Wednesday, May 29, 2024

506. సందేశం

 

సందేశం



• కాలానికి     కాలునికి

  కట్టుబడిన దీ    జన్మ …

  కారణములు    చూపక

  శరణు కోరునదే   సత్కర్మ.


శరీరమున్నపుడే

  సాధన ములు   యోగ ములు …

  ఒక్క ఘడియ   విడువకు

  ఓర్పుతో   మరి   నేర్పుతో.


• లౌకికమే     వ్యాపకం 

  సంసారమే  సాగరం …

  భక్తికి క        చోటెక్కడ

  జ్ఞానాని కి     దారెక్కడ 

  ముక్తిమాట   ఊసెక్కడ.


• ఉన్న కొన్ని     రోజులు

  ఊసుల    సావాసాలు ...

  వెళ్లి పోవు   ముందు  మాత్రం 

  దేవుని కొరకు    వేవేల  వెతలు.


• నిన్ను  నమ్మి    నీకిచ్చిన

  కాలాన్ని    వాడుకో …

  విలాసాలు   కులాసాలు

  కుదించు   కత్తిరించు.


• శివుడెన్నడు   నిను కోరడు

  శరణు వేడ    స్మరణ చేయ …

  బుద్దినెరిగి    కొలిచినచో 

  కాపు కాచు   నా  భవుడు.


 🙏ఓం నమః శివాయః.

 

యడ్ల శ్రీనివాసరావు 

29 May 2024 , 11:00 PM.




No comments:

Post a Comment

656. పరమాత్ముని మిణుగురులు

  పరమాత్ముని  మిణుగురులు • దేవుడే     అయ్యాడు    వెలుగై న   దీపమై . • ఆ  వెలుగు కి   చేరాయి   మిణుగురు లు . • దేవుడే    అయ్యాడు    వెలుగై న...