చీకటి మహత్యం
• మేలుకో . . . మేలుకో
మేలుకో మానవుడా మేలుకో
మేలుకొని చీకటి
మహత్యం తెలుసుకో.
• తెలుసు కుంటే . . .
చేస్తావు చెలిమి చీకటి తో.
నీ లో లో ని . . . చీకటి తో.
• వెలుగు రేఖల వైపు
పయనం
చీకటి లోనే ఆరంభం.
• నీవెవరో నీకు చూపేటి
నిలువుటద్దం చీకటి.
• చీకటి అంటే కష్టాలు , కన్నీళ్లు
కావని తెలుసుకో . . .
• ముళ్లు పుష్పాలు గా
మారేది చీకటి లోనే.
• దుఃఖానికి కారణం అజ్ఞానం.
అజ్ఞానం తొలగుటకు
తోడు గ నిలిచేది చీకటి.
• ఆకశం లో అందాలను
ఆరబోసి చూపేది చీకటి.
• నీవు ఉన్నా లేనట్టు గ
కౌగిలి లో రక్ష నిస్తుంది చీకటి.
• నీలో నిండిన చీకటి
ఏదో ఒక రోజు
విశ్వానికి రారాజు ను చేస్తుంది.
• మేలుకో . . . మేలుకో
మేలుకో మానవుడా మేలుకో
మేలుకొని చీకటి
మహత్యం తెలుసుకో.
• తెలుసు కుంటే . . .
చేస్తావు చెలిమి చీకటి తో.
జీవితం లో ప్రతి ఒక్కరూ వెలుగు ని ఆస్వాదిస్తూ ఉంటారు. కానీ , ఇది చూసే ప్రతీ ఒక్కరికీ తెలియని వాస్తవం ఏమిటంటే, చీకటిని దాటిన వారే వెలుగు ని ఆస్వాదిస్తూ ఉంటారు.
చీకటి అంటే రాతిరి , దుఃఖం, కష్టాలు, కన్నీళ్లు, అవమానాలు, నిందలు, అపజయాలు ఇలా ఎన్నో అని మనిషి భావిస్తాడు. ఎవరైతే వీటితో ప్రయాణం చేసి , రుచి చూసి , రాటు దేలి నిలబడతారో వారే అసలైన వెలుగు ని ఆస్వాదిస్తూ ఉంటారు.
అందుకే చీకటి అనేది మనిషి కి ఎంతో సహాయం చేస్తుంది. ఎలా జీవించాలో నేర్పిస్తుంది. చుట్టూ ఉన్న మనుషులు , బంధువులు , మిత్రులు , పరిస్థితులు మరియు సమాజం యొక్క వాస్తవ రూపం సూక్ష్మంగా పరిశీలించే స్థితి చీకటి అనుభవించిన వారే నిశితంగా గమనించ గలుగుతారు. అందు వలన వీరు అనుభవ సిద్ధులై , నిర్ణయ శక్తి లో నిష్ణాతులై తదుపరి రారాజులు అవుతారు.
కాకపోతే వీరు ఓర్పు, సహనం కలిగి ఉండాలి. కాలాన్ని ప్రేమించాలి, అర్దం చేసుకోవాలి.
మనిషి గా జన్మించిన ప్రతి ఒక్కరూ, చీకటి ని తమ తమ జన్మలలో అనుభవించ వలసిందే, కాకపోతే అది కాస్త ముందు వెనుక అవుతుంది.
చీకటి కి భయపడకండి. చీకటి ని ప్రేమించండి. చీకటి ని అర్దం చేసుకుంటే వెలుగు ని శాసించే (ఆధీనంలో ఉంచుకునే) శక్తి లభిస్తుంది.
భూమి పైన వెలుగు లో కనిపించే మహ వృక్షం యొక్క మూలం , భూమి లోపల చీకటి లో ఉండే విత్తనం మరియు వేరు యొక్క సామర్థ్యం వలనే నిలబడుతుంది.
అదే విధంగా మనిషి వెలుగు ని ఆస్వాదించాలి అంటే మనసు లోని చీకటి తో స్నేహం చేయాలి. ఆ స్నేహం సమస్తం అర్దం చేయిస్తూ ఉంటుంది. కేవలం కనులు మూసుకుని మనిషి తనను తాను గమనించుకుంటూ ఉండాలి.
వెలుగు ఏనాడైనా మనిషి ని మోసం చేసే అవకాశం ఉంటుంది. కానీ చీకటి మాత్రం ఎన్నడూ ఎవరినీ మోసం చెయ్యదు.
యడ్ల శ్రీనివాసరావు 25 Jan 2025 , 2:00 pm.
No comments:
Post a Comment