అందెల సవ్వడి - అందలం
• అందెల సవ్వడి కే పలికే
నా మది మువ్వల రాగం.
• ఎద పై నిలిచిన పాదం
లేపెను నా జీవన వేదం.
• ఎగసి పడుతున్న ఈ సంతోషం
సన్నజాజి ని తాకిన తరంగం.
• నా లో గిలి తాకిన సంబరం
చిలుక తో పలుకుల కుహనం.
• అందెల సవ్వడి కే పలికే
నా మది మువ్వల రాగం.
• ఎద పై నిలిచిన పాదం
లేపెను నా జీవన వేదం.
• పెరిగిన వన్నె లో
ప్రేమ యే గారం.
• చిలికిన వెన్న లో
శ్వేత మే నయగారం.
• ఆడిన ఆటలతో ఆవిరాయే
మనసు జల్లుల మకరందం.
• ఊయల ఊగిసలాటల లో
ఊపిరి తీసెను ఉరుములు.
• అందని అందెల కే చేసెను
నా ఎద తపనల మారాం.
• కాచిన ఈ నిశి వెన్నెల
నేడు నా ఒడి చేరెను.
• వీచిన ఈ చిరు గాలులు
ప్రాణం పోసెను.
• ఎద పైన పాద భారం
శివ మై
మస్తకం తెరిచెను.
• అందెల మిన్న అందలం
ఎక్కించె
నా ప్రియతమ శివం.
• అందెల సవ్వడి కే పలికే
నా మది మువ్వల రాగం.
• ఎద పై నిలిచిన పాదం
మార్చెను నా జీవన వేదం.
జీవి కైనా .... నిర్జీవి కైనా
సత్యమైన ప్రేమ శివుని తోనే లభ్యం.
అందెలు = కాలి గజ్జెలు.
కుహనం = ఆశ్చర్యం.
శ్వేతం = తెలుపు, స్వచ్ఛత
నయగారం = మృదుత్వం.
మస్తకం = ఆత్మ స్థానం
మిన్న = కంటే, శ్రేష్టమైన.
యడ్ల శ్రీనివాసరావు 19 Dec 2024, 11:00 pm
No comments:
Post a Comment