Saturday, January 11, 2025

583. సమరం సంబరం భావయుక్తం

 

సమరం సంబరం





• ఈ చలి     గాలుల   సమరం

  మనసు  మమత ల   సంబరం.


• మనసు    అంటుంది

‌  చలి   చలి  చలి   అని

• మమత    అంటుంది

  గిలి   గిలి  గిలి    అని.

మనసు   మమత ల   కలయిక లో

  చలి  గిలి   ఏకమై  . . .  

  చేస్తున్నాయి 

  సమర   సంబరం

‌  ఇదే  . . ‌.  అమర   అంబరం.


• ఈ చలి    గాలుల    సమరం

  మనసు    మమత ల   సంబరం.


• మనసు    నేనై తే

  మమత    నా   మధువు.

• మధువు    నేనై తే 

  మమత   నా  మనసు.


• ఈ మంచు   పలకరింపు తో

  పులకరింపులు    మొదలైనాయి.

• ఈ పూల    పరిమళం   తో

  తపనలు    ఒకటైనాయి.


• తడిసిన    మనసు కి

  వెచ్చని   మమత    ఓ వరం .

• బిగిసిన    మమత కి

  చల్లని   మనసు   ఓ అనురాగం.


• రేయి   పగలు   ఎరుగని

  ఈ   సంగ్రామం   సూర్య  చంద్రుల

  ఆశీర్వాదం …

• ఇది   ప్రకృతి   పురుషుల

  మోహన    సమ్మోహనం.

• ఇది    సృష్టి   ఆగమన

  స్థితి   లయ   సంగమం.

 

• ఈ చలి     గాలుల   సమరం

  మనసు  మమత ల   సంబరం.


భావ యుక్తం 


• మనసు అంటే ఆలోచన . అది  ఉండేది  ఆత్మ లో.

• మమత   అంటే   ప్రేమ,  వాత్సల్యం.   వీటిని     వ్యక్తపరిచేది  దేహం.

• ఆత్మ లోని   ఆలోచన (మనసు) ,  దేహం లోని ప్రేమ, వాత్సల్యం  (మమత)  తో  కలిసినపుడు    యుద్ధం (సమరం),   సంతోషం (సంబరం)  రెండు  కలుగుతాయి. 


• ఎలా   అంటే ….


• కార్తీక మాసం లో.  శివ ఆరాధన, తరువాత  మాసం విష్ణు ఆరాధన  చేస్తారు.   పిదప  వైకుంఠ  (ఏకాదశి) దైవ  దర్శనం  జరుగుతుంది ….

• ఈ మాసాలు అన్ని  పూర్తిగా  చలి తో   ఉంటాయి. చలి, మంచు  అపారమైన  స్థాయిలో  ప్రకృతి పంచభూతాల   ద్వారా   భూమిని  తాకుతాయి.  ఈ కాలం లో  విశ్వశక్తి   జీవునికి   సమృద్ధిగా  లభిస్తుంది. తద్వారా  దేహం  ఉత్తేజం ( గిలి ) అయి,   దేహం లో  అంతర్గతం గా   ఉష్ణం ,  శక్తి  ఉద్భవిస్తుంది.


• వాతావరణం లో   ఉండే  శీతలం (చలి),  దేహం లో ఉండే  ఉష్ణం (గిలి ) తో ,  కలవడం వలన  ఒక శరీరం లో   అంతర్యుద్ధం (సమరం) జరుగుతుంది . దీనిని అనుభవించడం   ఓ సంతోషం  (సంబరం).


• స్వయం   నేనే   మనసుని   అని  భావిస్తే  మమతలు   అన్నీ   నాలో  తియ్యగా   ఉంటాయి.

• నాలో  ఉన్న  తియ్యదనం అంతా  నా  మనసు అని   భావిస్తే    నేనే   మమత గా   అవుతాను.


• మంచు తాకినపుడు  చల్లదనం వలన  మనసు  పులకరించి   ఆలోచనలు  శాంతియుతంగా  అవుతాయి.

• శీతాకాలంలో  పువ్వుల వాడి  పోకుండా  ఉండడం వలన  ఆ  పరిమళం తో   మనసు  ఆలోచన భావనలు   ఏకం  అవుతాయి.


• చల్లని   శాంతియుతంగా  అయిన  మనసు కి  ప్రేమ వాత్సల్యాలు   వెచ్చదనం   ఇస్తాయి.  ఇది ఒక వరం.

• అనుభూతి  లేని  వెచ్చని  వాత్సల్యం,   ప్రేమ కి   శాంతియుతమైన  మనసు    అనురాగం ఇస్తుంది.


• పగలు  రాత్రి  అని   కాలం తో   సంబంధం లేకుండా, సూర్యుడు  చంద్రుడు  యొక్క ఆశీర్వాదం తో జరిగే ...

ఈ మనసు,    మమతల   క్రియల ద్వారా  అనుభవించే   స్థితులు ,  అనుభూతి  చెందే    ప్రక్రియలు అన్నీ   కూడా   ఒక   దేహం లోనే  అంతరంగం లో  జరుగుతాయి.  ఇందులోనే  సమరం  సంబరం  ఉంటాయి.   మనసు,  మమత అనేవి   ఆత్మ   ప్రకృతి  ద్వారా   ఒకరిలోనే   చలనం  అవుతాయి. 


• ప్రకృతి  అంటే  పంచభూతాలు.

• పురుషుడు  అంటే   ఆత్మ.

• ప్రకృతి  పురుష మోహనం అనగా,  పంచభూతాలు ఆత్మ తో   అనుసంధానం  అవడం వలనే  ఈ సృష్టి లో     స్థితి    ప్రయాణం  ఎలా జరుగుతుందో తెలుస్తుంది.   అదే వైకుంఠానికి   దారి  చూపిస్తుంది.


ఇది అంతయు   ఒక దేహం యొక్క  అంతరంగం లో,  అంతర్గత ప్రయాణం లో   జరిగే   ప్రక్రియ.


యడ్ల శ్రీనివాసరావు 11 Jan 2025, 6:30 PM.




No comments:

Post a Comment

589. వృద్ధాప్యం

  వృద్ధాప్యం • సహజంగా  మనకి   తెలిసిన వృద్ధాప్యం అంటే ముసలి తనం.   అంతకు మించి వేరే అర్దం, భావం మనకు తెలియదు.  మనం పుట్టిన తరువాత, చివర అ...