ప్రేమ సాక్షి
• అవుతా అవుతా
నాకు నేను
సాక్షి గ అవుతా.
• పంచ భూతాల
మిళితం అవుతా.
• గాలినై (Air)
నిను తాకుతూ
నీ ఊపిరి నవుతా.
• నీటి చినుకు నై (Water)
జారి
చల్లని సేద నవుతా.
• అవుతా అవుతా
నాకు నేను
సాక్షి గ అవుతా.
• మనసు అనే సాక్ష్యం తో
అద్దం అవుతా.
• అగ్ని లోని (Fire)
వెచ్చదనం తో
ఓదార్పు ని అవుతా.
• నింగి అంత (Sky)
శూన్యమై
నీ లో నిండి ఉంటా.
• అవుతా అవుతా
నాకు నేను
సాక్షి గ అవుతా.
• మట్టిలో (Earth)
" నే "
నీ ఉనికిని అవుతా.
• ఈ ప్రకృతిలో (Nature)
నీ తోడు కాని
నీడను నేనే అవుతా.
• అవుతా అవుతా
పంచ భూతాల
మిళితం అవుతా.
• నా లోని ప్రేమ కు
ప్రాణం అవుతా.
• మనిషే లేని ప్రేమ తో
సరి కొత్త ప్రేమ కు
నేనో
నిర్వచనం అవుతా.
యడ్ల శ్రీనివాసరావు 16 Dec 2023 6:00 am.
No comments:
Post a Comment