ప్రణయ గీతం
* Female
• ఏదో ఏదో ఉన్నది
అది నాలో నీలో ఉన్నది.
• అది ఏమిటో
నాకు తెలియకున్నది
మరి నీ కైనా తెలుసా …
• అదే అదే అంటున్నది
నాలో నేనే కంటున్నది
అది ఏమిటో అర్దం కాకున్నది …
• కలవరమెరుగని ఇది
కదలక నిలిచి ఉంది.
• ఊసులు చెప్పని ఇది
ఊహలు విడువక ఉంది.
• అనుభవమెరగని ఇది
అనుభూతి యై ఉంది.
• కనులతో చూడని ఇది
కౌగిలిలో కలిసి ఉంది.
• ఏదో ఏదో ఉన్నది
అది నాలో నీలో ఉన్నది.
• అది ఏమిటో
నాకు తెలియకున్నది
మరి నీ కైనా తెలుసా …
• అదే అదే అంటున్నది
నాలో నేనే కంటున్నది
అది ఏమిటో అర్దం కాకున్నది …
• ఈ సాయం చెపుతున్నది
అది
ఒకటిగ
ఉండేది
రెండుగ అయిందని.
• ఈ సమయం అడుగుతున్నది
ఆ
రెండు
మరల
ఒకటిగ ఎప్పుడని.
• ఈ కాలం చూస్తున్నది
ఇదే దో కొత్త గా.
• ఈ పయనం పోతున్నది
ఏదే దో వింత గా.
• ఏదో ఏదో ఉన్నది
అది నాలో నీలో ఉన్నది
మరి నీ కైనా తెలుసా …
• అదే అదే అంటున్నది
నాలో నేనే కంటున్నది
అది ఏమిటో అర్దం కాకున్నది …
యడ్ల శ్రీనివాసరావు 30 Apr 2024 1:00 pm .
No comments:
Post a Comment