తొలి వలపు
• తొలి వలపు ఆస్వాదన
తొలకరి గా చిగురించె నా.
• ఆశ లో మెరిసే ఆనందం
ఆవిరి లో కలిసే ఆక్రోశం.
• ఈ రేయి నాదే నని
ఈ గాలి లో తాను ఉన్నాడని
సాగరం చెపుతోంది
అలల ఘోష లో వినిపిస్తోంది.
• ఆశ లో మెరిసే ఆనందం
ఆవిరి లో కలిసే ఆక్రోశం.
• ఈ వెన్నెల్లో వేదం లా మిగిలాను
నా ప్రేమ కు అద్దం లా ఉన్నాను.
• గతమంతా గంధర్వ మైనా
స్మృతుల న్నీ ఇసుకలో మిగిలాయి.
• తొలి వలపు ఆస్వాదన
తొలకరి గా చిగురించె ను.
• ఈ రేయి నాదే నని
ఈ గాలి లో తాను ఉన్నాడని
సాగరం చెపుతోంది
అలల ఘోష లో వినిపిస్తోంది.
• నా వాడు నేడు నాతోడు లేడు.
నింగి లో నీడై నను తాకుతుంటాడు.
• జాబిలి చూస్తుంది జాలిగా.
పలకరిస్తోంది నన్నే సాక్షి గా.
• ఆశ లో కలిసే ఆనందం
ఆవిరి లో కరిగే అశ్రువు.
• తొలి వలపు ఆస్వాదన
వెలిసిన ఆ రా ధ న.
ఆక్రోశం = విచారం, బాధ
అశ్రువు = కన్నీటి బిందువు.
యడ్ల శ్రీనివాసరావు 24 Dec 2023 9:10 pm.
No comments:
Post a Comment