బుద్ధ పౌర్ణమి
• గొంగళి సీతా చిలుకయిన రోజు
కంబళి తొలగి సృష్టి లో వెలుగునిండిన రోజు.
• అజ్ఞానం మరుగయిన రోజు
జ్ఞానం ఉదయించిన రోజు.
• అదే అదే సిద్దార్దుడి పుట్టినరోజు.
అదే ఇది నేటి బుద్ధ పౌర్ణమి రోజు.
• నాడు పౌర్ణమి చంద్రుడు విరిసాడు.
బుద్ధుని లో పూర్ణ బుద్ధిని నింపాడు.
• రాజభోగాలు విడిచాడు.
ఒంటరి బాటసారి అయ్యాడు.
మరణమనే ప్రశ్న తో మహర్షి గా మారాడు.
• అదే అదే సిద్దార్దుడి పుట్టినరోజు
అదే ఇది నేటి బుద్ధ పౌర్ణమి రోజు.
• అనుభవాలనెన్నో ఆకళించు కున్నాడు.
తన మన పర భేదము నెంచ కున్నాడు.
• చీకటి పయనం చేసాడు.
సత్యాన్వేషి గా మారాడు.
మౌనమనే దీక్ష తో విశ్వ శక్తి ని పొందాడు.
• అదే అదే సిద్దార్దుడి పుట్టినరోజు
అదే ఇది నేటి బుద్ధ పౌర్ణమి రోజు.
• కందమూలాలు తిన్నాడు.
అహింసను రూపుమాపాడు.
• ధ్యానమనే యోగంతో
ఆత్మ జ్ఞానం బోధించాడు.
• శాంతి అనే ధర్మం తో
బౌద్ద మతం స్థాపించాడు.
• లోక కల్యాణమై దైవగురువైనాడు
గౌతమ బుద్ధుడు …
సిద్ధి నొందినాడు సిద్ధార్థుడు.
23 May 2024. 4:00 pm.
యడ్ల శ్రీనివాసరావు.
No comments:
Post a Comment