Saturday, February 26, 2022

137. పాలపిట్ట


పాలపిట్ట

• అందమైన తోటలో….

• అందాల పాలపిట్టకు….

• ఆనందాల హరివిల్లు తో….

• సంబరాలై సాగెను….

• తన జీవితం శుభ సంకల్పాలతో నిండెను.


• కాలం సాగుతుంది కమనీయంగా….

• జీవితం సాగుతుంది సంతోషంగా.


• పరువాల పాలపిట్ట కు…

• పరిణయమే అయ్యెను…

• బుల్లి పిట్టలకు జన్మను ఇచ్చెను.


• పుట్టిన పిట్టలను పల్లకిలో ఊరేగించెను.

• కాయం చేసి కందమూలాలే తినిపిస్తూ…

• బృందావనం లో నే పెంచెను.


• కాలం సాగుతుంది అలలా….

• జీవితం సాగుతుంది ప్రవాహం లా.


• పరుగులు పెడుతున్న  జీ”వనం” లో….

• పాలపిట్ట తన పరువము నే  మరచిపోయేను.

• తన  ఉనికినే  కొల్పోయెను.


• పక్వం చేరిన బుల్లి పిట్టలు ఎగిరి పోయెను…

• ఖండాలు దాటి పోయెను.


• కాలం సాగుతుంది అలలా….

• జీవితం సాగుతుంది విగతం లా.


• పాలపిట్ట కుహు కుహు లే…..

• ఒంటరి రాగాలయ్యాయి.

• రెక్కల రెపరెపలే దశను కోల్పోయెను….

• దిశను మరచి పోయెను.


• కాలం సాగుతుంది అలలా….

• జీవితం సాగుతుంది వేదన లా.



• ఒకానొక రేయిన….

• నింగి నుండి జాబిల్లి జారి వచ్చెను…

• పాలపిట్టనే పలకరించెను…

• వెన్నెల నే తెచ్చి పెట్టెను…

• పరువాన్నే నింపి వెళ్లెను.


• కాలం సాగుతుంది ఊయలలా…

• జీవితం సాగుతుంది వెన్నెల లా.


• నాటి నుండి...

• పాలపిట్ట ఎదురు చూపులు…

• నిండు పున్నమి వెన్నెల కోసం….

• జాబిలి తో తోడు కోసం.


• కాలం సాగుతుంది ఊయలలా…

• పాలపిట్ట జీవితం సాగుతుంది...

• జీవన వేదం లా.


యడ్ల శ్రీనివాసరావు , 26 ఫిబ్రవరి 2022 , 11:00 pm.




Thursday, February 24, 2022

136. భయం - ధైర్యం

 భయం - ధైర్యం

• మనిషి ఓ మనిషి

• ఎదురేమున్నది నీకు….


• ఎదను తెరిచి వధను విరిచి చూడు.

• భయముకు నీవు బందీ అయిన నాడు…..

• నీ శ్వాస కూడా నిన్ను బెదిరిస్తూ నే ఉంటుంది.


• పీల్చే గాలి నీదైనపుడు….

• వేసే అడుగులు నీవైనపుడు…

• నీ లోని బలమేమిటో నీకు తెలియదా…


• ఒక్కడి వై వచ్చావు….

• ఒక్కడి వై వెళ్తావు.


• కాలం నీ స్నేహం…

• ప్రకృతి నీ ప్రాణం....

• వాటికే లేని భయం నీకెందుకు.


• దిగులు నీ దీనత్వం…

• ధైర్యం తో చూడు నీ ధృడత్వం నీకే తెలుస్తుంది.


• బ్రతకాల్సింది భయం తో బానిస లా కాదు….

• ధైర్యం తో దేవుని లా.


• అపజయాలు అంటే జయాలకి ఆపన్న సోపానాలు.

• ఉల్కలు , ఉలి దెబ్బలు లేనిదే నీ రూపానికి ఆకారం రాదని తెలుసుకో.


• నీ లక్ష్యానికి లంకణాలు లక్ష ఉండొచ్చు…

• కానీ నీ ఆలోచనే నీకు పదునైన విల్లు.


• మదన పడితే మానసిక వైకల్యం…

• కదనమున పడితే జీవన చైతన్యం.


• బ్రతుకంటే నువ్వు బ్రతకడం కాదు…

• నీ లా నలుగురు బ్రతకాలనుకోవడం.


• నీ వే శాశ్వతం కానపుడు….

• ఎందుకు నీకీ భయం.


యడ్ల శ్రీనివాస రావు 24 ఫిబ్రవరి 2022, 8:00 am.





Wednesday, February 23, 2022

135. మరణం కావాలే…చెలి

 మరణం కావాలే…చెలి


• మరణం కావాలే…

• చెలి మరణం కావాలే.

• నిను మననం చేస్తూ…

• నీ ఒడిలో నే మరణం కావాలే.



• నీ చేతి తో కలవని నా చేయికి…..

• చెలిమి ఎందుకే…

• నీతో నాకు కలిమి ఎందుకే.


• ఊయలలూగిన మన ఊసులు….

• ఊహలే అయినపుడు.

• మనం కలిసి వేసిన అడుగులు….

• వేదన నిస్తున్నాయే.


• మరణం కావాలే….

• చెలి మరణం కావాలే.

• నిను మననం చేస్తూ……

• నీ ఒడిలో నే మరణం కావాలే.


• నిను చూడని నా కనులకు….

• ఇంద్రధనుస్సు చీకటి లా ఉందే.


• నీ వయసు లోని వలపు…

• పరిమళమవుతుంటే.

• నిను చేరలేని నా మనసు…

• మరణం కావాలంటుందే.


• నీ మాట మౌనం అవుతుంటే…

• నీ కనులు నను చూడక ఉంటుంటే…

• శ్వాస భారం అవుతుందే…

• ఊపిరి ఆగిపోతుందే.



• ఎదురు చూసిన ఉషస్సు వి…

• నీవే అయ్యాక.

• నువు నా సొంతం కాదనిపిస్తుంటే…

• ఇక కాలం తో నాకేం పని ఉంది.

• నా గుండె లో కట్టిన నీ గుడికి….. 

• నా ఆరాధన తో అవసరం ఏముంది.



• మరణం కావాలే…

• చెలి మరణం కావాలే.

• నిను మననం చేస్తూ…

• నీ ఒడిలో నే మరణం కావాలే.



• నీ ప్రేమతో నా జన్మకు అర్థం చెప్పావు….

• నీ కౌగిలి చేరని నాకు ఈ లోగిలిలో పని ఏముందే.



• నువు నా సొంతం అని….

• ప్రకృతి చెపుతుంటే.

• నువు నా సొంతం కాదని….

• లోకం చెపుతుందే.


• ఎందుకు నాకే ఈ శిక్ష…



• ఆశ లేదే….

• అత్యాశ లేదే….

• నీవు లేని నాకు జీవించాలని లేదే.


• పెదవులు తెరవని దానివి…

• నాకై మనసే ఎందుకు తెరిచావే.


• చేతులు చాచని దానివి…

• నన్నే దగ్గర కెందుకు చేర దీసావే.


• గాయమైన మనసుకు….

• గంధం ఎందుకు పూసావే.


• నీ లా నేనుండ లేనే…

• అందుకే…

• మరణం కావాలే….

• చెలి మరణం కావాలే.

• నిను మననం చేస్తూ…

• నీ ఒడిలో నే మరణం పొందాలే.


• మరు జన్మ వరకు వేచి చూసే...

• ఆయువు లేదే…

• నాకు చిరాయువు లేదే.


యడ్ల శ్రీనివాస రావు , 23 ఫిబ్రవరి 2022, 11:30 pm. 




Friday, February 18, 2022

134. నా తండ్రి శివా 🙏

 

నా తండ్రి శివా🙏

• నిను వదిలి నేను ఏడ పోయేది నా తండ్రి శివా…

• నిను వదిలి నేను ఎట్టా బతికేది నా తండ్రి శివా…

• నీ మౌనము లోని మహిమ చూడకుండా నిదరెట్ల పోయేది శివా…నా తండ్రి శివా…

• నిశి తోని నీ సాథన….ఈ సృష్టి కే రక్షణ….. నేను ఏల మరిచేది నా తండ్రి శివా…

• కంఠమున గరళముతో బాధను మైమరచి……శాంతి కాముని వైన, నీ సేవ కు నేనెట్ట దూరం అయ్యేది….నా తండ్రి శివా.

• ఆర్తి తో ఉన్న నన్ను….. ఒడి కి చేరదీసి …..నీ చెంత లాలించితివి….నీ బుణమెట్ట తీర్చేది ,  నా తండ్రి శివా…..



• నిను వదిలి నేను ఏడ పోయేది నా తండ్రి శివా…

• నిను వదిలి నేను ఎట్టా బతికేది నా తండ్రి శివా…

• కనులు మూసిన నాకు……నీవు కనపడుతూ ఉంటే……కనులు తెరిచిన క్షణము నుండి నేనేడ వెతికేది…నా తండ్రి శివా.

• కరిగి పోయిన కాలమును కాలభైరవుని తోడ, కనులముందు కమనీయముగా చూపుతుంటే…. ఇంకేమి కావాలి నా తండ్రి శివా.

• చింతలను విడనాడాలంటే, చీకటే మేలని , సాధనతో నన్ను సానపెడుతున్నావు….నీ చేయి నేనెట్ట విడిచేది నా తండ్రి శివా.

• నా తల్లి పార్వతి కి నీవు కొంగు బంగారమైన ,   నీ నామస్మరణ చేయక,    నే   శ్వాసను ఎట్టా తీసుకునేది శివా….నా తండ్రి శివా.



• నిను వదిలి నేను ఏడ పోయేది నా తండ్రి శివా…

• నిను వదిలి నేను ఎట్టా బతికేది నా తండ్రి శివా…

• నీ పాదములు కడుగుటకు , నా కంట నీరు కడలి గా మారుతు ఉంటే …. అంతకన్నా భాగ్యము ఏముంది శివా…..నా తండ్రి శివా.

• శ్రేష్ట కర్శలచేత బుణములను కరిగించి , స్వేచ్ఛ నిస్తున్నది……నీ చేరువకే కదా శివా…నా తండ్రి శివా.

• జననము న నీవు, మరణము న నీవు….నడిమధ్య నాటకము నీ ఆట కదా …నా తండ్రి శివా.

• నీ నామమే శివం…..నా జీవనమే శవం….. నామము తోనే  జీవనం.....శివం లోనే శవం….. ఇదియే కదా నా జన్మ రహస్యం …..నా తండ్రి శివా.

• ఓం నమః శివాయ 🙏.


యడ్ల శ్రీనివాస్ 18 ఫిబ్రవరి 2022…4:30 am...


133. 🙏శ్రద్ధాంజలి శ్రీ జోజిబాబు ఫాదర్ గారు 🙏

 🙏 శ్రద్ధాంజలి 🙏



• ఎందరో గురువర్యులు……కొందరే స్ఫూర్తి ప్రదాతలు.

• ఎందరో గురు సంపన్నులు……కొందరే మార్గనిర్దేశకులు.

• ఎన్నో మట్టి ప్రమిదలలో జ్యోతి వెలిగించిన జ్ఞాన స్వరూపా వందనం…. మీకు మా అశృనందనం.

• నాడు క్రమము తప్పని మీ శిక్షణలోని కాఠిన్యమే…….నేటికీ మా జీవితానికి రక్షణ.

• ఆంగ్లమంటే ఆందోళన కాదు….. ఆంగ్లమంటే ఆహార్యం అన్న మీ రూపం , ఎందరో విద్యార్థులకు సాకారం.

• విలువలు అంటే వైడూర్యాలని……సుగుణములంటే జీవిత సోపానములని ఎందరినో తీర్చి దిద్దిన మీరు జ్ఞాన ఖనిజ సంపన్నులు.

• తెల్లని అంగీ లో మీ రూపం గాంభీర్యం…..కానీ మంచి ప్రణాళికల రూపకల్పనే మీ అసలు స్వరూపం.

• మీ కంఠ స్వర ప్రకంపనలు…. ప్రతి విద్యార్థికి జీవితకాల దార్శనికాలు.

• త్యాగనిరతి తో కూడిన మీ సేవ…. ప్రేమమూర్తి సన్నిధిని చేరుటకు బాట.

• కన్న తండ్రి ని మించిన తండ్రి దైవం అయితే….ఆ దైవ ఆజ్ఞతో ఎందరికో గురుతండ్రి అయ్యారు.

• నాడు పసి మనసు లలో మీరు నాటిన బీజాలు…. నేడు అనేకుల లో మహా వృక్షాలు అయ్యాయి.

• మీ సేవ కు …పాదాభివందనం…ఆత్మాభినందనం 🙏🙏🙏 జోజిబాబు ఫాథర్ గారు 🙏🙏🙏.

                        యడ్ల శ్రీనివాసరావు. 1988 SSC . RCM School. Pedaboddepalli.

Feb 15 2022 10:00 pm...


132. అమ్మా.....అమ్మా

 

 అమ్మా.....అమ్మా

• అమ్మా…. అమ్మా

• నీ దీవెన తో వెలిగించిన ఈ చిన్ని దీపం

• వెలుగు వెన్నెల గా మారేనా….

• వేదనను దూరం చేసే నా…..


• నీ ఒడిలో ఆడిన ఆటలతో

• నీ లాలి పాటలతో…..

• నా లోని అలజడులే ఆనందాలు గా మారాయి.


• మమతనే పంచి….

• మనసునే తీర్చి…..

• మనిషి ని చేశావు.


• సంసార తోటలో , నీ సంరక్షణ నీడలో ,

• తొడిమను పుష్పము గా చేసి…..

• ప్రేమ పరిమళం నింపావు.


• నువు చూపిన ప్రపంచం ఆకాశమంత నిర్మలం గా ఉంటే …

• నా లోని ఆవేదన అణువణువునా నిండి ఉందమ్మా.


• నే నడిచే బాట లో అందమైన ప్రకృతి అలరిస్తుంటే……

• మార్గం మంతా ముళ్ల తోనే నిండి ఉంది.


• పాదముల పదును కి ముళ్లు ముడుచుకుంటున్నాయి కానీ….

• కనుపాప కు మాత్రం ప్రకృతి ఆందోళన గా కనపడుతుంది.


• తోటమాలి వి నీవమ్మా…..

• నీ తోడు కావాలమ్మా.

.

• కరుగుతున్న రోజులతో

• కనులముందు జీవితమంతా

• కలలా ఉంటుంటే….

• ఇల లోని జీవితం నిజమనిపించేది ఎన్నడో…


• నీ దీవెన తో వెలుగు నింపమ్మా…. దారి చూపమ్మా.


యడ్ల శ్రీనివాసరావు , ఫిబ్రవరి 8 , 2022 , 10:30 pm.


Saturday, February 5, 2022

131, సగటు జీవి


 సగటు జీవి 

• ఓ జీవి…. సగటు జీవి

  లేస్తూనే ఊపిరి బరువయ్యేనా

  ఆలోచనల ఆరాటం మొదలయ్యేనా.


• ఆశల వెలుగుల్లో

  బాధ్యతల బంధాలలో

  మెదడు లోని లెక్కలతో

  మనసే మెలికలు తిరిగే నా

  ఓ జీవి... సగటు జీవి.


• కాలం పరిగెడుతూ ఉంది

  నా కేం అవసరమని.

• జీవనం కుంటుతూ ఉంది

   అవసరాల కొరతతో.


• ప్రయత్నాలు విడవకున్నా

  విజయాలు వెక్కిరిస్తూ నే ఉన్నాయి.

• ని  రాశ ,   ని స్సహాయతలలో  

 “ని”  ఆవిరయ్యెది ఎన్నడో.

• ఈ నిరీక్షణ ఎన్నాళ్ళో

   ఇంకా ఎన్నేళ్ళో 


• ఓ జీవి…సగటు జీవి

• కళ్ల లోని ఆశయాలు 

  చైతన్యం చెందుతుంటే

  ఆచరణకు నోచుకోక  ఆవిరవుతున్నాయి.


• ఆకలిని కొలత కొలిచే 

  తూనిక జీవితంతో 

  స్నేహం అపురూపం.


• ఉన్న దేదో చూడ లేక

  లేని దానిని పొందలేక

• గడియారపు లోలకం లా

   సాగుతుంది  సగటు జీవి జీవనం.


నిశితంగా గమనిస్తే ,  స్థిమితంగా ఆలోచిస్తే


• సగటు జీవి జీవనం సగమే 

 అయినా …. జీవితం మాత్రం సంపూర్ణం.

• నిరాడంబర జీవనమే

  సగటు జీవికి జయం.


• మనసు లోని మమతలు

  మనిషి లోని మమకారాలు

  అమితమైన ఆప్యాయతలు 

  కలిగి ఉన్న కుబేరుడు   సగటు జీవి.


• భౌతిక జీవన ఎడారి లో

  సుఖం తెలియని 

  మానసిక ఐశ్వర్యవంతుడివి.


• సగటు జీవి మనసు 

  నిత్యం ఒక శిల్పం.

• దిన దిన రూపాంతరం తో

  అనేక రూపాల్లో  దర్శనం అవుతుంది.

• సగటు జీవికి సహనమే సంపద.

• సగటు జీవి ఎప్పుడూ ఆదర్శమే.


• ఏ జీవన స్థాయి వారైనా పై స్థాయి, కింద స్థాయి లను , చూడకుంటే అదే ప్రతి మనిషికి సగటు జీవనం……అదే వారి జీవితానికి సరాసరి సమతూకం.

• ఈ భౌతిక ప్రపంచ జీవనం లో మనిషి కి ఏది ఎంత ఉన్నా పరిపూర్ణం (తృప్తి) అనే స్థితి ఉండదు. అందుకే నేను సగటు జీవిని అనుకునే వారి మనసు ఎప్పుడూ పరిపూర్ణం.


యడ్ల శ్రీనివాసరావు 1 ఫిబ్రవరి 2022 , 7:00 pm.


481. పరిమళ భాష

  పరిమళ భాష • ఏమిటో     ఈ  భాష   ఎద కే    తెలియని   ఆశ.   అనుభవం  లేని   యాస   సృష్టి   మూలానికి    శ్వాస. • అక్షరాలు   ఉండవు  కానీ   భావం ...