Monday, January 27, 2025

592. నాగ సాధువులు

 

నాగ సాధువులు



• మనసు కి శక్తి ఉంటుందా?. అవును మనసు కి శక్తి ఉంటుంది.   అసలు శక్తి  నిల్వ ఉండేదే మనసు లో. కానీ  నేటి కాలం  మనిషి  పూర్తిగా  పూర్తిగా  ఈ విషయం మరచిపోయాడు.   ఆ శక్తి తో ఎటువంటి అద్భుతమైనా  సృష్టించవచ్చు.  మనసు తో సంకల్పాలు   చేయవచ్చు.  సేవ చేయవచ్చు.   ఇందు కోసం ఎక్కడికి పోనవసరం లేదు.  కానీ, ఇవి ఆచరణ కావాలి అంటే   ఉండవలసింది   శుద్ధత.  అంటే ఆలోచనల  కాలుష్యం  లేకుండడం.

• భారతదేశం  నేటికి  అంతో ఇంతో కొంత  సుభిక్షంగా ఉంది అంటే,   విశ్వ కళ్యాణం కోసం , శాంతి కోసం ధ్యానయోగం  చేసే  అనేక మంది  ఆధ్యాత్మికత కలిగిన  వారే కారణం.  వీరి మనసు తో   చేసే శుభ సంకల్పాలు   నిత్యం  ప్రతిధ్వనిస్తూ (vibrations) భారతదేశానికి  రక్షణ కవచం వలే ఉన్నాయి. అందుకే భరత భూమిని   వేద భూమి,  కర్మ భూమి అని అంటారు .   ప్రపంచ క్రిస్టియన్  మతగురువు అయిన పోప్  ఒకసారి భారతదేశం లో  విమానం దిగి అడుగు పెట్టిన వెంటనే,   కిందికి వంగి నేలను  ముద్దాడారు, అంటే అర్థం చేసుకోవచ్చు ఈ నేల మహత్యం.


• ఈ విశ్వ సృష్టి  యొక్క  ఆది మధ్య అంతం యెక్క మూలాలు  భారతదేశంలో నే ఉన్నాయి. ఎందుకంటే భగవద్గీత లో  శ్రీకృష్ణుడు చెప్పిన, భగవంతుని (శివ పరమాత్మ ) యొక్క వాక్యం ఏమిటంటే,

  “యదా యదా హి

  ధర్మస్య   గ్లానిర్భవతి  భారత ”

 

 ధర్మం  నశించిన   ప్రతి కల్పం  నందు 

 భరత భూమి పై   ఆవిర్భావిస్తాను.


• మనసు తో  చేసే  సంకల్పాలతో  ,  సాధ్యం కానిది అంటూ ఏమీ లేదు.  అది మంచి అయినా, చెడు అయినా.  దానిని బట్టే  కర్మ ఫలితం కూడా లభిస్తుంది.


• ప్రస్తుతం  భారతదేశంలో   మహా కుంభమేళ జరుగుతుంది.  ఇది 144 సంవత్సరాల కు  ఒకసారి జరుగుతుంది.  యావత్ ప్రపంచం  దృష్టి  భారతదేశం పైన ఉంది.  ఇక్కడ ముఖ్యంగా  చెప్పుకోవాల్సింది    శివ సాధన  చేసే   లక్షల మంది   నాగ  సాధువులు, అఘోరాలు.  వీరు సాధారణ  సమయం లో  ఎక్కడా కనిపించరు.   హిమాలయాల్లో,   అడవుల్లో,  గుహల్లో నిత్యం  విశ్వ కళ్యాణం కోసం,   ప్రపంచ  శాంతి కోసం ధ్యానయోగం   చేస్తారు.   వీరు   సనాతన ధర్మం పరి రక్షకులు.   పేరుకు,  సాధువులు, యోగులు అయినా,  అధర్మం  పెచ్చరుల్లితుంది  అంటే  యుద్ధం చేసి తీరుతారు.  అందుకు  ప్రతిగా వారి చేతిలో ఆయుధాలు  ఉంటాయి.


• ఇక్కడ   ఈ నాగ సాధువుల  యొక్క , యోగ శక్తి  గురించి చెప్పుకుంటే…..

  ఒక నాగ సాధువు ,  భూమి పై  పెంచే భార్లీ  పంట, తన   తలపై   నాలుగు సంవత్సరాలు గా పెంచుతూ, ప్రపంచ శాస్తవ్రేత్తలకు   భారతీయ  యోగ శక్తి మహత్యం  చూపించాడు.

• మరొక  నాగ సాధువు,  మండుతున్న చితి పై పడుకొని   ధ్యానం చేస్తూ,  ఉన్నాడు.  దీనికి ఆ సాధువు సమాధానం ఏమిటంటే,  చితి నుంచి వచ్చే మంటల ఉష్ణం కంటే పలు రెట్లు అధిక ఉష్ణోగ్రత యోగశక్తి   ద్వారా తన శరీరం లో  ఉంటుంది. అందువలన  ఆ చితి మంటలు,  నా పై  ప్రభావం చూపవు అన్నాడు.


• మరో  యువ సాధువు అభయ్ సింగ్,  బొంబాయి IITలో , Aerospace Engineering, University Topper,  జీనియస్.  ఆధ్యాత్మిక సాధన, శివుని తెలుసుకోవడమే అసలైన జ్ఞానం అని తాను సర్వం త్యజించి సాధువు గా మారానని అన్నాడు. ఇతని వయసు 40 సంవత్సరాల లోపు ఉంటుంది.


• మైనస్ డిగ్రీల  మంచులో, హిమాలయాల్లో ఒంటి మీద పలుచటి  వస్త్రం తో కూర్చుని  ధ్యాన యోగ సాధన నేటికీ చేయడం మరో   సాధువు యోగి సత్యేంద్ర నాధ్   యెక్క  తపో శక్తి కి   నిదర్శనం.


• ఇదొక అద్భుతమైన సంఘటన …. మహా కుంభమేళ ఇంకా రెండు రోజుల్లో ప్రారంభం అవుతుంది అనగా, అక్కడికి ముందుగానే వచ్ఛిన  ఒక నాగ సాధువు, తెల్లవారుజామున 4 గంటలకు నదిలో చలిలో స్నానం చేయడానికి దిగబోతుండగా, అక్కడ నీటిని యంత్రం తో శుద్ధి చేసే పారిశుద్ధ్య కార్మికుడు, ఒక పోలిస్ కలిసి అతనిని అడ్డగించి నదిలో దిగ నివ్వలేదు. ఆ సాధువు అక్కడే గట్టు మీద కూర్చుని యోగం చేయడం ప్రారంభించాడు. కొద్ది సమయం తరువాత నీటిని శుద్ధి చేసే యంత్రం పని చేయడం ఆగిపోయింది. అది గ్రహించిన,   పోలీస్  సాధువు  వద్దకు  వెళ్ళి క్షమించమని,   నదిలో  స్నానానికి  పంపించాడు. తరువాత  వెంటనే  ఆ యంత్రం పని చేయడం ఆరంభం అయింది. ఇది యోగ సంకల్ప బలం, శక్తి, మహిమ.

• ఇవన్నియు   టి.వి.   మీడియా లో   లైవ్ లో  వచ్చిన యధార్థ   సంఘటనలు.

• మనిషి తన మనసు ఆలోచనలు సంకల్పాలు సాధనతో యోగ శక్తి ని పొందగలడు.   ఇందులో అసాధ్యం ఏమీ లేదు.   చెప్పాలంటే  నేడు ఇది ఒక వింత గా అనిపించవచ్చు.  కానీ అనాదిగా భారతీయ సనాతన ధర్మం లో   ధ్యానం , యోగం  అనేవి సగటు మానవుని   జీవన  ప్రమాణాలు….. నేటి కాలంలో ఇవన్నీ విస్మరించి , మరచి పోయి మాయకు పూర్తిగా వశం అయి మనిషి తన నాశనానికి తానే పునాదులు చాలా బలంగా వేసుకున్నాడు … ఇంకా వేసుకుంటూనే ఉన్నాడు.


ఈ యోగులు,  సాధువులు  అంటే  పిచ్చివాళ్లని , జీవితంలో   ఫెయిల్యూర్స్ అని ,   లౌకికంలో బ్రతకడం  చేతకాని వారని,   పని పాటు లేకుండా కాలక్షేపం  చేస్తారు   అని,  మాయకు వశమైన  అజ్ఞానులు  , మూర్ఖులు ,  హేతువాదులు అంటూ ఉంటారు.   గమనిస్తే,  ఈ నాగ సాధువులు లో  డాక్టర్లు , ఇంజనీర్లు, లాయర్లు, చార్టెడ్  ఎకౌంటెంట్స్,  రచయితలు,  శాస్తవ్రేత్తలు వంటి వారు అనేక  మంది  మేధావులు ఉన్నారు.  వీరిలో  ఎంతో   మంది  ధనవంతులు,  ఉన్నత మైన ఉద్యోగాలు చేసిన వారు ఉండడం విశేషం.

అధిక  శాతం విద్యా వంతులు ఉన్నారు.  ఈ విషయం ప్రత్యక్షం గా  టి.వి  లో వారి  ఇంటర్వ్యూలు  చూస్తే   తెలిసింది.


• ఒక యోగి,  ఒక సాధువు  అంటే భౌతిక (లౌకిక) జీవితంలో   విఫలం అయిన వాడు కాదు.  లౌకిక జీవితంలో పూర్తి   సఫలత లభించి ,  అందులో ఉన్న   సారం   అంతా   నిస్సారం ,  తమకు  ఏ ప్రయోజనం లేనిది   అనే  సత్యం   అనుభవ పూర్వకంగా  గ్రహించిన  జ్ఞాని .  ఆ తరువాతే  సహజ వైరాగ్యం,   ఆధ్యాత్మిక జ్ఞాన చింతన,  యోగ సాధన ,   పరమాత్మ వైపు పయనం మొదలు పెడతాడు. దీనికి ఎన్నో జన్మల  భాగ్యం,  పుణ్యం ఉండాలి.


నేడు మానవుడు చేస్తున్న పాపాలు,  ఈర్ష్య, స్వార్దం , ద్వేషాలతో  తన నుంచి విడుదల చేస్తున్న కలుషిత ఆలోచనల  నెగెటివ్  వైబ్రేషన్స్   వలన   ఇల్లు, సమాజం,  ప్రకృతి   ఇలా సమస్త  వాయు మండలం  కలుషితం  అయి   దుఃఖం,  అశాంతి , అనారోగ్యం నిండి ఉంది.  దీనిని  నివారించడానికి ,   తమ  శుభ సంకల్పాలు, శుభ కామనలు, ద్వారా  ప్రకృతిని శుద్ధి చేసి  ,   ఈ విశ్వం లో  శాంతి ని   నెలకొల్పడానికి  స్వయం గా   శివుని   చేత ఎన్నుకోబడిన వారే  ఈ యోగులు, నాగ సాధువులు, ఆశ్రమ సన్యాసులు, ఆధ్యాత్మిక  వేత్తలు ,  సద్గురువులు.  .... నేడు ఇటువంటి వారే  కనుక భారత దేశంలో  లేకపోయి ఉంటే,  ఈ పాటికి భారతదేశం  అనేది ప్రపంచ పటం లో  ఉండేది కాదు. .... ఇంకా గమనించగలిగితే ,  నేడు అనేక మంది పాలకులు, ధనవంతులు, వ్యాపార వేత్తలు,  భక్తి చేసే   సాధారణ   ప్రజానీకం   కూడా ఈ నాగ సాధువులు, సిద్ద యోగుల ఆశీస్సుల కోసం వారికి  పాదాభివందనాలు   చేయడం లో  వారి గొప్పతనం ఏమిటో తెలుసుకోవచ్చు. 


యడ్ల శ్రీనివాసరావు 27 Jan 2025 11:00 PM .





No comments:

Post a Comment

608. విధి - నిర్వాణం

  విధి - నిర్వాణం  • నాది   . . .   నాది   నాదన్నది     ఏది . • నేను   . . .   నేను   నాకున్నది    ఎవరు . • నిన్న      ఉన్నాను      కానీ ...