• ఓ జీవి…. సగటు జీవి
లేస్తూనే ఊపిరి బరువయ్యేనా
ఆలోచనల ఆరాటం మొదలయ్యేనా.
• ఆశల వెలుగుల్లో
బాధ్యతల బంధాలలో
మెదడు లోని లెక్కలతో
మనసే మెలికలు తిరిగే నా
ఓ జీవి... సగటు జీవి.
• కాలం పరిగెడుతూ ఉంది
నా కేం అవసరమని.
• జీవనం కుంటుతూ ఉంది
అవసరాల కొరతతో.
• ప్రయత్నాలు విడవకున్నా
విజయాలు వెక్కిరిస్తూ నే ఉన్నాయి.
• ని రాశ , ని స్సహాయతలలో
“ని” ఆవిరయ్యెది ఎన్నడో.
• ఈ నిరీక్షణ ఎన్నాళ్ళో
ఇంకా ఎన్నేళ్ళో
• ఓ జీవి…సగటు జీవి
• కళ్ల లోని ఆశయాలు
చైతన్యం చెందుతుంటే
ఆచరణకు నోచుకోక ఆవిరవుతున్నాయి.
• ఆకలిని కొలత కొలిచే
తూనిక జీవితంతో
స్నేహం అపురూపం.
• ఉన్న దేదో చూడ లేక
లేని దానిని పొందలేక
• గడియారపు లోలకం లా
సాగుతుంది సగటు జీవి జీవనం.
నిశితంగా గమనిస్తే , స్థిమితంగా ఆలోచిస్తే
• సగటు జీవి జీవనం సగమే
అయినా …. జీవితం మాత్రం సంపూర్ణం.
• నిరాడంబర జీవనమే
సగటు జీవికి జయం.
• మనసు లోని మమతలు
మనిషి లోని మమకారాలు
అమితమైన ఆప్యాయతలు
కలిగి ఉన్న కుబేరుడు సగటు జీవి.
• భౌతిక జీవన ఎడారి లో
సుఖం తెలియని
మానసిక ఐశ్వర్యవంతుడివి.
• సగటు జీవి మనసు
నిత్యం ఒక శిల్పం.
• దిన దిన రూపాంతరం తో
అనేక రూపాల్లో దర్శనం అవుతుంది.
• సగటు జీవికి సహనమే సంపద.
• సగటు జీవి ఎప్పుడూ ఆదర్శమే.
• ఏ జీవన స్థాయి వారైనా పై స్థాయి, కింద స్థాయి లను , చూడకుంటే అదే ప్రతి మనిషికి సగటు జీవనం……అదే వారి జీవితానికి సరాసరి సమతూకం.
• ఈ భౌతిక ప్రపంచ జీవనం లో మనిషి కి ఏది ఎంత ఉన్నా పరిపూర్ణం (తృప్తి) అనే స్థితి ఉండదు. అందుకే నేను సగటు జీవిని అనుకునే వారి మనసు ఎప్పుడూ పరిపూర్ణం.
యడ్ల శ్రీనివాసరావు 1 ఫిబ్రవరి 2022 , 7:00 pm.
No comments:
Post a Comment