Sunday, January 26, 2025

591. తను ... వచ్చే నంట

 

తను ... వచ్చే నంట



• హ   …  తను వచ్చె నంట

  నను  …   మెచ్చే నంట.

  నేనే   లేని     లోకం లో

  హ    . . .  తను వచ్చె నంట

  నను  . . .  మెచ్చే నంట.


• జరిగిన   కాలంలో    జారిన  వరం

  జన్మ కు    మిగిలిన    ఈ జ్ఞాపకం.


• నే  లేని    తనను   

  ఎలా    కలవడం.

• తిరిగి   జన్మించినా

  తరగదు    ఈ   కలవరం.

• ఇంతే  నా   . . .  ఇంతే  నా

  దేహం   విడిచిన    నేనింతే   నా.


• హ   . . .  తను  వచ్చె నంట

  నను  . . .   మెచ్చే నంట.

  నేనే   లేని     లోకం లో

  తను  వచ్చె   నంట

‌  నను  …   మెచ్చే నంట.


• మనిషి గా  ' నే '   చూసాను . . .

  తొలిసారి   

  మనసు తో     చూస్తున్నాను.


• సమయాన్ని   అడుగుతున్నా …

  కాసేపు

  నా దేహం    ఇవ్వమని.

• సమాధాన   మివ్వడం   లేదు.


• కన్నీళ్లు    ఉబుకుతు   ఉన్నా 

  ఏమిటో . . . 

  తడి   నాకు    తెలియడం లేదు.

• చేతులతో      తాకుతున్నా 

  ఏమిటో . . .

  తన   స్పర్శ    తెలియడం లేదు.


• ఇంతే   నా  . . .   నేనింతే  నా 

  దేహం   విడిచిన     నేనింతే    నా.


• హ   …   తను  వచ్చె నంట

‌  నను  …  మెచ్చే   నంట.

‌  నేనే   లేని     లోకం లో

‌  తను   వచ్చె   నంట

  నను   …   మెచ్చే నంట.


• జరిగిన   కాలంలో    జారిన  వరం

‌  జన్మ కు    మిగిలెను   ఈ జ్ఞాపకం.


(Inspiration from  a  Web movie )

యడ్ల శ్రీనివాసరావు  21 Jan 2025, 8:00 PM





No comments:

Post a Comment

608. విధి - నిర్వాణం

  విధి - నిర్వాణం  • నాది   . . .   నాది   నాదన్నది     ఏది . • నేను   . . .   నేను   నాకున్నది    ఎవరు . • నిన్న      ఉన్నాను      కానీ ...