ఎవరు ?
• ఎవరివి నీవు … ఎవరివి నీవు
ఎచట నుంచి వచ్చావు
ఎచట కు తిరిగి వెళతావు
ఎవరివి నీవు … ఎవరివి నీవు
• నేటి నీవు . . .
గతము లో ఎవరవు ?
• నేటి నీవు . . .
భవిత లో ఏమౌతావు ?
• నీ గతము కు కొనసాగింపు
నేటి నీవేనని తెలుసా.
• నీ భవిత కు బీజం
నేటి నీవేనని తెలుసా.
• జననం మరణం . . .
కాలం లో నీ పయనం.
• జీవన చక్రం
నీ కర్మల వయనం.
• నేటి బంధాలు
నీ గత జన్మల బుణాలు.
• అవి తీరనంత వరకు
జీవన్ముక్తి లేదు.
• నేటి సుఖ దుఃఖాలు
నీ గత కర్మల ఫలితాలు.
• వాటికి అతీతం
అవటమే జీవన్ముక్తి.
• ఎవరివి నీవు … ఎవరివి నీవు
ఎచట నుంచి వచ్చావు
ఎచట కు తిరిగి వెళతావు
ఎవరివి నీవు … ఎవరివి నీవు.
• ఆది యే శివం
అంత్య మే వినాశనం
• నడి మధ్య నడిచేది
అంతా మాయ మిథ్య.
• శివుని తో ధ్యానం చెయ్యి
నీ జన్మ మూలం తెలియును.
• శివుని తో యోగం చెయ్యి
నీ పాపాలు దగ్దం అవును.
• శివుని ధ్యాన యోగమే
జ్ఞానము పొందే మార్గం.
• అదే . . . అదే . . .
• నీవెవరో . . . నీవెవరో
నిన్ను నీకు తెలియ చేయును.
• అనుభవాల కలిమి తో
సాక్షి భూతం అవును.
• ఎవరివి నీవు … ఎవరివి నీవు
ఎచట నుంచి వచ్చావు
ఎచట కు తిరిగి వెళతావు
ఎవరివి నీవు … ఎవరివి నీవు.
యడ్ల శ్రీనివాసరావు 6 Jan 2025 7:15 PM.
No comments:
Post a Comment