Sunday, January 5, 2025

579. బొమ్మరిల్లు

 

బొమ్మరిల్లు



• బొమ్మరిల్లు    బొమ్మరిల్లు

  బొమ్మలు   లేని   కమ్మరిల్లు    మా  ఇల్లు.


• కుందనపు   బొమ్మలాంటి    

  అమ్మ తో   

  భాగ్యమైన    ఇల్లు.

• చందనపు    కొమ్మలాంటి    

  నాన్న తో    

  పరిమళం  నిండిన    ఇల్లు.


• బొమ్మరిల్లు     బొమ్మరిల్లు

  బొమ్మలు   లేని   కమ్మరిల్లు   మా  ఇల్లు.


• చిరు నవ్వుల     దీపం    మా  అమ్మ

  ఆ   వెలుగుకి     రూపం   మా  నాన్న.

• అమ్మానాన్న ల      ఆనందాలు

  మాలో    ధైర్యం   నింపే    వరాలు.


• బొమ్మల    పాత్రలు    మే మైనాక

  బొమ్మల    కొలువు   ఎందుకు.

• మట్టి   మనుషులం     మే మైనాక

  గట్టి      బంధాలు     ఎందుకు.


• బొమ్మరిల్లు     బొమ్మరిల్లు

  బొమ్మలు   లేని   కమ్మరిల్లు    మా   ఇల్లు.


• కుందనపు   బొమ్మలాంటి    

  అమ్మ తో     భాగ్యమైన    ఇల్లు.

• చందనపు    కొమ్మలాంటి   

  నాన్న తో    

  పరిమళం  నిండిన   ఇల్లు.


• కాయ   కష్టం తో

  కడుపు   నింపేటి   నాన్నకి . . .

• అధిక    ఇష్టం తో

  ప్రేమ    ఇస్తుంది   మా   అమ్మ.


• వెన్న లాంటి    మనసులు   మావి

  వెన్నెల  నే      కురిపిస్తాం.

• మన్ను లాంటి    బ్రతుకులు    మావి

   మైనం  లా      కలిసుంటాం.


• గిరులు   నిండిన   సిరులు

  మా    ఆత్మీయతలు.

• మసక   బారని    వెలుగులు

  మా   సంతోషాలు.


• బొమ్మరిల్లు     బొమ్మరిల్లు

  బొమ్మలు    లేని   కమ్మనిల్లు    మా  ఇల్లు.



కమ్మరిల్లు = తాటాకుల పూరిల్లు.


యడ్ల శ్రీనివాసరావు 5 Jan 2025, 7:30 PM




No comments:

Post a Comment

589. వృద్ధాప్యం

  వృద్ధాప్యం • సహజంగా  మనకి   తెలిసిన వృద్ధాప్యం అంటే ముసలి తనం.   అంతకు మించి వేరే అర్దం, భావం మనకు తెలియదు.  మనం పుట్టిన తరువాత, చివర అ...