Friday, January 3, 2025

576. పొదరిల్లు

 

పొదరిల్లు


• సరదా    సరదా   కుటుంబం

  ఆటా      పాటల   ఆనందం.

• అమ్మానాన్న ల     ఆత్మీయం

  సమతల  మమతల  సంతోషం.


• అమ్మ లోని    చిరు నవ్వు

  మా ఇంటి      హరివిల్లు.

• నాన్న లోని     నడవడిక

  మా ఇంటి      దిక్సూచి.


• రాగాలొలికే   మా  అనురాగాలు

  అంబరాలు   దాటే ను.

• గారాలొలికే   మా   ప్రేమగారాలు

  సంబరాలు    చేసే ను.


• సరదా   సరదా   కుటుంబం

  ఆటా పాటల   ఆనందం.

• అమ్మానాన్న ల    ఆత్మీయం

  సమతల   మమతల  సంతోషం.


• అమ్మ చేతి    ముద్దలు

  జన్మ జన్మల   అమృతం.

• నాన్న చేతి    గుద్ధు లు

   కేరింతల  కవ్వింపులు. 


• ఇలలో   మా   ఈ  బృందావనం

  ఏ   కలలో    కానరాని    సుందరం.

• ప్రేమలు    నిండిన   మా  కుటీరం

  ఏ  సిరులు    తూగని   ఐశ్వర్యం.


• పెనవేసుకున్న    పరిమళం

  అమ్మ నాన్న ల    బంధం.

• ఆ పరిమళం తో    వికసించిన

  పువ్వులం    మా సోదరులం.


• అమ్మ లాలన లో    మంచు   పిల్లలం

  నాన్న పాలన తో     కంచు  మోగిస్తాం.


• సరదా   సరదా   కుటుంబం

  ఆటా   పాటల   ఆనందం.

• అమ్మానాన్న ల    ఆత్మీయం

  సమతల   మమతల  సంతోషం.


యడ్ల శ్రీనివాసరావు 3 Jan 2025 

6:30 PM.


No comments:

Post a Comment

589. వృద్ధాప్యం

  వృద్ధాప్యం • సహజంగా  మనకి   తెలిసిన వృద్ధాప్యం అంటే ముసలి తనం.   అంతకు మించి వేరే అర్దం, భావం మనకు తెలియదు.  మనం పుట్టిన తరువాత, చివర అ...