సుగుణాల శుభమాల
• సుగుణాల శుభమాల పరిమళం .
• మనిషి కి
సుగుణాల శుభమాల పరిమళం
• బ్రతుకు కి
బంగారు భావాలు అలంకరణం .
• రేయి పగల సాధారణం
చీకటి వెలుగు ల జీవితం .
• మనసు ఆకాశ నిర్మలం
చల్లని మేఘమైన విస్తారం .
• సుశీ లత ల కుటుంబం
చింతలు చిగురించని వనం .
• దరహసపు విరి వదనం
దివ్య పుష్పాల ధారణం .
• సుగుణాల శుభమాల పరిమళం
• మనిషి కి
సుగుణాల శుభమాల పరిమళం
• బ్రతుకు కి
బంగారు భావాలు అలంకరణం.
• వైషమ్య వికారాలు
మనిషి ని బంధించే సుడిగుండం.
• ఆలోచనల అలలు
ఆటుపోటుల సాగరం .
• అలకలు - అల్లిన మల్లెలు
వాడినా . . . వికసించును సంతోషం .
• బంధాలు - అల్లుకున్న తీగలు
వీడినా . . . విరియును ఆత్మానందం.
• సుగుణాల శుభమాల పరిమళం
• మనిషి కి
సుగుణాల శుభమాల పరిమళం .
• బ్రతుకు కి
బంగారు భావాలు అలంకరణం.
యడ్ల శ్రీనివాసరావు 21 Julyv2026 10:00 AM

No comments:
Post a Comment