నా తండ్రి శివా🙏
• నిను వదిలి నేను ఏడ పోయేది నా తండ్రి శివా…
• నిను వదిలి నేను ఎట్టా బతికేది నా తండ్రి శివా…
• నీ మౌనము లోని మహిమ చూడకుండా నిదరెట్ల పోయేది శివా…నా తండ్రి శివా…
• నిశి తోని నీ సాథన….ఈ సృష్టి కే రక్షణ….. నేను ఏల మరిచేది నా తండ్రి శివా…
• కంఠమున గరళముతో బాధను మైమరచి……శాంతి కాముని వైన, నీ సేవ కు నేనెట్ట దూరం అయ్యేది….నా తండ్రి శివా.
• ఆర్తి తో ఉన్న నన్ను….. ఒడి కి చేరదీసి …..నీ చెంత లాలించితివి….నీ బుణమెట్ట తీర్చేది , నా తండ్రి శివా…..
• నిను వదిలి నేను ఏడ పోయేది నా తండ్రి శివా…
• నిను వదిలి నేను ఎట్టా బతికేది నా తండ్రి శివా…
• కనులు మూసిన నాకు……నీవు కనపడుతూ ఉంటే……కనులు తెరిచిన క్షణము నుండి నేనేడ వెతికేది…నా తండ్రి శివా.
• కరిగి పోయిన కాలమును కాలభైరవుని తోడ, కనులముందు కమనీయముగా చూపుతుంటే…. ఇంకేమి కావాలి నా తండ్రి శివా.
• చింతలను విడనాడాలంటే, చీకటే మేలని , సాధనతో నన్ను సానపెడుతున్నావు….నీ చేయి నేనెట్ట విడిచేది నా తండ్రి శివా.
• నా తల్లి పార్వతి కి నీవు కొంగు బంగారమైన , నీ నామస్మరణ చేయక, నే శ్వాసను ఎట్టా తీసుకునేది శివా….నా తండ్రి శివా.
• నిను వదిలి నేను ఏడ పోయేది నా తండ్రి శివా…
• నిను వదిలి నేను ఎట్టా బతికేది నా తండ్రి శివా…
• నీ పాదములు కడుగుటకు , నా కంట నీరు కడలి గా మారుతు ఉంటే …. అంతకన్నా భాగ్యము ఏముంది శివా…..నా తండ్రి శివా.
• శ్రేష్ట కర్శలచేత బుణములను కరిగించి , స్వేచ్ఛ నిస్తున్నది……నీ చేరువకే కదా శివా…నా తండ్రి శివా.
• జననము న నీవు, మరణము న నీవు….నడిమధ్య నాటకము నీ ఆట కదా …నా తండ్రి శివా.
• నీ నామమే శివం…..నా జీవనమే శవం….. నామము తోనే జీవనం.....శివం లోనే శవం….. ఇదియే కదా నా జన్మ రహస్యం …..నా తండ్రి శివా.
• ఓం నమః శివాయ 🙏.
యడ్ల శ్రీనివాస్ 18 ఫిబ్రవరి 2022…4:30 am...
No comments:
Post a Comment