Tuesday, July 25, 2023

387. వర్షం - హర్షం


వర్షం - హర్షం


• పిలిచే   నను    పిలిచే    ఈ చినుకుల తో

  జతగా   తోడై   నడిచే    నా అడుగుల కు

  వర్షం  ఈ   స్వప్నం.


• తనువును    తాకిన    చినుకులు

  సిగ్గు తో    నను    చూస్తుంటే ...

  ఆమని    పాడే    రాగం

  ఆమెను    తలపిస్తుంది.


• జలధారగ    జారిన    జల్లులు

  చక్కిలి    గిలి      చేస్తుంటే ...

  మండూగ   చేసే   నాట్యం

  మెండుగా   అలరిస్తుంది.


• పిలిచే   నను    పిలిచే    ఈ చినుకుల తో

  జతగా   తోడై    నడిచే    నా అడుగుల కు

  హర్షం    ఈ కాలం.


• ఆడుతూ   వేసే    అడుగులకు

  పాడుతూ  తడిపే   నీటి తో ...

  చెలిమి గ   సాగే    సంగమం

  చంద మై    మురిపిస్తుంది.


• అధరం    చేసే     అల్లరిని

  వదనం   మోసిన    మదనం తో ...

  మెరుపులు   చూసే    తరుణం

  మనసే    పరవశిస్తుంది.


• పిలిచే    నను   పిలిచే    ఈ చినుకుల తో

  జతగా   తోడై   నడిచే     నా అడుగుల కు

  వర్షం    ఈ   స్వప్నం

  హర్షం   ఈ   కాలం.


మండూగ = కప్ప

మదనం = సంతోషం.


యడ్ల శ్రీనివాసరావు 25 July 2023 , 8:00 PM.


Saturday, July 22, 2023

386. అనగనగా ఓ ఉద్వేగం

 

అనగనగా ఓ ఉద్వేగం



• అనగనగా    ఎదసడిగా

  వడివడిగా   నను   తాకుతోంది   ఏదో.

• తడిపొడిగా    తడబడగా

  సవ్వడిగా     నను  మీటుతుంది  ఏదో.


• తెలియని     ఈ వింత తో    ఏదో   పులకింత.

  మది పలికిన   భాష తో        ఏదో   కలవరింత.


• అనగనగా     ఎదసడిగా

  వడివడిగా    నను    తాకుతోంది   ఏదో.

• తడిపొడిగా    తడబడగా

  సవ్వడిగా     నను    మీటుతుంది  ఏదో.


• బదులే   తెలియని    ఈ తపనల తో

  వేసే   అడుగు లోని    వేగం

  వెచ్చగా   కవ్విస్తుంది.

• మనసే    ఎరుగని     ఈ ఆశల కు 

  వీచే     గాలి లోని     శీతలం

  సుతి మెత్తగా     నవ్విస్తుంది.


• ఎందుకో  …  అసలు  ఎందుకో

  ఈ కలలకు   గజ్జెలు   ఎందుకో

  ఈ ఊహల  కద్దులు  లేవెందుకో.


• చిగురే    తెలియని    ప్రేమ కు

  పువ్వు లోని   అందం

  అంధత్వం  తో   అలరిస్తుంది.

• అలుపే   ఎరుగని   ఈ ఉద్వేగాల కు

  కవిత లోని    భావం

  శూన్యం తో     జత చేస్తుంది.


• ఎందుకో   …  అసలు  ఎందుకో

  ఈ  అలల   ఆటుపోటులు  ఎందుకో

  ఈ  వలల   బంధనాలు    ఎందుకో.


• అనగనగా    ఎదసడిగా

  వడివడిగా   నను   తాకుతోంది  ఏదో.

• తడిపొడిగా    తడబడగా

  సవ్వడిగా    నను   మీటుతుంది ఏదో.


యడ్ల శ్రీనివాసరావు 23 July 2023 10:30 AM


Friday, July 21, 2023

385. బాబా తేజో రూపం

 

బాబా తేజో రూపం


• పదిలం    పదిలం

  శివ బాబ     నీ తేజం    పదిలం.

• మధురం   మధురం

  బ్రహ్మ బాబ   నీ రూపం   మధురం.


• తేజమైన   రూపంతో   మా   మనసులు

  మధురం  చేసిన   మీ వయనం   పదిలం.


• పదిలం    పదిలం

  శివ బాబా     నీ తేజం     పదిలం.

• మధురం   మధురం

  బ్రహ్మ బాబ   నీ రూపం   మధురం.


• నీ   స్మృతి తో ని     సంతోషం

  సకల  దుఃఖాల       వియోగం.

• నీ    జత లో ని      సాంగత్యం

  జన్మ    జన్మల కు     యోగం.


• ప్రేమ తో    పాలించే   ముక్తి   దాతవు

  జ్ఞానం తో    సేవించే   యుక్తి   ప్రధాతవు.


• అలసి   సొలసి    మై మరచిన

  పిల్లలను   అక్కున   చేర్చుకున్న

  ఆనంద  దాసుడవు.


• పదిలం      పదిలం

  శివ బాబ       నీ తేజం   పదిలం.

• మధురం    మధురం

  బ్రహ్మ బాబ    నీ రూపం   మధురం.


• తేజమైన   రూపంతో     మా మనసులు

  మధురం   చేసిన   మీ వయనం   పదిలం.


• పరమాత్మ ను    మించిన    దైవం   లేదని

  మురళి ని   మీరిన    జ్ఞానం    ఏ దని

  రాజ యోగం తో     చెప్పావు.

  అజ్ఞానులను   ఆజ్ఞాధిపతులు గా   చేసావు.


• సేవను   మించిన    మంచి లేదని

  మౌనం   మీరిన      శక్తి    ఏ దని

  ధ్యాన యోగం తో    చెప్పావు

  విశ్వానికి   అధికారులు గా   చేసావు.


• పదిలం    పదిలం

  శివ బాబ       నీ తేజం   పదిలం.

• మధురం    మధురం

  బ్రహ్మ బాబ   నీ రూపం  మధురం.


ఓం శాంతి 🙏

ఓం నమఃశివాయ 🙏

యడ్ల శ్రీనివాసరావు 21 July 2023 , 2:00 pm.


Saturday, July 15, 2023

384. కనీవినీ ఎరుగని కావ్యం


కనివిని ఎరుగని కావ్యం


• కదలవు లే      వదలవు లే

  కనీవినీ  ఎరుగని    ఈ  కావ్యము లే

  కదలవు లే      వదలవు లే

  కనీవినీ  ఎరుగని     ఈ  కావ్యము లే.


• చిరుజల్లు     తోటి    సింగారి లా

  శ్రీకారమైన    ఈ    స్రవంతి

  సెలయేరు     లోని    తామర లా

  జాలువారు తోంది     జావళి గా.


• కదలవు లే     వదలవు లే

  కనీవినీ   ఎరుగని    నా  కావ్యము లే

  కదలవు లే      వదలవు లే

  కనీవినీ    ఎరుగని    నా   కావ్యము లే.


• ఉమ్మెత్త    లోని     అందాలు

  కొత్తం గ    దిద్దే      ఓనాడు.

• చామంతి   లోని   చందాలు

  చక్కం గ   అద్దే    ఈనాడు.


• సొగసు    పంచే టి    ప్రకృతి కే

  ప్రేమ        పంచే ను   ఈ  కావ్యం

• మనసు     పిండే టి      వేదన కే

  మందు    అయ్యే ను    ఈ భాష్యం.


• కదలవు లే    వదలవు లే

  కనీవినీ   ఎరుగని    ఈ  కావ్యము లే

  కదలవు లే    వదలవు లే

  కనీవినీ   ఎరుగని     ఈ కావ్యము లే.


•  కానరాని    అందాలను  ఎన్నో

   అక్షరాల లో     చూపాయి. 

• దాగలేని    భావాలను   ఎన్నో

   మధురం గా    చేసాయి.

  

• దేహం    రాసేటి     ఈ రాతలు

  దైవం     ఎరిగిన     తలంపులు.

• భావోద్వేగాల    *సం భోగం 

  ఈ    సాహితి    సప్తపది.


• కదలవు లే     వదలవు లే

  కనీవినీ   ఎరుగని    ఈ  కావ్యము లే

  కదలవు లే      వదలవు లే

  కనీవినీ   ఎరుగని     ఈ  కావ్యము లే.



సం భోగం =   ఉత్తమ మైన  మేళవింపు 


యడ్ల శ్రీనివాసరావు 15 July 2023 , 10:00 PM


( On the occasion of  Inter National Talent and Skills Day 15 July )













Thursday, July 13, 2023

383. ఊహల ఆశలు

 

ఊహల ఆశలు


• ఊహలు   ఊహలు

  ఊపిరి    నిచ్ఛేటి     పట్టుగొమ్మలు.

  ఆశలు     ఆశలు

  జీవం      నింపేటి      హరివిల్లులు.


• ఊహలకు   మనసు   సొగసు   అవుతుంటే

  విరిసే   ఆశలు   చేసేను    నటరాజ  నాట్యం.


• ఆశలకు    బ్రతుకు    ఆలంబన    మవుతుంటే

  మెరిసే ఊహలు   ఊరేగే  అంబరాన  తారలుగా.


• బ్రతుకే     ఒక     ఊహయితే

  బ్రతికించే   ఆశ    అమృతం.


• ఊహలు     నిజమయితే

  మధురం    తాకే ను   ఆకాశం.


• ఊహలు     ఊహలు

  ఊపిరి    నిచ్ఛేటి    పట్టుగొమ్మలు.

  ఆశలు     ఆశలు

  జీవం   నింపేటి    హరివిల్లులు.


• ఊహలకు   మనసు   భారమవుతుంటే

  మెదిలే    ఆశలకు     ఆధారం ఏమిటి.


• ఆశలకు   బ్రతుకు    పోరాటమవుతుంటే

  విడిచిన   ఊహలకు    అర్దం ఏమిటో.


• నిజము    కాని    ఊహలు

  అంధుడికి    బలమైన   ఊతం.


• అడియాశలైన    ఆశలు

  జీవుడి కి    అందమైన   శూన్యం.


• ఊహలు     ఊహలు

  ఊపిరి   నిచ్ఛేటి    పట్టుగొమ్మలు.

  ఆశలు     ఆశలు

  జీవం   నింపేటి    హరివిల్లులు.



యడ్ల శ్రీనివాసరావు 14 July 2023, 9:30 AM.











Monday, July 10, 2023

382. శ్రీ రంగ సఖుడు


శ్రీ రంగ సఖుడు



• శ్రీరంగ    రంగ       సఖుడా ...

  స్వామి   సారంగ   నిగుడా …


• ఊయలలో    శయనించి

  ఊహలలో     పయనించి

• జగము న      జావళి తో

  చిరు   దివ్వె    నెలిగించే


• శ్రీరంగ   రంగ       సఖుడా ...

  స్వామి    సారంగ  నిగుడా …


• క్రీ గంట   చూపుతో

  చిరు  మంద  హసా

• సింధుజ   మోము లో

  సింగారము   దిద్ది

• అంబుజ   ఒడి లో

  కాంతులీనే కారి   …  ఓ  కళ్యాణకారి.


• శ్రీరంగ   రంగ      సఖుడా ...

  స్వామి  సారంగ   నిగుడా …


• మాయ ను    సృష్టించి

  మహిమలు   చూపించి

• అల్లిబిల్లి      ఆటలతో

  సత్యము ను    వెతికించే

  శ్రీ    శ్రీ నివాసుడా.


• శ్రీరంగ   రంగ       సఖుడా ...

  స్వామి  సారంగ    నిగుడా …


• అలకల    పలుకుల    శ్రీ దేవి పై

  ప్రేమనే     అస్త్రంగా     సంధించి

  సేవ తో    బంధించిన

  మానస   చోరుడా      లక్ష్మీ  నాధుడా.


• జగము ను   పాలించే

  సంసార       సాగరుడా.


• శ్రీరంగ      రంగ     సఖుడా ...

  స్వామి   సారంగ   నిగుడా …


సఖుడు  =   నందివర్ధనుడు, చెలికాడు

సారంగ  =    రాజహంస

నిగుడు   =   కవి, వర్ధిల్లు వాడు.

జావళి = జోల పాట

క్రీ గంట = ఓరకంట చిలిపిగా చూచుట

సింధుజ = లక్ష్మి దేవి

అంబుజ = కమలపువ్వు


యడ్ల శ్రీనివాసరావు 10 June 2023, 11:30 pm.


Sunday, July 2, 2023

381. గురు చందమామ

 


🌙 గురు చందమామ🌕


• మామ    చందమామ 

  మనసే    రాగమా  యే

• భామా    చందభామ 

  సొగసే     వెన్నెలా  యే


• మసక   నిండిన   మబ్బుల కు

  మంచి   మాటే    కరువా యే.


• వయసు   మీరేటి   హృదయాలకు

  రాగ ద్వేషాలు   ఆభరణాలు  ఆ యే.


• మధురమైన   మనుషులకు

  నిండు   పౌర్ణమి     మనోహరం.


• ఆడి   పాడే    మనసులకు

  వెన్నెల   శాంతి   శుభోదయం.


• మామ   చందమామ 

  మనసే   రాగమా  యే

• భామా   చందభామ 

   సొగసే   వెన్నెలా యే.


• చంద్రుడు   గురువైన  రోజు   గురుపౌర్ణమి

  అది   విశ్వానికి   గజకేసరి   యోగం.


• జాబిల్లి   హరివిల్లైన   నేడు   వ్యాసపౌర్ణమి

  ఈ జ్ఞానం   సకల జనులకు    రాజ యోగం.


• మామ   చందమామ 

  మనసే   రాగమా  యే.

• భామా   చందభామ 

  సొగసే   వెన్నెలా  యే.


• సోముని    కంఠం 

  శృతిని    పలుకుతుంటే

• మైకం  కమ్మిన   మాయా   జీవుడి 🌚 

   అపశృతులు    యే  ల.


• మాయ   ఆవాహనం తో 

   ఉత్తముని🌝    స్థితి    కోల్పోవ   నే   ల.


• మనసు   వలయాలు 

   లయ  బద్ద మై   ఉంటే

• హద్దులు    మీరని   మాటలు 

   మైత్రిని   కోర వా. 🤝


• మామ    చందమామ 

  మనసే    రాగమా యే.

• భామా    చందభామ 

  సొగసే    వెన్నెలా యే.


గజకేసరి యోగం = జ్యోతిష్య శాస్త్రం లో బ్రహృస్పతి, చంద్రుడు ఒకే రాశిలో లేదా  జాతకచక్రంలో ఒకే గృహం లో  కలిసి ఉన్నా  లేదా  బృహస్పతి యెక్క శుభదృష్టి  చంద్రుని పై ఉన్న సందర్భం లో   జ్ఞానం, వాక్ శుద్ధి,   సిరి సంపదలు   శివుని ఫలాలు గా లభిస్తాయి .

రాజయోగం = గురు పౌర్ణమి సోమవారం గాని గురువారం గాని సంభవించినప్పుడు దక్షిణామూర్తికి మనసు అర్పించి   ప్రార్థన  చేసి న   వారికి రాజయోగం లభిస్తుంది. అంటే రాజు అవుతారని కాదు, ఏ లోటూ లేకుండా జీవితం ఉంటుంది అని.


 ఓం నమఃశివాయ 🙏.


యడ్ల శ్రీనివాసరావు 3 July 2023, 3:00 AM.















490. జన గళం

జన గళం • జనమెత్తిన   గళము లో   ఈ పవనం    లేచే  లే. • కదమేగిన    పోటు లో   ఈ కదనం    సాగే  లే. • గుప్పెడు   పిడికిలి   గుండేలే   ఈ   ధై...