ఎవరు ఉంటే … ఎవరు లేకుంటే
• ఎవరు ఉంటే ఏమి ఈశ్వరా
ఎవరు లేకుంటే ఏమి ఈశ్వరా
నీ వుంటే చాలు …
నీ తోడుంటే చాలు.
• ఉన్న వారందరూ ఉత్తమోత్తమలు
లేని వారందరూ లవలీనులు.
• కనులు మూసిన మరణం
కనులు తెరిచిన జననం.
• నడి మధ్య నాటకం లో
నలిగేటి బ్రతుకు ఎందుకో.
• జీవితం ఓ నాటక మని
తెలిసాక
రంగు పూసుకుని . . .
రంగస్థల మెక్కి ఏమి చేయాలి.
ఈశ్వర … పరమేశ్వరా …
• అడుగడుగు నటనతో
రక్తి కట్టించాలి ఆంటే . . .
మాయ కి దాస్యం చేయాలా.
ఈశ్వర … పరమేశ్వరా…
• ఎవరు ఉంటే ఏమి
ఎవరు లేకుంటే ఏమి
• నీ వుంటే చాలు …
నీ తోడుంటే చాలు.
• పొంతన లేని ఈ లోకం లో
స్వాంతన తో ఏమి చేయాలి.
• స్వచింతన లేని జీవనం తో
శాంతిని ఎలా పొందాలి.
• నీ వెలుగు లో విస్తారమై
నీ ఒడి లో శాశ్వతం కావాలి.
• సూక్ష్మ దృష్టి తో చూస్తున్న
నీ అమర సృష్టి ని
తాకేటి భాగ్యం కావాలి.
• ఈశ్వర … పరమేశ్వరా…
ఎవరు ఉంటే ఏమి
ఎవరు లేకుంటే ఏమి
నీ వుంటే చాలు ...
నీ తోడుంటే చాలు.
ఈశ్వర ... పరమేశ్వరా ...
లవలీనులు = సత్య మైన ప్రేమ మూర్తులు.
స్వాంతన = సత్త్వరజ తమో గుణాలనే వికారాల నుంచి విముక్తి చెందిన మనస్సు అని విశేషార్థం.
యడ్ల శ్రీనివాసరావు 9 Jan 2025, 8:00 PM
No comments:
Post a Comment