పరిస్థితులు నియంత్రణ
• నేటి కాలంలో సమాజం లో పరిస్థితులు మరియు మనుషుల మధ్య సమన్వయ లోపం కలిసి మానవ జీవితాలను ఏ దిశలో తీసుకుని వెళుతున్నాయో, ఏ ఒక్కరికీ అర్దం కాని పరిస్థితి. దీనికి ఒక విధంగా కారణం నేటి కాలంలో మనిషి కి లభించిన మితిమీరిన స్వతంత్రత (over indivuality ). స్వతంత్రత అనేది భౌతికం మరియు మానసిక అంశం గాను ఉంటుంది. స్వేచ్ఛ అనేది మనిషికి ఉపశమనం కలిగిస్తుంది. స్వేచ్ఛ కి, స్వతంత్రత కి చాలా తేడా ఉంది.
• మితిమీరిన స్వతంత్రత (over Individuality) అనేది మనిషి ని ఏ దిశలో నడిపిస్తుందో , అది మనిషి కి కూడా అర్దం కాని , మానసిక స్థితి లో నేడు. మనిషి జీవనం నడుస్తుంది. ఎందుకంటే మంచి, చెడు ల మధ్య ఉన్న గీత పూర్తిగా నేటి కాల సమాజం లో చెరిగిపోయింది అనేది వాస్తవం. ఇది మంచి, ఇది చెడు అని ఆలోచించి నిర్ణయం తీసుకోలేనంతగా స్వతంత్రత మనిషిలో అభివృద్ధి చెందింది. క్షమించాలి 'అభివృద్ధి' అనే పదం ఉపయోగించి నందులకు. ఎందుకంటే అదే, మనిషి తన అభివృద్ధి అని అనుకుంటున్న తీరు , నేటి జీవన విధాన నిదర్శనం.
అందువలనే , నేడు కుటుంబ, సమాజం లో మనుషుల మధ్య సమన్వయం లోపిస్తుంది. సంబంధాలలో ఆత్మీయతలు కొరవడుతున్నాయి.
• దీనికి మరో ముఖ్య కారణం నేను అనే అహం. నేను కరెక్ట్, అన్నీ నాకు తెలుసు, నా మాట వినాలి , నాది పై చేయి గా ఉండాలి. నన్ను చూసి భయపడాలి గౌరవం ఇవ్వాలి. నాకు గుర్తింపు లభించాలి. నా అవసరాలు, కోరికలు ఎలాగైనా సరే తీరాలి. అందుకోసం ఎంత కైన తెగించాలి, ఎవరు ఎలా పోతే నాకేంటి …. ఇలాంటి భావనలతో ఇల్లు, కుటుంబం , సమాజం, ఆఫీసులు, మిత్ర బృందాలు , తోడు సాంగత్యాలు అన్నీ కూడా చాలా వరకు విష వలయాలు గా తయారయ్యాయి. దీనికి కారణం స్వయం మనిషే.
• మనుషుల మధ్య మంచి ప్రేమ, నమ్మకం, నిజాయితీ పూర్తిగా కొరవడిన రోజులు ఇవి. ఎవరైనా అనుభవజ్ఞులు మంచి చెప్పినా (చెప్పే వారు కూడా లేరు), వినేవారు గాని, ఆచరించే వారు గాని నేటి కాలం లో లేరు. అందువలనే నేటి పరిస్థితులలో అనుకూలతలు తగ్గిపోయి, వ్యతిరేకత భావనలు పెరుగుతున్నాయి.
• నేటి కాలం లో, మనిషి తెలివి ఎంతగా దిగ జారింది అంటే, ఏదైనా ఒక విషయం లో తాను చేసేది, చేసింది , చేస్తున్నది కరెక్ట్ కాదు అని స్పృహ కి తెలిసినా కూడా, దాన్ని ధైర్యంగా కరెక్ట్ అని సమర్థించుకుంటూ, తన లోని మాయతో ఇతరులను మభ్య పెట్టే హీనస్థితికి దిగజారి పోతున్నారు. ఇటువంటి అంశాలు, సంఘటనలు నేటి కాలంలో. ఇంటా బయటా, ప్రతి ఒక్కరూ ఎదుర్కుంటూ నే ఉన్నారు.
• ప్రస్తుతం అంతా అజ్ఞాన సాగరం తో నిండి ఉంది. అందువలనే నేటి మానవ సంబంధాల లో పూర్తిగా అప నమ్మకం, దుఃఖం, అశాంతి, అసంతృప్తలకు కారణం.
ఇక్కడ, ఒక. విచిత్రమైన విషయం ఏమిటంటే, మనిషి తన లోలో ని మార్పును కోరుకోడు గాని చుట్టూ ఉన్న వారు మారాలి అనుకుంటాడు. ఇది చాలా హేయం.
• దీనంతటికీ ప్రధాన కారణం , ప్రతీ మనిషికి తన మనసు పై తనకు నియంత్రణ లేకపోవడం. మనసు నియంత్రణలో లేకపోతే మనిషికి తాను ఉన్న పరిస్థితులతో సమస్యలు తప్పవు. నియంత్రణ అనేది ఒక అద్భుతమైన శక్తి అని గ్రహించాలి Controlling power.
• మరి దీనికి పరిష్కారం ఏమిటి అంటే…. మనిషి తనను తాను నియంత్రించు కోవడం. నియంత్రణ అనేది ఒక అభ్యాసం. ఇది సహజంగా అవలభించ వలసిన విధానం. నియంత వలే ఇతరుల పట్ల కాకుండా, తనపై తాను ఉండగలిగితే వ్యక్తిగత స్థితి సమృద్ధిగా, నిశ్చలంగా, ధృఢంగా, స్థితప్రజ్ఞత తో ఉంటుంది. నియంత అంటే నిరోధన.
• మనిషి కి తన చుట్టూ ఎటువంటి వ్యతిరేక, అననుకూల పరిస్థితులు వచ్చినా సరే, తన స్థితి ని డిస్టర్బ్ చేసుకోకూడదు. మనిషి ఎవరి సహాయం లేకుండా, తనను తాను సంబాళించుకో గలిగితే , ఈ ప్రకృతిని, ప్రపంచాన్ని కూడా సంబాళించ గలడు.
• నీ చుట్టూ ఉన్న పరిస్థితులు ఎప్పుడైనా ఎలాగైనా మారవచ్చు. కానీ నీ అంతర్గత స్థితి మాత్రం నీ పరిధి (హద్దు) లోనే ఉండాలి. అప్పుడే నీ పరిస్థితి బాగుంటుంది. నువ్వు నీ పరిధిలో నిలిచి ఉన్నప్పుడే, నీ చుట్టూ ఉన్న పరిస్థితులలో మార్పు వస్తుంది. దీనికి కొంచెం సమయం పడుతుంది.
అంతే గానీ, చుట్టూ ఉన్న పరిస్థితులు మారినప్పుడల్లా నీ అంతర్గత స్థితి ని మార్చుకుంటూ ఉంటే , ఏదొక రోజు నువ్వు పరిస్థితుల ముందు పూర్తిగా తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది.
• స్థితి అంటే ఆలోచన , మానసిక శక్తి , మనసు బలం.
• పరిస్థితులను నియంత్రణ చేయడం కష్టం. కానీ మనః స్థితి ని నియంత్రణ చేసుకోవచ్చు. అప్పుడే పరిస్థితి అనేది మనిషికి అనుకూలంగా తయారవుతుంది. ఇందులో సూక్ష్మం గ్రహిస్తే , మనిషి తనకు తానే. రాజు, మంత్రి, పండితుడు , సేనాధిపతి, సైనికుడు, సామాన్యుడు గా ఆవిష్కరణ పొందుతాడు.
• మనిషికి తనను తాను నియంత్రించుకునే శక్తి, యుక్తి లేకపోతే. కనుక పరిస్థితులు, కుటుంబం, సమాజం, మనుషులు ఇలా అందరి చేతిలో కీలుబొమ్మ లా కావలసి వస్తుంది. ఇది సత్యం.
• మనిషి తన మనసును స్వాధీనం చేసుకోవాలంటే , ముందు మనసును ఆధీనంలో ఉంచుకో గలగాలి. దీనినే నియంత్రణ అంటారు. అప్పుడే స్థితి, పరిస్థితి సంతోషంగా ఉంటాయి. ఇదంతా ఒక్క సద్గురువు యొక్క భోధన, సాధన మార్గం తో మాత్రమే తెలుసుకో గలం.
అనుభవజ్ఞులు ఎపుడైనా, ఎక్కడైనా, ఏదైనా ఒక మాట చెప్పినప్పుడు వినడం లో స్పష్టత లోపించినా, ఆచరించడం లో స్పష్టత లోపించినా ... ఎల్ల కాలం అయోమయ స్థితిలో నే ఉండ వలసి వస్తుంది.
యడ్ల శ్రీనివాసరావు 18 Jan 2025, 10:00 PM
No comments:
Post a Comment