మనసు తరుణం
• ఆగి ఉన్న తరుణం …
ఈ సమయంలో మనసు
ఆగి ఉన్న తరుణం.
• గమ్యం ఎంతో స్పష్టమైన
గతం ఎంతో గరళమైన
• ఆగి ఉన్న తరుణం …
ఈ సమయంలో మనసు
ఆగి ఉన్న తరుణం.
• ఈ కాలం లో పయనం
అతింద్రియ సుఖం.
• సౌందర్యాలు ఎన్నో
ఆస్వాదిస్తున్న కాలం.
• అందుకే … అందుకే
ఆగి ఉన్న తరుణం …
ఈ సమయంలో మనసు
ఆగి ఉన్న తరుణం.
• మదిలోన మందారం ఏదో
గుసగుసలాడుతూ ఉంది.
• గుండె లయల జడులలో
అవి వినపడకున్నాయి.
• కానరాని మేఘం ఏదో
చిరు జల్లులు కురిపిస్తుంది.
• కనుపాప తెరలలో
అవి కనపడకున్నాయి.
• దేహం తడవకనే చల్లగ ఉంది.
• అధరం ఆగకనే అదురుతు ఉంది.
• అందుకే … అందుకే
ఆగి ఉన్న తరుణం …
ఈ సమయంలో మనసు
ఆగి ఉన్న తరుణం.
• చూడలేని దేదో
మనసుని తాకుతూ ఉంది.
• అది తాకలేక నిశిలో
నీడ నై ఉన్నాను.
• వెలుగుతున్న దేదో
మనసు ని ఆవరించి ఉంది.
• కానీ కదలలేక గాలి లో
తేమ నై ఉన్నాను.
• మౌనం వీడక నే
మాట పలుకు తుంది.
• మకరందం దొరకక నే
మాధుర్యం నిండి ఉంది.
• అందుకే … అందుకే
ఆగి ఉన్న తరుణం …
ఈ సమయంలో మనసు
ఆగి ఉన్న తరుణం.
యడ్ల శ్రీనివాసరావు , 25 Dec 2024, 6:15 PM.
No comments:
Post a Comment