Thursday, February 24, 2022

136. భయం - ధైర్యం

 భయం - ధైర్యం

• మనిషి ఓ మనిషి

• ఎదురేమున్నది నీకు….


• ఎదను తెరిచి వధను విరిచి చూడు.

• భయముకు నీవు బందీ అయిన నాడు…..

• నీ శ్వాస కూడా నిన్ను బెదిరిస్తూ నే ఉంటుంది.


• పీల్చే గాలి నీదైనపుడు….

• వేసే అడుగులు నీవైనపుడు…

• నీ లోని బలమేమిటో నీకు తెలియదా…


• ఒక్కడి వై వచ్చావు….

• ఒక్కడి వై వెళ్తావు.


• కాలం నీ స్నేహం…

• ప్రకృతి నీ ప్రాణం....

• వాటికే లేని భయం నీకెందుకు.


• దిగులు నీ దీనత్వం…

• ధైర్యం తో చూడు నీ ధృడత్వం నీకే తెలుస్తుంది.


• బ్రతకాల్సింది భయం తో బానిస లా కాదు….

• ధైర్యం తో దేవుని లా.


• అపజయాలు అంటే జయాలకి ఆపన్న సోపానాలు.

• ఉల్కలు , ఉలి దెబ్బలు లేనిదే నీ రూపానికి ఆకారం రాదని తెలుసుకో.


• నీ లక్ష్యానికి లంకణాలు లక్ష ఉండొచ్చు…

• కానీ నీ ఆలోచనే నీకు పదునైన విల్లు.


• మదన పడితే మానసిక వైకల్యం…

• కదనమున పడితే జీవన చైతన్యం.


• బ్రతుకంటే నువ్వు బ్రతకడం కాదు…

• నీ లా నలుగురు బ్రతకాలనుకోవడం.


• నీ వే శాశ్వతం కానపుడు….

• ఎందుకు నీకీ భయం.


యడ్ల శ్రీనివాస రావు 24 ఫిబ్రవరి 2022, 8:00 am.





No comments:

Post a Comment

567. బాల్యం తీపి

  బాల్యం తీపి  • చిన్న చిన్న    పాదాలకు   తెలియదు ‌  బాల్యం    తీపి   పసి బాల్యం   తీపి. • చిన్న చిన్న    పాదాలకు   తెలియదు   ప్రాయం  ...