Wednesday, May 22, 2024

501. ఏమిటి నీ ఆలోచన

 

ఏమిటి  నీ  ఆలోచన ...



• రేపటి  మాపులలో   చీకటి  రాదని

  నిన్నటి  రాతిరి  చెప్పిందా !

• వెన్నెల  మబ్బులలో   వెండి  దాగుందని

  మిన్ను   కురిసిందా !

• ఏమిటి   నీ  ఆలోచన !!


• అక్కరకు   రాని

  అక్కున    చేరిన

  ఆత్మ బంధమే    ఆవస్యమా !

• కాదని   వీడని

  విడదీయలేని   విరహమే  వైరాగ్యమా !

• ఏమిటి నీ ఆలోచన !!


• ఊసుల  భాసలలో    ఆశా పాశం

  విరిసేనని   శ్వాస చెప్పిందా !

• ఊహల రాతలలో   వీణా నాదం

  పలికేనని  జీవన  రాగం  పాడిందా !

• ఏమిటి  నీ  ఆలోచన !!


• సఖ్యత లేని

  నవ్యత తోని

  స్నేహ బంధమే   అవసరమా !

• ఏ ఎండకు    ఆ గొడుగనే 

  నినాదమే    జీవన   తంత్రమా !

• ఏమిటి   నీ   ఆలోచన !!



యడ్ల శ్రీనివాసరావు.

 22 May 2024 , 10:00 am


No comments:

Post a Comment

617. ఏకరసము

  ఏకరసము  • సాగే   నీ సమయం    సంబరం  అది    చేర్చును    నిన్ను అంబరం . • అవని లో    అందలం   ఎక్కినా   మోసే   నలుగురికి    భారం . • ఆ   భార...