తిరుమ లీశుడు
• తిరుపతిన అడుగిడిన
తిరువీధుల నడయాడిన
• తిరు నామమే ధరించి
తిరు గిరుల నెక్కిన
• తిరు తీర్థముల మునిగిన
తిరుమల లో బసజేసిన.
• తిరుప్పావై మనసును విన్న
తిరు మంగళములు పొందిన.
• తరిగొండ వెంగమాంబ
వడ్డింపులు వేడిగా ఆరగించిన .
• శ్రీనివాసుని నిత్య కళ్యాణం
సకల శుభముల సారంగము.
• శ్రీదేవి సిరుల తో నింపే
భూదేవి భువనము.
• పరమాత్మ సృష్టి నారాయణుడే
దేవతలు కొలిచేటి కొండలరాయుడు.
• కోరికలు తీర్చేటి కోదండరాముడే
కొంగు బంగారమై న చిన్నికృష్ణుడు.
• నిన్ను నన్ను కావ శివుడే
కారుణ్యుడై
కలియుగమున వెలిసే
వెండి కొండలపై " వేం కటే శ్వరునిగా" .
ఓం నమః శివాయః🙏
ఓం నమో నారాయణాయః 🙏
సారంగము = ఏనుగు, మేఘము.
భువనము = జగము.
కావ = రక్షించు.
యడ్ల శ్రీనివాసరావు 19 Dec 2023 , 3:00 am.
No comments:
Post a Comment