, ఆ వయసు పిల్లలతో కాసేపు గడిపితే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది, కొత్త శక్తి వచ్చినట్లు ఉంటుంది. ముఖ్యం గా , ఆ వయసు పిల్లల్లో అమాయకత్వం అందరిని ఆకర్షిస్తుంది. ఉదాహరణకు మనం ఒక మురికి వాడకి (slum area) లేదా ఒక చిన్న పల్లెటూరు కి వెళ్లినా, చిన్న పిల్లల్లు వీధుల్లో చిరిగిన బట్టల్లో ఉన్నా, మట్టిలో ఆడుతూ ఉన్నప్పుడు వాళ్లను కాసేపు చూస్తూ నిధానం గా గమనిస్తే , వీళ్లు భలే సంతోషం గా, ఏ చింత లేకుండా ఆడుకుంటున్నారు అని మనసు లో చాలా మంది అనుకున్న సందర్బాలు ఉంటాయి. అదే విధంగా ఎవరైనా కొత్తగా ఆ పిల్లల వద్దకు వచ్చిన వారిని, ఆ పిల్లలు వింతగా నోరు తెరిచి చూస్తుండడం , ఒక మంచి అనుభూతి కలుగుతుంది.
• చెప్పాలంటే అటువంటి సమయంలో మనలో ఏమైనా విసుగు, కోపం ఉన్నా సహజంగా పోతాయి. ఇవన్నీ మనకి తెలియకుండానే జరుగుతాయి.
• 1 నుండి 5 లో తరగతి వరకు చదివే పిల్లల తో సమయం గడిపితే, మనలో ఉత్సాహం పెరుగుతుంది. అలసట తగ్గుతుంది. ముఖ్యం గా ఓర్పు, సంతోషం పెరుగుతాయి.
• దీనంతటికీ కారణం ఒకటే, చిన్న పిల్లల్లో కల్మషం లేకపోవడం. ఎవరి దగ్గరైతే కల్మషం ఉండదో వారి దగ్గర సహజ సిద్ధమైన సంతోషం లభిస్తుంది. ఎందుకంటే నెగెటినెస్ ఉండదు కాబట్టి.
• మనిషి సంతోషం, ఆనందం ఎక్కడెక్కడో వెతుకుతూ ఉంటాడు, కానీ గమనిస్తే మన చుట్టూ ఉండే చిన్న చిన్న విషయాలు, చిన్న చిన్న అంశాలలో చాలా లభిస్తుంది. కాకపోతే మనిషి మనసు కి కొంచెం నిధానం కావాలి అంతే. మనసు లో ఆలోచనలు గందరగోళం సృష్టించ కూడదు అంటే, మనసు ని విశాలంగా ఉంచుకోవాలి.
• మనుషులు వయసు పెరిగే కొద్దీ బాధ్యత లతో పరుగులు పెడుతూ, యవ్వనం వృద్ధాప్యం లో కి యాతనలతో, అనారోగ్యంతో అడుగు పెడుతూ , తమ బాల్యాన్ని పూర్తిగా మరచిపోతారు. ప్రతి మనిషి కూడా తమ 12 సంవత్సరాల వయసు కంటే తక్కువ ఉన్న చిన్న తనం లో స్మృతులు, మాటలు, గడపిన ప్రదేశాలు, తల్లి తండ్రుల తో ఉన్న బాంంధవ్యం, చిన్నతనంలో గడిపిన ఇల్లు, వాతావరణం, అయిదవ తరగతి వరకు చదివిన బడి , తరచూ గాని, వారంలో ఒకసారి గాని, వీలైతే రోజూ పడుకునే సమయంలో ఏకాంతంగా, ప్రశాంతంగా గుర్తు చేసుకుంటే ముఖం పై చిరునవ్వు తెలియకుండా నే వికసిస్తుంది. ఇది మరింత మంచి ఆరోగ్యం ఇస్తుంది. ప్రయత్నించి చూడండి.
• పెద్ధ అయ్యాక ఎవరు ఏం అవుతారో తెలియదు, ఎలా ఉంటారో తెలియదు కానీ, ప్రతీ మనిషి తన బాల్యం లో తానే ఒక హీరో. ఆ వయసు లో ఆర్థిక స్థితి గతులు ఎలా ఉన్నా సరే, దొరికే మానసిక సంతోషం బహుశా జీవితంలో ఎప్పుడూ దొరకదేమో. విచిత్రం ఏమిటంటే వాస్తవానికి బాల్యం లో దుర్భరమైన పరిస్థితులు ఉన్నా, అంటే అనాధ పిల్లలు అయినా, వీధి బాలలు అయినా సరే మనసు లో వారు చాలా సంతోషంగా నే ఉంటారు. ఎందుకంటే కష్టం, దుఃఖం, మరణం, బాధ వంటి భావోద్వేగాల విషయాలు వారి శరీరానికి గాని, మనసు కి గాని అంటుకోవు.
• నేటి కాలం లో, జీవితంలో ఆలోచనలతో ముందుకు చూడడం వలన కలిగే గందరగోళం, టెన్షన్ ని తొలగించు కోవాలంటే …. ప్రతిరోజూ కొంత సమయం తప్పని సరిగా వెనక్కి ముఖ్యం గా పసితనం ఛాయలు లోకి ప్రయాణం చేయాలి. ఆ జ్ఞాపకాలు మననం చేసుకుంటే కొంత సంతోషం , ఇంకా ఎక్కువ గా ఆరోగ్యం లభిస్తుంది.
• నేటి జీవన విధానం, పరిస్థితుల్లో ఇది ప్రతి ఒక్కరికీ ఇది చాలా అవసరం.
• Love yourself …. Love your Childhood.
యడ్ల శ్రీనివాసరావు 28 Apr 2024 , 11:00 pm.
No comments:
Post a Comment