సుఖం సంతోషం ఆనందం
• మనం జీవిస్తున్న దశా కాలం లో , ఎన్నో భావాలు, భావోద్వేగాలు కలిగి ఉంటాం. కానీ వాటన్నిటినీ మనం లో లోపల అనుభవిస్తూ అనుభూతి చెందుతూ ఉంటాం, కానీ వాటిపై సంపూర్ణ అవగాహన లేని ఎన్నో విషయాలు మన చుట్టూనే ఉన్నాయి . అంటే కొన్ని భావాల పై పూర్తి సూక్ష్మం , వ్యత్యాసాలు తెలియకుండానే దానిని మనం ఆపాదన చేసుకుని , ఆ భావాలను భాష గా ఉపయోగిస్తూ ఉంటాం .
ఉదాహరణకు సుఖం, సంతోషం, ఆనందం అనే పదాలను తరచూ వాడుతుంటాం. చూడడానికి మూడు భావాలు ఒకే స్థితి కి సంబంధించినవి గా అనిపిస్తాయి . కానీ వాస్తవానికి మూడింటికి చాలా వ్యత్యాసం ఉంది.
• సుఖం : అనేది శరీరం పొందే అనుభూతి . ఒక కారు లో ప్రయాణం చేస్తున్నంత సేపు లేదా ఒక ఏ.సి. ముందు కూర్చుని ఉన్నంత సేపు శరీరం సుఖాన్ని హాయిగా పొందుతుంది . సుఖం అనేది ఏ రూపంలో పొందినా అది శరీరానికి మాత్రమే వర్తిస్తుంది. సుఖం తాత్కాలికం .
ఒకోసారి మనం గమనించవచ్చు, ఏదైనా ప్రయాణం నిలబడి చాలా దూరం చేసినపుడు వెంటనే సుఖం లేదు అంటాం. ఎందుకంటే శరీరం అలసిపోయి ఉంటుంది కాబట్టి.
సుఖం దేహానికి సంబంధించిన అంశం.
వస్తు వాహన వైభోగాలు లేకపోతే సుఖం లభించదు అని అనుకుంటాం , కానీ ఇవేవి లేని పాత కాలం రోజులలో కూడా .
• సంతోషం : మనసు పోందే అనుభూతి . దీనికి శరీరం తో సంబంధం ఉండదు. ఏదైనా మంచి విషయం విన్నప్పుడు , మనకు నచ్చింది చూసినప్పుడు, మనం ఇష్టమైన వారితో ఉన్నప్పుడు , ఊహించుకున్నప్పుడు మన మనసు సంతోషంతో ఉరకలు వేస్తుంది . సంతోషం అనేది మనసు పొందే అనుభవం. సంతోషాన్ని నవ్వు ద్వారా , కేరింతలు ద్వారా అనేక రూపాల్లో బయటకు వ్యక్తపరుస్తాం.
సంతోషం మనసు కి సంబంధించిన అంశం.
ఊహించినవి , అనుకున్నవి , నచ్చినవి దొరకక పోతే పోతే సంతోషం లభించదు .
• ఆనందం : ఇది మనిషి యొక్క ఆత్మ పొందే స్థితి . ఆనందం అనేది శరీరం, మనసు రెండింటి కి అతీతమైనది. . రమిస్తూ ఉండడం. ఆనందం అలౌకికం . ఆనందం బయటకు కనిపించదు. ఆనందం అనేది ఒక నిశ్చలమైన నిశ్శబ్దం తో ఉంటూ , స్థితి గతులు , పరిస్థితులకు అతీతంగా ఉంటుంది . వస్తు వైభోగాల ప్రభావం తో ఇది జనియించదు . ఆనందాన్ని ఆత్మ మాత్రమే అనుభవిస్తుంది . ఆనందం ద్వారా వచ్చే శక్తి సుధీర్ఘ కాలం ఉంటుంది.
ఆనందం ఆత్మ కి సంబంధించిన అంశం.
ఏది ఉన్నా , లేక పోయినా అన్నింటికీ అతీతంగా నిత్యం దేదీప్యమానంగా ఆత్మ కి స్థితప్రజ్ఞత తో లభించేది ఆనందం. దీనిని నిత్యానందం అని కూడా అంటారు .
ఓం శాంతి
ఓం నమఃశివాయ 🙏
యడ్ల శ్రీనివాసరావు 24 JULY 2026 , 11:00 AM.

No comments:
Post a Comment