అంతరంగం - శివుని శ్రేష్టం
• నడివయసు లో నే
అడుగిడితి శివా.
• నీ స్మరణ తోనే
నిత్య దైనందనము.
నీ ఫలము తోనే
నిత్య జీవనము.
• నా జీవన నావ కు
చుక్కానివయి
తీరం దాటించు శివా.
• ఏమి భాగ్యమో ...
ఆశలు అడుగిడినవి.
ఆడంబరములు మరుగడినవి.
• నడివయసు లో నే
అడుగిడితి శివా.
• నీ స్మరణ తోనే
నిత్య దైనందనము.
నీ ఫలము తోనే
నిత్య జీవనము.
• నిను తలచు తీరికను ఇచ్చావు.
జన్మాంతరాల జ్ఞప్తి నిచ్చావు.
• కర్మలు తెలిపే జ్ఞానం ఇచ్చావు.
బుణములు తీర్చే శక్తి నిచ్చావు.
• రా 'తల్లో’ కరిగించావు కర్మలు.
చే ‘తల్లో’ చేయించు సేవలు .
• వృధా వ్యాపకాల తో
వృద్ధుడిని కాబోను.
• వ్యర్థ వాక్కు లతో
కాలం గడపబోను.
• నడివయసు లో నే
అడుగిడితి శివా.
• నీ స్మరణ తోనే
నిత్య దైనందనము.
నీ ఫలము తోనే
నిత్య జీవనము.
• నేను నేనుగా గాక
మర మనిషి లా ఉండలేను.
మరో మనిషి లా మారలేను.
• ముక్కంటి
ముద్దు మోము మరచి
మాయలో మునగలేను.
• సంసారము సాకారము
సంబర మనుకున్నాను గానీ …
• ఇంగితమున
శివుడే
నా సర్వమని తెలుసుకున్నాను.
• విభూదిని విడచి
విఘడియ నే నుండలేను.
• విలాసిని మరచి
ఊపిరి తీయను లేను.
• కంటి లో నే కాదు
నా ఒంటి లో కూడా
ఇంకి పోవా శివా.
• నడివయసు లో నే
అడుగిడితి శివా.
• నీ స్మరణ తోనే
నిత్య దైనందనము.
నీ ఫలము తోనే
నిత్య జీవనము.
ఓం నమః శివాయః 🙏
యడ్ల శ్రీనివాసరావు 18 Dec 2023 , 2:30 am
No comments:
Post a Comment