Saturday, December 9, 2023

433. నమ్మకం ... Trust

 

నమ్మకం ... Trust.



• నమ్మకం అనే పదం ప్రతి  మనిషి జీవితానికి మనుగడకు పునాది. ఈ నమ్మకం అనేది మనసు లో కానీ, మెదడు లో కానీ బలంగా లేకపోతే మనిషి  క్రమేపీ నిర్వీర్యం అయిపోతాడు.


• ప్రతి మనిషి లో నమ్మకం అనేది రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి మనసు తో, రెండవది మెదడు తో.


• ఏదైనా  విషయం  పట్ల అయినా లేదా ఎవరి పట్ల అయినా మనసు తో  ఆలోచిస్తూ  నమ్మకం ఉంచితే,   అప్పుడు వచ్చే ఫలితాలు అయినటువంటి  లాభనష్టాలను,  సుఖదుఃఖాలను  సమానం గా ఆ  మనిషి  స్వీకరించగలడు.  ఒక విధంగా దీనినే గుడ్డి నమ్మకం అంటారు.  

మనసు తో  చేసిన  నమ్మకం   ఏనాడైనా వమ్ము అయినా సరే అది తాత్కాలికం.  దాని వలన తదుపరి ఏదో మంచి జరుగబోతోందని  లేదా  ఇంకా బలోపేతం కాబోతున్నాం అని అర్దం. ఎందుకంటే  మనసు తో  చేసే నమ్మకం లో  ఒక  అమాయకత్వం దాగి ఉంటుంది.

• అదే విధంగా ఏదైనా విషయం పట్ల కానీ లేదా ఎవరి పట్ల   అయినా   మెదడు తో  ఆలోచిస్తూ నమ్మకం ఉంచితే  అప్పుడు వచ్చే ఫలితాలు అయినటువంటి  లాభనష్టాలను, సుఖదుఃఖాలను  సమానమైన దృష్టితో  ఆ మనిషి స్వీకరించలేడు.  ఎందుకంటే మెదడు ఎప్పుడూ కూడా లాజిక్ తో, లెక్కలు వేసుకుంటూ స్వార్థం తో , నాకు ఏంటి లాభం అనే ఆలోచిస్తుంది.

• నమ్మకం అనేది మనిషి పుట్టుక నుంచి చావు వరకు జీవిత పయనాన్ని  నిర్ణయం చేసే సాధనం మరియు ఆలోచన.   ఏ మనిషి కి కూడా తన భవిష్యత్తు తెలియదు. ఏదైనా పని  తలపెట్టేటప్పడు  ఫలితం  ఎలా  వస్తుందో తెలియదు. అటువంటప్పుడు ప్రతీ అంశం లోను   నమ్మకం   అనే అంశం తోనే నిర్ణయం తీసుకుంటూ అడుగులు వేస్తాడు.

• అయితే నేటి మాయ కాలం లో ఏది నమ్మాలో, నమ్మకూడదో తెలియదు,  ముఖ్యం గా  ఎవరిని నమ్మాలో నమ్మకూడదో తెలియని విచిత్ర మైన పరిస్థితి  నేటి  సమాజం లో మనుషుల లో ఉంది. ఎందుకంటే నేడు మనుషులు , మనుషుల జీవన విధానం అంతా పూర్తి కలుషితం.    నిజాయితీ తో  కూడిన  ప్రేమ,  స్వచ్ఛత నిండిన  స్నేహం,  నిస్వార్థం,  సేవా తత్వం  వంటివి  చాలా వరకు కనుమరుగై పోయాయి .  దురదృష్టం ఏంటంటే  కొందరైతే , ఇటువంటి  మంచి లక్షణాలను బయటకు చూపిస్తూ  ఇతరులకు   ఆదర్శం గా కాకుండా  తమ రాజకీయ , వ్యాపార  పబ్లిసిటీ కోసం ఉపయోగించు కుంటున్నారు. 

ఎక్కువ శాతం  comparisons,   నమ్మక ద్రోహాం, ఈర్ష్య, స్వార్థం, స్వలాభం,  తోటి మనిషి ఎలా పోతే నాకేంటి  అన్నట్లే  90 శాతం  మానవ జీవన విధానం నడుస్తుంది. ఇలా ఉంటేనే కేవలం  బ్రతకగలం అనే నానుడి కి  అలవాటు పడిపోయారు. 

• మరి ఇటువంటి పరిస్థితుల్లో మంచి నమ్మకం, నిజాయితీ తో కూడిన నమ్మకం మనిషి కి  కావాలి అంటే ఎలా, ఎక్కడ దొరుకుతుంది, ఎవరు ఇస్తారు. తనకు ఉన్న నమ్మకం సరియైనదా కాదో ఎలా మనిషి తెలుసుకోగలడు. 

ఎందుకంటే మనిషి కి తన నమ్మకం నిజమైనపుడే తనలో విశ్వాసం పెరుగుతుంది. తన సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. 


మనిషి ఏనాడైతే గుడ్డిగా అచంచలమైన మనసు తో దైవం పై,  పరమాత్మపై నమ్మకం ఉంచుతాడో అప్పుడు మాత్రమే భగవత్ శక్తి తో సత్యం, నిజం, భవిష్యత్తు తెలుసుకొని నిర్ణయాలు తీసుకోగలడు. తన నమ్మకాన్ని  పెంపొందించుకోగలడు. 


• అదే విధంగా మనిషి తన అవసరాల కోసం మెదడు ని నమ్ముకుని  ఉన్నప్పుడు  కేవలం లాజిక్ మాత్రమే పని చేస్తుంది. లాజిక్ అనేది కొన్ని సార్లు మాత్రమే పని చేస్తూ నమ్మకాన్ని నిజం చేస్తుంది, కానీ చాలా సార్లు మాత్రం ఈ లాజిక్ ఫెయిల్ అయ్యి నమ్మకాన్ని వమ్ము చేసి దుఃఖం కలిగేలా చేస్తుంది. ఇది ముమ్మాటికీ సత్యం. 


• మనిషి జీవితం  "ఒక అవసరం."   అవునన్నా కాదన్నా ఇది నిజం. ఈ అవసరం లో నుంచే ఎన్నో ఎన్నెన్నో పుట్టుకొస్తాయి.  అందులోదే నమ్మకం కూడా.


• తోటి మనుషుల ను , బంధాలను,  ప్రేమలను , స్నేహాలను   నమ్మాలి , నమ్మకం ఉంచాలి, కానీ వీటిపై ఆధారపడకూడదు.  అవును  నిజమే, ఆధారపడకూడదు. 

ఇదెలా సాధ్యం …. ఆధార పడకుండా ఎవరినైనా ఎలా నమ్ముతాం అనిపించవచ్చు. ఆత్మ విశ్వాసం కలిగి ఉంటే , అది సాధ్యం.  గమనించాలి ఆత్మ విశ్వాసానికి ,  అహంకారానికి   చాలా తేడా ఉంది.  చాలా మంది ఈ విషయం గమనించ లేరు.  ఆత్మ విశ్వాసం ఎటువంటి ప్రతికూల పరిస్థితి లో  కూడా  దుఃఖం ఇవ్వదు . అదే  అహంకారం అయితే  విపరీతమైన దుఃఖం ఇస్తుంది.

  

• దేనిమీదైనా,  ఎవరిమీదైనా  ఆధారపడకుండా మనిషి తనపై తాను నమ్మకం కలిగి ఉన్నప్పుడు , వచ్చే ఫలితం  ఎటువంటిదైనా  సరే,   ముందుగా  మనిషి లో  పెరిగేది మాత్రం  ఆత్మ విశ్వాసం. 


• ఏదైనా వస్తువు పై  గానీ లేదా ఒకరి పై కానీ మానసికంగా ఆధారపడడం అనేది మొదలైతే ,  వారిపై  ఉన్న  నమ్మకం   వమ్ము   అయిన పరిస్థితి తలెత్తితే కోలుకోవడం చాలా కష్టం.  మనిషి మానసికంగా తనపై తాను ఆధారపడే శక్తి సంపాదించు కోవాలి. అంతే కానీ ఇతరుల పైన పొరపాటు న కూడా ఆధారపడితే మిగిలేది దుఃఖం, క్షోభ.


అదే విధంగా మనిషి తన స్వప్రయోజనాల కోసం, అవసరం కోసం ఇతరులను నమ్మించడం,  మోసం చేయడం , మాయ మాటలు చెప్పడం అనేవి చేస్తే,  వారికే చాలా ప్రమాదకరం,  మహా పాపం. 

ఆలోచన లలో స్పష్టత ఉంటే, నమ్మకం అనేది ఏనాడూ వమ్ము కాదు. మనిషి కి అర్దం కానిది ఏమిటంటే కాలం, కర్మ అనేవి నిరంతరం మనిషి అంతర్గత ఆలోచనలను,  నమ్మకాలను కూడా గమనిస్తూనే ఉంటాయి. తద్వారా ఫలితాలు ఇస్తుంటాయి.  ఎందుకంటే మనిషి ఒక ఎనర్జీ కాబట్టి.


చివరిగా   

నమ్మండి … నమ్మకం ఉంచండి.

దేనికి కూడా ఎవరినీ నమ్మించే లా ప్రవర్తించకండి,  ప్రేరేపించకండి …. నమ్మక ద్రోహాం చేయకండి.


ఒకరి కి ఆధారం అవ్వండి … కానీ ఎవరిపైనా ఆధార పడకండి.


ఎవరైనా స్వతహాగా,  మిమ్మల్ని  నమ్మితే  ఆ నమ్మకాన్ని వమ్ము చేయకండి.


ఎవరూ కూడా తమ నమ్మకాన్ని కోల్పోయే లా  నమ్మిన  వారితో  ప్రవర్తించకండి. 

ఎంతటి వారైనా ఒకసారి నమ్మకం కోల్పోతే తిరిగి సంపాదించుకోవడం   అ సం భ వం.


🌿🌿🌿🌿🌿


మెదడు లో ఆలోచనలకు  కళ్లు  ఉంటాయి.  

మనసు లో ఆలోచనలకు  మాత్రం  కళ్లు  ఉండవు. 

అందుకే మనసు ఎప్పుడూ గుడ్డిదే. ఎంత దూరం అయినా, దారి తెలియక పోయినా మనసు అలసట తెలియకుండా  సునాయాసంగా ప్రయాణం చేస్తుంది. 

కానీ,  మెదడు కేవలం తన కళ్లతోనే  లెక్కలు వేసుకుంటూ , కనిపించే మేరకు మాత్రమే పరిమితమైన  ప్రయాణం చేస్తుంది.   

మెదడు , మనసు రెండింటి కి  ఆలోచన శక్తి ఉన్నా,  ముమ్మాటికీ రెండు ఒకటి  కాదు , ఎన్నటికి కాబోవు.  

మెదడు  వ్యాపారం (లెక్కలు, అంచనాలు) చేయడానికి  సహాయపడుతుంది. 

మనసు  కాలం తో  కలిసి  జీవిత పయనం సజావుగా  చేయడానికి సహాయపడుతుంది.

కానీ  మనసు తో   మనుషుల మీద  లాజిక్ లు, ఊహలు,  లాభ నస్టాలు   బేరీజు  వేసుకుంటే  చివరికి మిగిలేది  నష్టం,  క్షోభ, యాతన,  దుఃఖం.  

మనసు  యెక్క  ధర్మం  నిజాయితీ. 

మెదడు యొక్క  ధర్మం  తెలుసుకోగలడం.

ఎందుకంటే  

మెదడు .... శ్రీ రాహువు ♨️(ధూమం, మాయ) .

మనసు .... శ్రీ కేతువు 🙏  (సత్యం, దైవం). 

మనసు తో   మెదడు ని జయించినపుడే  మనిషి లో పరిపూర్ణత సంభవం.  

దైవం తో మాత్రమే మాయని  జయించగలం. 

మాయ , దైవం  రెండు కూడా  ప్రతి మనిషి లో  తప్పకుండా  ఉంటాయి.  ఏది activate చేసుకుంటే  అదే ఈ జన్మకు సరిపడా  జీవితం.


 ఓం నమఃశివాయ 🙏.

 యడ్ల శ్రీనివాసరావు 9 Dec 2023 , 11:00 pm.


No comments:

Post a Comment

494. Failures Are Accurate Winners

  Failures Are Accurate Winners • అపజయం అనే పదం వినగానే ప్రతి మనిషి లో కలిగేది ఒక భయం, మానసిక ఆందోళన. మనిషి ఏదైతే కోరుకుంటాడో అది పొందక పో...