శిశిరం శివం
• ఈ శిశిరం శివం
ఈ బంధం అమరం.
• శివుని తో బంధం శిశిరం.
అది యుగ యుగాల
అంతర సమ్మేళనం.
• ఈ శిశిరం శివం
ఈ బంధం అమరం.
• శివుని తో పయనం వందనం
అది ఈ జన్మకు నందనం.
• ఈ శిశిరం శివం
ఈ బంధం అమరం.
• విధివంచిత వీరులకు
వరము లిచ్ఛు వైరాగ్యుడు . . .
శివుడు.
• జప తపములు ఎరుగకున్న
జ్ఞాన మిచ్చు సాగరుడు . . .
ఈశ్వరుడు.
• మణులు అడగడు
మాణిక్యా ల సలే అడగడు.
• శివుడు అడిగేది స్మృతి ఒక్కటే.
• టీచరు అని గౌరవిస్తే
విద్యార్థి గా చేర దీస్తాడు.
• సద్గురువు అని భావిస్తే
శిష్యరికం ఇస్తాడు.
• తండ్రి అని . . . తండ్రి అని
ప్రేమ గ పిలిస్తే
తన వారసత్వం ఇస్తాడు.
• ఈ శిశిరం శివం
ఈ బంధం అమరం.
• శివుని తో బంధం శిశిరం.
అది యుగ యుగాల
అంతర సమ్మేళనం.
• ఈ శిశిరం శివం
ఈ బంధం అమరం
• శివుని తో పయనం వందనం
అది ఈ జన్మకు నందనం.
శిశిరం = చల్లని , అంతరిక్షం , ఆకాశం, బుతువు.
అమరం = మరణం లేనిది.
యడ్ల శ్రీనివాసరావు 28 Jan 2025, 8:30 PM
No comments:
Post a Comment