Wednesday, December 27, 2023

441. శివుడే గురువు – ప్రభువు

 

శివుడే గురువు – ప్రభువు




• శివుడొక్కడే    గురువు

  శివుడొక్కడే    ప్రభువు


• అష్ట   భంగిమల  సారంగుడు

  ఆద   మరచిన  వారిని

  మేల్కొల్పుతాడు.

• అష్ట సిద్ధుల   సంభూతుడు

  ఆశ   లెరగని   వారిని

  చేర దీస్తాడు.


• శివుడొక్కడే    గురువు

  శివుడొక్కడే    ప్రభువు


• బంధాలలో    బాధలన్నీ

  బ్రతుకు  బాటలో  ఆటలే

  కానీ

  రోదన లో    మునిగే

  శాపాలు     కాదు.

• ఆటల లో     అలసిన

  తుదకు     విజయమే

  కానీ

  అనారోగ్యము    కాదు.


• శివుడొక్కడే   గురువు    

  శివుడొక్కడే   ప్రభువు


• ఆది అంతాల   సారధుడు

  ధీనులను  మది పై

  నిలుపు కుంటాడు.

• పంచ భూతాల   మిళుతుడు 

  జీవులకు   ఊపిరై 

  సాకుతూ  ఉంటాడు.

• చుక్కాని లేని   నావ

  ఎటు    పోయినా

  కానీ

  కడకు    చేరాల్సింది 

  ఏదోక    తీరమే.

• ఆత్మ       బంధాలలో

  ఎంత      మునిగినా

  కానీ

  తుదకు   చేరాల్సింది

  పరమాత్మ  సన్నిధి  కే


• శివుడొక్కడే    గురువు

  శివుడొక్కడే   ప్రభువు


సారంగుడు, సంభూతుడు, సారధుడు, మిళితుడు = శివుడు.


యడ్ల శ్రీనివాసరావు 27 Dec 2023, 6:00 pm.


Sunday, December 24, 2023

440. తొలి వలపు


తొలి వలపు



• తొలి వలపు    ఆస్వాదన

  తొలకరి గా    చిగురించె నా.

• ఆశ లో    మెరిసే    ఆనందం

 ‌ ఆవిరి లో    కలిసే    ఆక్రోశం.


• ఈ రేయి    నాదే నని

  ఈ గాలి లో  తాను    ఉన్నాడని

  సాగరం    చెపుతోంది

  అలల   ఘోష లో   వినిపిస్తోంది.


• ఆశ లో    మెరిసే    ఆనందం

  ఆవిరి లో   కలిసే    ఆక్రోశం.


• ఈ వెన్నెల్లో    వేదం లా   మిగిలాను

  నా ప్రేమ కు    అద్దం లా    ఉన్నాను.

• గతమంతా    గంధర్వ మైనా

  స్మృతుల న్నీ   ఇసుకలో   మిగిలాయి.


• తొలి వలపు      ఆస్వాదన

  తొలకరి గా      చిగురించె ను.


• ఈ రేయి    నాదే నని

  ఈ గాలి లో    తాను    ఉన్నాడని

  సాగరం   చెపుతోంది

  అలల   ఘోష లో   వినిపిస్తోంది.

 

• నా వాడు   నేడు   నాతోడు  లేడు.

  నింగి లో   నీడై   నను   తాకుతుంటాడు.

• జాబిలి   చూస్తుంది    జాలిగా.

  పలకరిస్తోంది   నన్నే    సాక్షి గా.


• ఆశ లో     కలిసే    ఆనందం

  ఆవిరి లో   కరిగే   అశ్రువు.

• తొలి  వలపు   ఆస్వాదన

  వెలిసిన     ఆ రా ధ న.


ఆక్రోశం =  విచారం, బాధ 

అశ్రువు = కన్నీటి  బిందువు.


యడ్ల శ్రీనివాసరావు 24 Dec 2023 9:10 pm.


Tuesday, December 19, 2023

439. చిన్న నాటి హాయి


చిన్న నాటి హాయి



• చిన్న నాటి   హయి 

  ఎక్కడుంది  వోయి.

  చిందు  లేయకుంటే 

  హుషారెక్కడోయి.


• ఆడి పాడే      తొక్కుడు బిళ్ళలు.

  పోటా పోటీ     గూటీ బిళ్ల లు.

  లంగా వోణి      చెమ్మ చెక్కలు.

  నీటి గుంతల్లో   కప్ప గెంతులు.

• ఎక్కడికి పోయాయి

  ఏమై పోయాయి.


• ఆ రోజులు     ఈ రోజులు

  రోజులన్ని    ఒక్కటే.

• కాలం లో   రాని   మార్పు

  మనుషుల్లో    ఎందుకు.


• చిన్న నాటి   హయి 

  ఎక్కడుంది   వోయి.

  చిందు   లేయకుంటే 

  హుషారెక్కడోయి.


• దొంగ పోలీసు    దాగుడు మూతలు.

  బొంగరాల         కేరింతలు.

  ఏడు పెంకుల     బంతి ఆటలు.

  తూరీగ వెనుక  కొంటె పరుగులు.

• ఎక్కడికి    పోయాయి

  ఏమై    పోయాయి.


• మసి పట్టిన    మనసు లతో

  మసక మసక    ఆశల తో

  మకిలి పట్టిన   మనుషుల మై

  మనకెందుకో    ఈ బాధలు.


• చిన్న నాటి    హయి 

  ఎక్కడుంది    వోయి.

  చిందు  లేయకుంటే 

  హుషారెక్కడోయి.


• బంకమట్టి తో   లక్క పిడతలు .

  అష్టా చెమ్మ     చింత పిక్కలు.

  నేల బండ       దూకుడు ఆటలు.

  ఒప్పుల కుప్ప  వయ్యారి భామలు.

• ఎక్కడికి   పోయాయి

  ఏమై    పోయాయి.


• బాల్యం లో    లేని   శోకం

  బంధాల తో   ఎందుకు   భారం.

• వయసు    పెరిగి    వృద్ధులైనా 

  మనసు   తరుగుతుంటే నే    బాల్యం ... బాల్యం.


• చిన్న నాటి   హయి

  మనతో  నే    ఉందోయి.

• తట్టి    లేపావంటే 

  మనసంతా    హాయి  హాయి.


యడ్ల శ్రీనివాసరావు  19 Dec 2023 11:00 pm.


Monday, December 18, 2023

438. తిరుమ లీశుడు

 

తిరుమ  లీశుడు


• తిరుపతిన     అడుగిడిన

  తిరువీధుల    నడయాడిన

• తిరు  నామమే   ధరించి

  తిరు   గిరుల   నెక్కిన


• తిరు తీర్థముల   మునిగిన

  తిరుమల లో    బసజేసిన.

• తిరుప్పావై   మనసును   విన్న

  తిరు మంగళములు  పొందిన.

• తరిగొండ   వెంగమాంబ

  వడ్డింపులు   వేడిగా  ఆరగించిన .


• శ్రీనివాసుని    నిత్య కళ్యాణం

‌ సకల  శుభముల   సారంగము.

• శ్రీదేవి సిరుల తో    నింపే 

  భూదేవి    భువనము.


• పరమాత్మ   సృష్టి    నారాయణుడే

  దేవతలు  కొలిచేటి   కొండలరాయుడు.

• కోరికలు   తీర్చేటి    కోదండరాముడే 

  కొంగు   బంగారమై న    చిన్నికృష్ణుడు.


• నిన్ను నన్ను   కావ  శివుడే  

  కారుణ్యుడై   

  కలియుగమున  వెలిసే

  వెండి కొండలపై   " వేం కటే  శ్వరునిగా" .


  ఓం నమః శివాయః🙏

  ఓం నమో నారాయణాయః 🙏


  సారంగము = ఏనుగు, మేఘము.

  భువనము = జగము.

  కావ = రక్షించు.


యడ్ల శ్రీనివాసరావు 19 Dec 2023 , 3:00 am.



Sunday, December 17, 2023

437. అంతరంగం - శివుని శ్రేష్టం

 

  అంతరంగం - శివుని శ్రేష్టం 

 

• నడివయసు లో    నే

  అడుగిడితి    శివా.

• నీ స్మరణ     తోనే

  నిత్య    దైనందనము.

  నీ ఫలము   తోనే

  నిత్య    జీవనము.


• నా జీవన    నావ కు

  చుక్కానివయి 

  తీరం  దాటించు   శివా.

• ఏమి    భాగ్యమో  ...

  ఆశలు     అడుగిడినవి.

  ఆడంబరములు   మరుగడినవి.


• నడివయసు లో    నే

  అడుగిడితి     శివా.

• నీ  స్మరణ    తోనే

  నిత్య   దైనందనము.

  నీ  ఫలము    తోనే

  నిత్య     జీవనము.


• నిను  తలచు    తీరికను  ఇచ్చావు.

  జన్మాంతరాల    జ్ఞప్తి    నిచ్చావు.

• కర్మలు    తెలిపే    జ్ఞానం  ఇచ్చావు.

  బుణములు  తీర్చే  శక్తి     నిచ్చావు.


• రా 'తల్లో’   కరిగించావు    కర్మలు.

  చే ‘తల్లో’    చేయించు       సేవలు .


• వృధా     వ్యాపకాల తో

  వృద్ధుడిని     కాబోను.

• వ్యర్థ      వాక్కు లతో

  కాలం     గడపబోను.


• నడివయసు లో    నే

  అడుగిడితి     శివా.

• నీ స్మరణ    తోనే

  నిత్య     దైనందనము.

  నీ ఫలము  తోనే

  నిత్య  జీవనము.


• నేను    నేనుగా   గాక

  మర మనిషి లా     ఉండలేను.

  మరో మనిషి లా    మారలేను.

• ముక్కంటి   

  ముద్దు  మోము   మరచి

  మాయలో    మునగలేను.


• సంసారము     సాకారము

  సంబర మనుకున్నాను   గానీ …

• ఇంగితమున 

  శివుడే   

  నా సర్వమని   తెలుసుకున్నాను.


• విభూదిని     విడచి

  విఘడియ  నే  నుండలేను.

• విలాసిని     మరచి

  ఊపిరి   తీయను లేను.

• కంటి  లో నే      కాదు

  నా ఒంటి లో    కూడా

  ఇంకి   పోవా      శివా.


• నడివయసు లో    నే

  అడుగిడితి    శివా.

• నీ స్మరణ   తోనే

  నిత్య    దైనందనము.

  నీ ఫలము  తోనే

  నిత్య    జీవనము.


 ఓం నమః శివాయః 🙏


యడ్ల శ్రీనివాసరావు 18 Dec 2023 , 2:30 am


Saturday, December 16, 2023

436. జగదాంబ సహజ మాల

 

జగదాంబ సహజ మాల



• శర్వరి     శ్రీ కాంత   శంభునయని

• వికసిత  పద్మ   మనోభి  నేత్రి

• త్రిశూలేశ్వరి    త్రిభువన  కాంచని

• మనోవాజ్జాని   సంపత్కరి

• సౌభాగ్య దాయిని    సంతుష్ట సకలేశ్వరి.

• భువన బ్రహ్మాండ    అఖిలాండేశ్వరి

• శివ శక్తి    భీజరూపిణి

• జ్ఞాన సాహితి   సిగ కమలాకరి

• పాహిమాం    పాహిమాం

• రక్షమాం   రక్షమాం.


యడ్ల శ్రీనివాసరావు  17 Dec 2023 1:15 am.


Friday, December 15, 2023

435. ప్రేమ సాక్షి

 

ప్రేమ సాక్షి 


• అవుతా    అవుతా

  నాకు   నేను

  సాక్షి గ  అవుతా.

• పంచ     భూతాల

  మిళితం   అవుతా.


• గాలినై                    (Air)

  నిను     తాకుతూ

  నీ  ఊపిరి   నవుతా.

• నీటి చినుకు నై        (Water)

  జారి  

  చల్లని   సేద  నవుతా.


• అవుతా    అవుతా

  నాకు   నేను

  సాక్షి  గ   అవుతా.

• మనసు అనే  సాక్ష్యం తో

  అద్దం    అవుతా.


• అగ్ని   లోని                (Fire)

  వెచ్చదనం తో

  ఓదార్పు ని    అవుతా.

• నింగి  అంత               (Sky)

  శూన్యమై

  నీ లో    నిండి  ఉంటా.


• అవుతా   అవుతా

  నాకు   నేను

  సాక్షి గ   అవుతా.

• మట్టిలో                     (Earth)

  " నే "

  నీ  ఉనికిని  అవుతా.

• ఈ   ప్రకృతిలో            (Nature)

  నీ తోడు   కాని 

  నీడను  నేనే  అవుతా.


• అవుతా    అవుతా 

  పంచ     భూతాల

  మిళితం  అవుతా.

• నా లోని  ప్రేమ  కు

  ప్రాణం  అవుతా.

• మనిషే   లేని   ప్రేమ తో

  సరి కొత్త   ప్రేమ కు

  నేనో 

  నిర్వచనం  అవుతా.


యడ్ల శ్రీనివాసరావు 16 Dec 2023 6:00 am.


Sunday, December 10, 2023

434. కార్తీక దీపం 🪔


కార్తీక దీపం 🪔


• కల వెనుక   కార్తీక  దీపం

  అయింది

  నేడు

  ఇల లోన    సౌభాగ్యం.


• ఆ బంగారు   వెలుగు

  ముచ్చటగా   మెరిసే

  నేడు

  నీ మురిపాల   నవ్వు లో.


• కల వెనుక   కార్తీక   దీపం

  అయింది

  నేడు

  ఇల లోన   సౌభాగ్యం.


• నీ పారాణి     పాదం

  అడుగిడున   నాడే 

  అయింది   ఇల్లు

  లేత పచ్చని   పొదరిల్లు.


• సన్నని    రవిక లో

  రత్నమైన     రవికాంత

  ముంగిట    మసిలావు 

  మన్నెం లో   మణికాంతి  లా.


• కల వెనుక    కార్తీక   దీపం

  అయింది

  నేడు

  ఇల లోన     సౌభాగ్యం.


• చిట్టి పొట్టి    మాటలతో

  చిన్నారి     అయినావు 

  చుక్క వై     చక్కగా

  చెంగు న    చుట్టావు.


• నీ  పాదాలు    మోపిన

  ఈ  గుండె కి

  మరణం     తెలియక

  చరణాలు   రాస్తుంది.


• బ్రతకని    ఈ ప్రేమ

  చితక క  

  చితి ని   జయించి

  చిరంజీవి   అయింది


• కల వెనుక    కార్తీక  దీపం

  అయింది

  నేడు

  ఇల లోన   సౌభాగ్యం.


యడ్ల శ్రీనివాసరావు 11 Dec 2023 12:15 am .


Saturday, December 9, 2023

433. నమ్మకం ... Trust

 

నమ్మకం ... Trust.



• నమ్మకం అనే పదం ప్రతి  మనిషి జీవితానికి మనుగడకు పునాది. ఈ నమ్మకం అనేది మనసు లో కానీ, మెదడు లో కానీ బలంగా లేకపోతే మనిషి  క్రమేపీ నిర్వీర్యం అయిపోతాడు.


• ప్రతి మనిషి లో నమ్మకం అనేది రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి మనసు తో, రెండవది మెదడు తో.


• ఏదైనా  విషయం  పట్ల అయినా లేదా ఎవరి పట్ల అయినా మనసు తో  ఆలోచిస్తూ  నమ్మకం ఉంచితే,   అప్పుడు వచ్చే ఫలితాలు అయినటువంటి  లాభనష్టాలను,  సుఖదుఃఖాలను  సమానం గా ఆ  మనిషి  స్వీకరించగలడు.  ఒక విధంగా దీనినే గుడ్డి నమ్మకం అంటారు.  

మనసు తో  చేసిన  నమ్మకం   ఏనాడైనా వమ్ము అయినా సరే అది తాత్కాలికం.  దాని వలన తదుపరి ఏదో మంచి జరుగబోతోందని  లేదా  ఇంకా బలోపేతం కాబోతున్నాం అని అర్దం. ఎందుకంటే  మనసు తో  చేసే నమ్మకం లో  ఒక  అమాయకత్వం దాగి ఉంటుంది.

• అదే విధంగా ఏదైనా విషయం పట్ల కానీ లేదా ఎవరి పట్ల   అయినా   మెదడు తో  ఆలోచిస్తూ నమ్మకం ఉంచితే  అప్పుడు వచ్చే ఫలితాలు అయినటువంటి  లాభనష్టాలను, సుఖదుఃఖాలను  సమానమైన దృష్టితో  ఆ మనిషి స్వీకరించలేడు.  ఎందుకంటే మెదడు ఎప్పుడూ కూడా లాజిక్ తో, లెక్కలు వేసుకుంటూ స్వార్థం తో , నాకు ఏంటి లాభం అనే ఆలోచిస్తుంది.

• నమ్మకం అనేది మనిషి పుట్టుక నుంచి చావు వరకు జీవిత పయనాన్ని  నిర్ణయం చేసే సాధనం మరియు ఆలోచన.   ఏ మనిషి కి కూడా తన భవిష్యత్తు తెలియదు. ఏదైనా పని  తలపెట్టేటప్పడు  ఫలితం  ఎలా  వస్తుందో తెలియదు. అటువంటప్పుడు ప్రతీ అంశం లోను   నమ్మకం   అనే అంశం తోనే నిర్ణయం తీసుకుంటూ అడుగులు వేస్తాడు.

• అయితే నేటి మాయ కాలం లో ఏది నమ్మాలో, నమ్మకూడదో తెలియదు,  ముఖ్యం గా  ఎవరిని నమ్మాలో నమ్మకూడదో తెలియని విచిత్ర మైన పరిస్థితి  నేటి  సమాజం లో మనుషుల లో ఉంది. ఎందుకంటే నేడు మనుషులు , మనుషుల జీవన విధానం అంతా పూర్తి కలుషితం.    నిజాయితీ తో  కూడిన  ప్రేమ,  స్వచ్ఛత నిండిన  స్నేహం,  నిస్వార్థం,  సేవా తత్వం  వంటివి  చాలా వరకు కనుమరుగై పోయాయి .  దురదృష్టం ఏంటంటే  కొందరైతే , ఇటువంటి  మంచి లక్షణాలను బయటకు చూపిస్తూ  ఇతరులకు   ఆదర్శం గా కాకుండా  తమ రాజకీయ , వ్యాపార  పబ్లిసిటీ కోసం ఉపయోగించు కుంటున్నారు. 

ఎక్కువ శాతం  comparisons,   నమ్మక ద్రోహాం, ఈర్ష్య, స్వార్థం, స్వలాభం,  తోటి మనిషి ఎలా పోతే నాకేంటి  అన్నట్లే  90 శాతం  మానవ జీవన విధానం నడుస్తుంది. ఇలా ఉంటేనే కేవలం  బ్రతకగలం అనే నానుడి కి  అలవాటు పడిపోయారు. 

• మరి ఇటువంటి పరిస్థితుల్లో మంచి నమ్మకం, నిజాయితీ తో కూడిన నమ్మకం మనిషి కి  కావాలి అంటే ఎలా, ఎక్కడ దొరుకుతుంది, ఎవరు ఇస్తారు. తనకు ఉన్న నమ్మకం సరియైనదా కాదో ఎలా మనిషి తెలుసుకోగలడు. 

ఎందుకంటే మనిషి కి తన నమ్మకం నిజమైనపుడే తనలో విశ్వాసం పెరుగుతుంది. తన సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. 


మనిషి ఏనాడైతే గుడ్డిగా అచంచలమైన మనసు తో దైవం పై,  పరమాత్మపై నమ్మకం ఉంచుతాడో అప్పుడు మాత్రమే భగవత్ శక్తి తో సత్యం, నిజం, భవిష్యత్తు తెలుసుకొని నిర్ణయాలు తీసుకోగలడు. తన నమ్మకాన్ని  పెంపొందించుకోగలడు. 


• అదే విధంగా మనిషి తన అవసరాల కోసం మెదడు ని నమ్ముకుని  ఉన్నప్పుడు  కేవలం లాజిక్ మాత్రమే పని చేస్తుంది. లాజిక్ అనేది కొన్ని సార్లు మాత్రమే పని చేస్తూ నమ్మకాన్ని నిజం చేస్తుంది, కానీ చాలా సార్లు మాత్రం ఈ లాజిక్ ఫెయిల్ అయ్యి నమ్మకాన్ని వమ్ము చేసి దుఃఖం కలిగేలా చేస్తుంది. ఇది ముమ్మాటికీ సత్యం. 


• మనిషి జీవితం  "ఒక అవసరం."   అవునన్నా కాదన్నా ఇది నిజం. ఈ అవసరం లో నుంచే ఎన్నో ఎన్నెన్నో పుట్టుకొస్తాయి.  అందులోదే నమ్మకం కూడా.


• తోటి మనుషుల ను , బంధాలను,  ప్రేమలను , స్నేహాలను   నమ్మాలి , నమ్మకం ఉంచాలి, కానీ వీటిపై ఆధారపడకూడదు.  అవును  నిజమే, ఆధారపడకూడదు. 

ఇదెలా సాధ్యం …. ఆధార పడకుండా ఎవరినైనా ఎలా నమ్ముతాం అనిపించవచ్చు. ఆత్మ విశ్వాసం కలిగి ఉంటే , అది సాధ్యం.  గమనించాలి ఆత్మ విశ్వాసానికి ,  అహంకారానికి   చాలా తేడా ఉంది.  చాలా మంది ఈ విషయం గమనించ లేరు.  ఆత్మ విశ్వాసం ఎటువంటి ప్రతికూల పరిస్థితి లో  కూడా  దుఃఖం ఇవ్వదు . అదే  అహంకారం అయితే  విపరీతమైన దుఃఖం ఇస్తుంది.

  

• దేనిమీదైనా,  ఎవరిమీదైనా  ఆధారపడకుండా మనిషి తనపై తాను నమ్మకం కలిగి ఉన్నప్పుడు , వచ్చే ఫలితం  ఎటువంటిదైనా  సరే,   ముందుగా  మనిషి లో  పెరిగేది మాత్రం  ఆత్మ విశ్వాసం. 


• ఏదైనా వస్తువు పై  గానీ లేదా ఒకరి పై కానీ మానసికంగా ఆధారపడడం అనేది మొదలైతే ,  వారిపై  ఉన్న  నమ్మకం   వమ్ము   అయిన పరిస్థితి తలెత్తితే కోలుకోవడం చాలా కష్టం.  మనిషి మానసికంగా తనపై తాను ఆధారపడే శక్తి సంపాదించు కోవాలి. అంతే కానీ ఇతరుల పైన పొరపాటు న కూడా ఆధారపడితే మిగిలేది దుఃఖం, క్షోభ.


అదే విధంగా మనిషి తన స్వప్రయోజనాల కోసం, అవసరం కోసం ఇతరులను నమ్మించడం,  మోసం చేయడం , మాయ మాటలు చెప్పడం అనేవి చేస్తే,  వారికే చాలా ప్రమాదకరం,  మహా పాపం. 

ఆలోచన లలో స్పష్టత ఉంటే, నమ్మకం అనేది ఏనాడూ వమ్ము కాదు. మనిషి కి అర్దం కానిది ఏమిటంటే కాలం, కర్మ అనేవి నిరంతరం మనిషి అంతర్గత ఆలోచనలను,  నమ్మకాలను కూడా గమనిస్తూనే ఉంటాయి. తద్వారా ఫలితాలు ఇస్తుంటాయి.  ఎందుకంటే మనిషి ఒక ఎనర్జీ కాబట్టి.


చివరిగా   

నమ్మండి … నమ్మకం ఉంచండి.

దేనికి కూడా ఎవరినీ నమ్మించే లా ప్రవర్తించకండి,  ప్రేరేపించకండి …. నమ్మక ద్రోహాం చేయకండి.


ఒకరి కి ఆధారం అవ్వండి … కానీ ఎవరిపైనా ఆధార పడకండి.


ఎవరైనా స్వతహాగా,  మిమ్మల్ని  నమ్మితే  ఆ నమ్మకాన్ని వమ్ము చేయకండి.


ఎవరూ కూడా తమ నమ్మకాన్ని కోల్పోయే లా  నమ్మిన  వారితో  ప్రవర్తించకండి. 

ఎంతటి వారైనా ఒకసారి నమ్మకం కోల్పోతే తిరిగి సంపాదించుకోవడం   అ సం భ వం.


🌿🌿🌿🌿🌿


మెదడు లో ఆలోచనలకు  కళ్లు  ఉంటాయి.  

మనసు లో ఆలోచనలకు  మాత్రం  కళ్లు  ఉండవు. 

అందుకే మనసు ఎప్పుడూ గుడ్డిదే. ఎంత దూరం అయినా, దారి తెలియక పోయినా మనసు అలసట తెలియకుండా  సునాయాసంగా ప్రయాణం చేస్తుంది. 

కానీ,  మెదడు కేవలం తన కళ్లతోనే  లెక్కలు వేసుకుంటూ , కనిపించే మేరకు మాత్రమే పరిమితమైన  ప్రయాణం చేస్తుంది.   

మెదడు , మనసు రెండింటి కి  ఆలోచన శక్తి ఉన్నా,  ముమ్మాటికీ రెండు ఒకటి  కాదు , ఎన్నటికి కాబోవు.  

మెదడు  వ్యాపారం (లెక్కలు, అంచనాలు) చేయడానికి  సహాయపడుతుంది. 

మనసు  కాలం తో  కలిసి  జీవిత పయనం సజావుగా  చేయడానికి సహాయపడుతుంది.

కానీ  మనసు తో   మనుషుల మీద  లాజిక్ లు, ఊహలు,  లాభ నస్టాలు   బేరీజు  వేసుకుంటే  చివరికి మిగిలేది  నష్టం,  క్షోభ, యాతన,  దుఃఖం.  

మనసు  యెక్క  ధర్మం  నిజాయితీ. 

మెదడు యొక్క  ధర్మం  తెలుసుకోగలడం.

ఎందుకంటే  

మెదడు .... శ్రీ రాహువు ♨️(ధూమం, మాయ) .

మనసు .... శ్రీ కేతువు 🙏  (సత్యం, దైవం). 

మనసు తో   మెదడు ని జయించినపుడే  మనిషి లో పరిపూర్ణత సంభవం.  

దైవం తో మాత్రమే మాయని  జయించగలం. 

మాయ , దైవం  రెండు కూడా  ప్రతి మనిషి లో  తప్పకుండా  ఉంటాయి.  ఏది activate చేసుకుంటే  అదే ఈ జన్మకు సరిపడా  జీవితం.


 ఓం నమఃశివాయ 🙏.

 యడ్ల శ్రీనివాసరావు 9 Dec 2023 , 11:00 pm.


Friday, December 8, 2023

432. నరమేధం

 

నరమేధం


• ఓ జీవమున్న   మనిషి

  నీ జీవిత   దారేది.

• వినాశనానికి   విత్తులు వేస్తూ

  భ్రష్టు తోనే     బ్రతుక ని

  మాయలో    పడి

  మృగం వలే  మారావు.


• ఓ. జీవమున్న    మనిషి

  నీ జీవిత   దారేది.

• మనుగడ    కోసం

  మనిషి వని    మరిచి.

  సొంత ధర్మము    విడిచావు.

  శాంతి కి తూట్లు   పొడిచావు.


• ఓ జీవమున్న    మనిషి

  నీ జీవిత    దారేది.

• మతోన్మాదం  తో

  మానవాళిని   తుంచుతు

  పచ్చటి    నేలను

  రక్తపుటేరులు   చేశావు.


• ఓ జీవమున్న     మనిషి

  నీ జీవిత    దారేది.

• ఉగ్రవాదం    తో

  ఉసూరు  మంటూ.

  తీవ్ర వాదం    తో

  నరమేధం   సృష్టించావు.


• ఓ జీవమున్న    మనిషి

  నీ జీవిత    దారేది.

• జాతి    పిచ్చితో

  దైవం    అంటూ

  దెయ్యం పీడ ని   పెంచావు 

  తుదకు   ప్రేతాత్మ లా    జీవిస్తున్నావు.


యడ్ల శ్రీనివాసరావు 8 Dec 2023 , 9:30 pm.


Thursday, December 7, 2023

431. సాహితి


సాహితి


• సాహితి   ఓ   నా   సాహితి

  హితము తో    చేశావు

  నను   నీ  పతి.


• నీ  పదము లో   పరిమళం

  సాగరాలు   దాటినా

  నీ తొలి వలపు    కావ్యం

  కమలమై    నిలిచేను.


• సాహితి    ఓ  నా   సాహితి

  హితము తో    చేశావు

  నను    నీ  పతి.


• రచన   చేరి

  నీ కౌగిలి లో

  నవరసాలను   పుణికిస్తుంటే 

  సిగ్గు   లొలికే

  నీ  సౌందర్యం

  దోసిలి లో    పులకరిస్తుంది.


• కలము     ఎరుగని

  కవిత వై     కదలాడుతూ

  సొగసు   నిండిన

  జవరాలి లా   నాట్యమాడేవు.


• సాహితి    ఓ  నా   సాహితి

  హితము తో    చేశావు

  నను  నీ   పతి.


• కవి ని   కాని   నను

  నీ ప్రేమ తో    కనికరించావు.

• మనసు   ఎరిగిన

  భావాలతో     ఆవహించావు.

• చందమ నే     భాష తో

  చంద్ర కళను    నింపావు.

• కనులు మూసి    తెరవగ 

  ప్రాసలను     పరిచావు.


• సాహితి    ఓ  నా   సాహితి

  హితము తో    చేశావు

  నను  నీ   పతి.


యడ్ల శ్రీనివాసరావు 7 Dec 2023  8:00 pm.


Monday, December 4, 2023

430. మందాకిని

 

మందాకిని


• ఓ  సన్నజాజి    నా   అపరంజి.

  ఇది   యే   కాలమో

  ఇది   యే   రాగమో.

  ఇది  యే   సంతమో

  ఇది యే    వసంతమో.


• ముసురు   కమ్మిన   ఈ వేళ

  మసక బారని    నీ  అందం 

  మల్లె లా  వికసిస్తుంది

  మనసు  మోహనం  చేస్తుంది.


• ఓ సన్నజాజి నా అపరంజి.

  ఇది    యే  కాలమో

  ఇది    యే  రాగమో.


• ఈ పిల్ల తెరల     జల్లుల లో

  కేరింత  లేస్తూ నే    

  ఆ నల్ల మబ్బుల    మెరుపుల లో

  వెలుగు నిస్తున్నావు .  


• ఓ  సన్నజాజి    నా   అపరంజి.

  ఇది యే    భావమో 

  ఇది యే   మోహమో 


• తుళ్లిపడే    నీ కళ్ల చూపుల కు

  దాసోహం.

  ఎగసిపడే    నీ ఎద బిగువు  కి

  సిద్ధం.


• ఓ సన్నజాజి    నా అపరంజి.

  ఇది   యే  సంతమో

  ఇది   యే  వసంతమో


• నీ నడుము   వీణను  మీటగా 

  కుడి ఎడమ   ఆడిన నాట్యం

  చిరు జల్లులు   చిమ్ముతూ 

  చిటపటలు  ఆడాయి.


• ఇది యే    భావమో

  ఇది యే    మోహమో

  ఇది యే    కాలమో

  ఇది యే     రాగమో 

  ఇది యే     సంతమో

  ఇది యే     వసంతమో

• ఓ  సన్నజాజి    నా   అపరంజి.


సంతము = సొంతము.

అపరంజి = బంగారు బొమ్మ 

యడ్ల శ్రీనివాసరావు 4 Dec 2023 1:00 pm


490. జన గళం

జన గళం • జనమెత్తిన   గళము లో   ఈ పవనం    లేచే  లే. • కదమేగిన    పోటు లో   ఈ కదనం    సాగే  లే. • గుప్పెడు   పిడికిలి   గుండేలే   ఈ   ధై...