Friday, February 18, 2022

132. అమ్మా.....అమ్మా

 

 అమ్మా.....అమ్మా

• అమ్మా…. అమ్మా

• నీ దీవెన తో వెలిగించిన ఈ చిన్ని దీపం

• వెలుగు వెన్నెల గా మారేనా….

• వేదనను దూరం చేసే నా…..


• నీ ఒడిలో ఆడిన ఆటలతో

• నీ లాలి పాటలతో…..

• నా లోని అలజడులే ఆనందాలు గా మారాయి.


• మమతనే పంచి….

• మనసునే తీర్చి…..

• మనిషి ని చేశావు.


• సంసార తోటలో , నీ సంరక్షణ నీడలో ,

• తొడిమను పుష్పము గా చేసి…..

• ప్రేమ పరిమళం నింపావు.


• నువు చూపిన ప్రపంచం ఆకాశమంత నిర్మలం గా ఉంటే …

• నా లోని ఆవేదన అణువణువునా నిండి ఉందమ్మా.


• నే నడిచే బాట లో అందమైన ప్రకృతి అలరిస్తుంటే……

• మార్గం మంతా ముళ్ల తోనే నిండి ఉంది.


• పాదముల పదును కి ముళ్లు ముడుచుకుంటున్నాయి కానీ….

• కనుపాప కు మాత్రం ప్రకృతి ఆందోళన గా కనపడుతుంది.


• తోటమాలి వి నీవమ్మా…..

• నీ తోడు కావాలమ్మా.

.

• కరుగుతున్న రోజులతో

• కనులముందు జీవితమంతా

• కలలా ఉంటుంటే….

• ఇల లోని జీవితం నిజమనిపించేది ఎన్నడో…


• నీ దీవెన తో వెలుగు నింపమ్మా…. దారి చూపమ్మా.


యడ్ల శ్రీనివాసరావు , ఫిబ్రవరి 8 , 2022 , 10:30 pm.


No comments:

Post a Comment

567. బాల్యం తీపి

  బాల్యం తీపి  • చిన్న చిన్న    పాదాలకు   తెలియదు ‌  బాల్యం    తీపి   పసి బాల్యం   తీపి. • చిన్న చిన్న    పాదాలకు   తెలియదు   ప్రాయం  ...