Monday, July 13, 2026

766. ఆధ్యాత్మికత - పురోగతి

 

ఆధ్యాత్మికత - పురోగతి 



• భగవంతుని సాన్నిధ్యాన్ని ఒక్క క్షణమైనా నిజంగా అనుభవించ గలిగితే , అది మన జీవితంలో వెలుగును వెలిగించడానికి చాలు. దీపం వెలిగితే నీడ కూడా వెంట వస్తుంది. కానీ ఆ వెలుగు మనలోని అజ్ఞానాంధకారాన్ని తొలగించి జీవితానికి కొత్త దిశను చూపుతుంది.


• ప్రతిసారి భగవంతుని గురించి ఆలోచించినప్పుడు, అది ఒక అద్భుతమైన దివ్య శక్తిని అనుభవించినట్లుగా అనిపిస్తుంది. భగవంతుడు ఉన్నాడా లేదా అనే వాదన కంటే, మన విశ్వాసమే ఆయనను లేదా ఆయన శక్తి ని మన హృదయంలో సజీవంగా నిలబెడుతుంది.


 మనలో ఒక అద్భుతమైన శక్తి ఉంది. అదే మనకు జీవించే ఉత్సాహాన్ని, ఆలోచించే సామర్థ్యాన్ని, కార్యాచరణను ప్రసాదిస్తుంది. ఆ శక్తిని మనలో నింపింది ఎవరు? ఆ పరమశక్తినే మనం భగవంతుడు అని పిలుస్తాం.

విభిన్న అభిప్రాయాలు ఉండటం సహజం. కానీ ద్వేషం ఈర్ష్య అసూయ మాత్రం ఎప్పటికీ ఎవరి పట్ల సమర్థనీయం కాదు.  “విజ్ఞానాన్ని ఎప్పుడూ మనస్సాక్షి  నడిపించాలి .” 


• చరిత్ర ఎల్లప్పుడూ భవిష్యత్తుకు పాఠాలు నేర్పుతుంది. ఆధునిక యుగంలో కూడా సూర్యుడు తూర్పునే ఉదయిస్తూ పశ్చిమ దిక్కునే అస్తమిస్తాడు.  సత్యాలు ఎన్నటికీ మారవు . అవి సృష్టి నియమాలు. వాటిని గౌరవించడం , అనుసరించడం , ఆచరించడం   మన బాధ్యత.


• మీ ప్రతి శ్వాస‌ , ప్రతి ఉచ్ఛ్వాసం, ప్రతి నిశ్వాసం ఒక పరమశక్తి దృష్టిలోనే జరుగుతుంది. ఆ శక్తిని మీరు ఏ పేరుతో పిలిచినా పరవాలేదు. కానీ మన సమాజాన్ని నిర్మించి, ముందుకు నడిపించిన విలువలను, విశ్వాసాలను, సంప్రదాయాలను గౌరవించండి.


• అద్దం ముక్కలుగా పగిలిపోయినా, ప్రతి ముక్కలో మన ప్రతిబింబం కనిపిస్తుంది. తన స్వభావాన్ని అది కోల్పోదు. అలాగే మనం తెలిసో తెలియకో తప్పులు చేసినా, భగవంతుడు మనల్ని విడిచిపెట్టడు.

మన కర్తవ్యం జ్ఞానంతో ఆయనను తెలుసుకోవడం, స్థిరమైన విశ్వాసంతో ఆయనను నమ్మడం, నిర్మలమైన హృదయంతో ఆయనను అంగీకరించడం.


• జీవన పురోగతి కి అవసరమైన వృత్తి ఉద్యోగం , కుటుంబ పోషణ వృద్ధి పై దృష్టి సారించడం ప్రతీ ఒక్కరి భాధ్యత . అదే విధంగా ఉన్న కొద్ది పాటి విలువైన జీవితాన్ని కుట్రలకు కుతంత్రాలకు కామ వికారాలకు వ్యర్థ విషయాలకు తావు ఇస్తూ  కాలయాపన చేస్తే . . . భవిష్యత్తులో మరింత దుర్భరమైన కాలం లోకి మానవ జీవిత ప్రయాణం ఉంటుంది. అది ఆర్తనాదాలు తో నిండి ఉంటుంది అని అనడం లో ఏ సందేహం లేదు.  

సత్యం పలకడం , సత్యం ఆచరించడం అనేది నరం లేని ప్రతి నరుడి నాలుక కి ప్రాధమిక అవసరం . 

• ఆద్యాత్మికత అంటే వృద్దాప్యం లోకి అడుగుడిన తరువాత లేదా అవయవాలు సహకరించక , శరీరం మూల చేరిన సమయం లో మాత్రమే మనిషి కి అవసరం అనుకునే పుంగవులు , తమ యొక్క పాపాల భారాన్ని ఒక అనంతమైన నిధి వలే తమ తలపై జన్మ జన్మల కోసం సమకూర్చుకుంటున్నారు అని అర్దం. 

మనలో సత్యత  చిగురించినపుడే  సత్ సాంగత్యం పొంద  గలము. సత్ సాంగత్యాలు మాత్రమే సన్మార్గం లో నడిపిస్తాయి.

ఓం శాంతి 

ఓం నమఃశివాయ 

ఆత్మ 

13 July 2026 , 11:30 PM.


No comments:

Post a Comment

766. ఆధ్యాత్మికత - పురోగతి

  ఆధ్యాత్మికత - పురోగతి  • భగవంతుని సాన్నిధ్యాన్ని ఒక్క క్షణమైనా నిజంగా అనుభవించ గలిగితే , అది మన జీవితంలో వెలుగును వెలిగించడానికి చాలు. దీప...