Monday, August 14, 2023

389. బ్రో ఆధ్యాత్మిక శ్లోకాలు

 


బ్రో ఆధ్యాత్మిక  శ్లోకాలు



• ఇటీవల , బ్రో అనే సినిమాలో రెండు ఆధ్యాత్మిక శ్లోకాలు, background music లో play అవుతూ ఉంటాయి. చాల బాగుంటాయి.  అవి సినిమాలో అంత స్పష్టంగా వినపడవు.

• ఒక  మిత్రుడు  , ఈ పాటలలో ఉన్న మూలార్దం  ఏమిటి అని అడిగితే,  ఆ శ్లోకాల లోని అర్థం తెలుగులో అనువాదం చేయడం జరిగింది.

 శ్లోకం : 1

🍀🍀🍀🍀🍀🍀🍀

బ్రహ్మ  పూర్ణ  బృహస్పతిః

స బ్రహ్మి  పూర్వ  సమాకృతిః

ప్రపర్వ గర్వ  నిర్వాణావృతి

విశ్వ శ్రేయ సమర్వతిః

సువిజ్ఞ శ్రీయ శిఖాద్యుతిః

విదేహ గేహ వాహ జాగృతి

🍀🍀🍀🍀🍀🍀🍀


ఆది గురువు శివ పరమాత్ముడు. పరమాత్మ తన జ్ఞానాన్ని బ్రహ్మ ద్వారా వినిపిస్తాడు. బ్రహ్మ జ్ఞానం బృహస్పతి  (గురు) గ్రహం అనుకూలత వలన మానవుని కి తెలుస్తుంది.  గ్రహాలలో బృహస్పతి గ్రహానికి గురు తత్వం కలదు.  దేవతలందరికీ గురువు బృహస్పతి.

ఈ మొత్తం శ్లోకం పూర్తిగా బృహస్పతి (Jupiter) అంటే ఒక గురువు యొక్క విశిష్టత గురించి సంస్కృతంలో వర్ణిస్తూ రాయబడింది…..


వివరణ : 

బ్రహ్మ పూర్ణ బృహస్పతి :

  బ్రహ్మ యొక్క పూర్ణమైన జ్ఞానం  కలిగిన వాడు బృహస్పతి  దేవతల గురువు.

స బ్రహ్మి పూర్వ సమాకృతి :

  సరస్వతి దేవి కి  తొలి సమానమైన కృతార్దుడు గురువు.

ప్రపర్వ  గర్వ  నిర్వాణావృతి :

  ఆది  దేవతలను ప్రసన్నం చేసుకొని , అభిమానం తో కోరికలు లేని శూన్య మోక్ష స్థితి ని వరింప చేయువాడు గురువు .

విశ్వ శ్రేయ సమర్వతిః :

  సమస్త సృష్టి కి ధర్మ పుణ్య శుభ ఫలాలు ఇచ్చు దీపపు వత్తి గురువు.

సువిజ్ఞ శ్రీయ శిఖాద్యుని :

  మంచి విద్వాంసుడు, సంపన్నమైన జ్ఞాన శిఖరం గురువు.

విదేహ దేహహా వ జాగృతి :

  దేహం లేని వాడు కానీ,  దేహమును మేలు కొలుపు వాడు. దేహం లో కుండలినీ శక్తి జాగృతం చేయు వాడు గురువు (బృహస్పతి).


🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀


శ్లోకం: 2


 🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀

  సప్తకాల లిప్తలీల యుక్తయోగ ఆగమం

  వాయులీనమో వరాళీరాగ రంజనం.


  సుప్తకీల తప్తడోల లుప్తపాశ బంధురం

  తోషణార్దమౌ విశేషకర్మ గర్జనం


  జీర్ణ కా లా నాం

  మృగ్య మా వా హం పురోగమార్గ నిర్గమం


  పూర్ణ వా హ నాం

  నిర్ణయా రూపం ప్రపూజ్య సాద్య సద్గమం


  ప్రణవ ఓం ఓం ఓం కారం

  ప్రమద ధీమ్ ధీమ్ ధీమ్ నాదం


  ప్రణవ ఓం ఓం ఓం కారం

  ప్రకర నిర్మొహ నిర్మాణ నిర్వహణం

  అద్వైతం   అక్షలక్షణం 

  ఆశ్వాసం   బుద్బుదస్సమం

  అపర వాజీనం నిత్య నిశ్చలం

  అఖిల రాజీవం జీవ సంచితం

🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀

 

ఈ శ్లోకం ఆత్మ, పరమాత్మ ల అనుసంధాన మార్గం గురించి చెప్పబడింది. మానవుని దేహం లో ఉన్న ఆత్మ మూలాధారం చక్రం నుంచి సహస్రారం వరకు చేసే ప్రయాణమే ధ్యాన యోగ సాధన. ఇందులో సమస్త సృష్టి దాగి ఉంటుంది మరియు పరమాత్మ తో అనుసంధానం ఎలా జరుగుతుందో చెప్పబడింది.


వివరణ :

  సప్తకాల లిప్తలీల యుక్తయోగ ఆగమం

  వాయులీనమో వరాళీరాగ రంజనం.

• రెప్ప పాటు క్షణం లో జరిగే సప్తకాల ఆట యే ధ్యాన యోగం. అదే ఆగమ వేద శాస్త్ర జ్ఞానం.

• ఇది వయోలిన్ పలికే వరాలీ  కర్ణాటక  సంగీత రాగమంత ఆహ్లాదం గా ఉంటుంది .

సప్తకాలు : మూలాధార, స్వాధిష్ఠాన, మణిపుర, ఆనాహత, విశుద్ధి, ఆజ్ఞా, సహస్రార కుండలీ చక్రాలను సప్తకాలు అంటారు.


  సుప్తకీల  తప్తడోల  లుప్తపాశ  బంధురం

  తోషణార్దమౌ  విశేషకర్మ  గర్జనం

• నిద్రకు బంధీ అయి ,  ఆకలితో తపిస్తూ,   ధనం కోల్పోయిన  వాడు  త్రాడు వలే  వంగి ఉంటాడు.

• పరిపూర్ణత సాధించుట కొరకు ఉత్తమ కర్మలు ఘోషిస్తుంటాయి.

  

   జీర్ణ   కా లా నాం

  మృగ్య  మా వా హం  పురోగమార్గ  నిర్గమం

• వృద్ధాప్య కాలంలో

• వెతకదగినది పరబ్రహ్మ స్వస్థానానికి బయలుదేరే ప్రధాన మార్గం.


   పూర్ణ వా హ నాం

   నిర్ణయా రూపం ప్రపూజ్య సాద్య సద్గమం

• పరి పూర్ణత సాధించిన వాడు ...

• నిశ్చయ రూప జీవుడు . అది యే దేవత లా పూజింపబడేందుకు సుగమనమైన మార్గం.


  ప్రణవ   ఓం ఓం  ఓం కారం

  ప్రమద  ధీమ్ ధీమ్ ధీమ్  నాదం

• ఆత్మ పరమాత్మను కలిపేది ఓంకార ధ్వని

• మూలాధారం నుంచి సహస్రారం చేరే అమితానంద ధ్వని.


  ప్రణవ ఓం ఓం ఓం కారం

  ప్రకర నిర్మొహ నిర్మాణ నిర్వహణం

• ఆత్మ పరమాత్మను కలిపేది ఓంకార ధ్వని

• పోగు చేసిన కచ్చితమైన యోగ్యత యే నిష్ట.


  అద్వైతం అక్షలక్షణం

  ఆశ్వాసం బుద్బుదస్సమం

• పరబ్రహ్మము వ్యాపించినది అనడానికి గుర్తు ...

• ఊపిరి విడవడం.  అనగా గర్భం లో ఉద్భవించిన బుడగను సమాప్తి చేయడం

 

  అపర వాజీనం నిత్య నిశ్చలం

  అఖిల రాజీవం జీవ సంచితం

• మనుష్యాది గర్భస్థపిండమునకు రక్షకముగా మీఁద క్రమ్ముకొనియుండు తోలుసంచి ప్రాణరంధ్రం శాశ్వతంగా స్థితమైనది

• సమస్తం నారాయణ మంత్రం. అదియే జీవునికి ఆర్జించి   పెట్టేది.

🍀🍀🍀🍀🍀🍀🍀🍀


ఓం నమఃశివాయ 🙏

అనువాదం : 

యడ్ల శ్రీనివాసరావు 13 August 2023, 11:00 pm.


No comments:

Post a Comment

490. జన గళం

జన గళం • జనమెత్తిన   గళము లో   ఈ పవనం    లేచే  లే. • కదమేగిన    పోటు లో   ఈ కదనం    సాగే  లే. • గుప్పెడు   పిడికిలి   గుండేలే   ఈ   ధై...