సాహితి
• సాహితి ఓ నా సాహితి
హితము తో చేశావు
నను నీ పతి.
• నీ పదము లో పరిమళం
సాగరాలు దాటినా
నీ తొలి వలపు కావ్యం
కమలమై నిలిచేను.
• సాహితి ఓ నా సాహితి
హితము తో చేశావు
నను నీ పతి.
• రచన చేరి
నీ కౌగిలి లో
నవరసాలను పుణికిస్తుంటే
సిగ్గు లొలికే
నీ సౌందర్యం
దోసిలి లో పులకరిస్తుంది.
• కలము ఎరుగని
కవిత వై కదలాడుతూ
సొగసు నిండిన
జవరాలి లా నాట్యమాడేవు.
• సాహితి ఓ నా సాహితి
హితము తో చేశావు
నను నీ పతి.
• కవి ని కాని నను
నీ ప్రేమ తో కనికరించావు.
• మనసు ఎరిగిన
భావాలతో ఆవహించావు.
• చందమ నే భాష తో
చంద్ర కళను నింపావు.
• కనులు మూసి తెరవగ
ప్రాసలను పరిచావు.
• సాహితి ఓ నా సాహితి
హితము తో చేశావు
నను నీ పతి.
యడ్ల శ్రీనివాసరావు 7 Dec 2023 8:00 pm.
No comments:
Post a Comment