చిన్న నాటి హాయి
• చిన్న నాటి హయి
ఎక్కడుంది వోయి.
చిందు లేయకుంటే
హుషారెక్కడోయి.
• ఆడి పాడే తొక్కుడు బిళ్ళలు.
పోటా పోటీ గూటీ బిళ్ల లు.
లంగా వోణి చెమ్మ చెక్కలు.
నీటి గుంతల్లో కప్ప గెంతులు.
• ఎక్కడికి పోయాయి
ఏమై పోయాయి.
• ఆ రోజులు ఈ రోజులు
రోజులన్ని ఒక్కటే.
• కాలం లో రాని మార్పు
మనుషుల్లో ఎందుకు.
• చిన్న నాటి హయి
ఎక్కడుంది వోయి.
చిందు లేయకుంటే
హుషారెక్కడోయి.
• దొంగ పోలీసు దాగుడు మూతలు.
బొంగరాల కేరింతలు.
ఏడు పెంకుల బంతి ఆటలు.
తూరీగ వెనుక కొంటె పరుగులు.
• ఎక్కడికి పోయాయి
ఏమై పోయాయి.
• మసి పట్టిన మనసు లతో
మసక మసక ఆశల తో
మకిలి పట్టిన మనుషుల మై
మనకెందుకో ఈ బాధలు.
• చిన్న నాటి హయి
ఎక్కడుంది వోయి.
చిందు లేయకుంటే
హుషారెక్కడోయి.
• బంకమట్టి తో లక్క పిడతలు .
అష్టా చెమ్మ చింత పిక్కలు.
నేల బండ దూకుడు ఆటలు.
ఒప్పుల కుప్ప వయ్యారి భామలు.
• ఎక్కడికి పోయాయి
ఏమై పోయాయి.
• బాల్యం లో లేని శోకం
బంధాల తో ఎందుకు భారం.
• వయసు పెరిగి వృద్ధులైనా
మనసు తరుగుతుంటే నే బాల్యం ... బాల్యం.
• చిన్న నాటి హయి
మనతో నే ఉందోయి.
• తట్టి లేపావంటే
మనసంతా హాయి హాయి.
యడ్ల శ్రీనివాసరావు 19 Dec 2023 11:00 pm.
No comments:
Post a Comment