కలుపు తీసే వాడు
• కలుపు తీసే వాడు కాలుడు
కలిమి చేసే వాడు కేదారుడు.
• ముక్కంటి ఎరుగని
మనిషి మనసు ఉందా …
• బుద్ధి లో దాగున్న మాయ
భైరవుని కి తెలియ కుందా …
• మౌనం గా ఆటలే ఆడుతాడు
ధ్యానం లో పాటలే పాడుతాడు
• నిను చూసిన నాడు
నిను చూసిన నాడు
నిలదీసి
నీ లోని కర్మలు కడుగుతాడు.
నిను మేలి ముత్యం గా చేస్తాడు.
• కలుపు తీసే వాడు కాలుడు
కలిమి చేసే వాడు కేదారుడు
• తీసిన కలుపు కంఠం లో దాస్తాడు
ఆ గరళాన్ని నీలిదేహంతో మోస్తాడు.
• నిను పావనం చేసి
నిను పావనం చేసి
తాను సంబరా పడతాడు.
• కలుపు తీసే వాడు కాలుడు
కలిమి చేసే వాడు కేదారుడు.
• ఏమివ్వగలవు నువ్వు
ఓ మనిషి ...
ఆ శివుని కి ఏమివ్వగలవు .
• నీ మన సివ్వగలవా
నీ బుద్ధి లో చోటివ్వగలవా.
యడ్ల శ్రీనివాసరావు
29 May 2024 , 2:00 AM .
No comments:
Post a Comment